ADVERTISEMENT
home / Health
అమ్మాయిలూ.. యోని విషయంలో ఈ అపోహలను తొలగించుకోండి!

అమ్మాయిలూ.. యోని విషయంలో ఈ అపోహలను తొలగించుకోండి!

లైంగిక పరమైన ఆరోగ్యం విషయంలో మహిళలు ఇంకా వెనకబడే ఉన్నారు. వాటికి సంబంధించి ఎన్నో సందేహాలున్నప్పటికీ వాటిని తీర్చుకొనే ప్రయత్నం చేసే వారు త‌క్కువే. ముఖ్యంగా యోనికి(vagina) సంబంధించి కొన్ని అపోహలనే(myths) నిజమని కొంద‌రు  బలంగా విశ్వసిస్తుంటారు. అలాంటి కొన్ని అపోహలను మీ నుంచి దూరం చేయాలని మేం భావిస్తున్నాం. యోని ఆరోగ్యం విషయంలో మహిళలకుండే అపోహలేంటి? అవి ఎందుకు నిజం కాదో ఇప్పుడు తెలుసుకొందాం. 

1. హైమన్ పొర మొదటి సారి సెక్స్ చేసినప్పుడు మాత్రమే చిరుగుతుంది – ఈ అపోహ అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ ఉంటుంది. కానీ మీ ఆలోచన తప్పు. హైమన్ పొర చాలా పలుచగా, సున్నితంగా ఉంటుంది. చిన్న ఒత్తిడికే అది చిరిగే అవకాశం ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడం, ఆటలు ఆడటం వంటి వాటి వల్ల హైమన్ పొర చిరిగిపోతుంది.

2. యోని నుంచి డిశ్చార్జి అవుతోందంటే.. అనారోగ్యం ఉన్నట్టే – అమ్మాయిలూ.. “మీరిదే ఆలోచనలో ఉంటే పొరపాటు చేస్తున్నట్టే”.. అన్ని సందర్భాల్లోనూ వెజైనల్ డిశ్చార్జి అనారోగ్యానికి సూచన కాదు. వాస్తవానికి వాసన లేని వైట్ డిశ్చార్జి యోని ఆరోగ్యంగా ఉందనడానికి సూచన. దీనిలో వెజైనల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడే మంచి బ్యాక్టీరియా నిండి ఉంటుంది. పైగా లూబ్రికెంట్‌గా కూడా పనిచేస్తుంది. వెజైనల్ డిశ్చార్జి రంగు భిన్నంగా ఉండి దుర్వాసన వస్తుంటే.. వెంటనే వైద్యురాలిని సంప్రదించడం మంచిది.

3. యోని నుంచి వెలువడే వాసన కూడా అనారోగ్యానికి సూచనే – ఇది కూడా అపోహే. సాధారణంగా జననాంగాల నుంచి లైట్‌గా వాసన వస్తుంటుంది. ఇది సహజం. అయితే హార్మోన్లలో వచ్చే మార్పులు, గర్భం ధరించడం, లైంగిక చర్యలో పాల్గొనడం వంటి వాటి వల్ల ఈ వాసన మరింత ఎక్కువగా వస్తుంది. అంతే తప్ప మీరనుకొన్నదానివల్ల మాత్రం కాదు.

ADVERTISEMENT

4. యోని ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆ ఉత్పత్తులు వాడాల్సిందే – యోనిని శుభ్రం చేసుకోవడానికి మార్కెట్లో దొరికే వెజైనల్ వాష్ వాడాలని నేటి తరం యువతులు భావిస్తున్నారు. కానీ వీటిని అస్సలు ఉపయోగించకూడదు. దీనివల్ల మనకు మంచి జరగకపోగా.. చెడు ఎదురవుతుంది. వీటిని ఉపయోగించడం వల్ల యోనికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. పైగా అక్కడి పీహెచ్ స్థాయి అసమతౌల్యం పెరుగుతుంది. అంతేకాదు.. దురద, మంట వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అక్కడ వైజైనల్ వాష్, సబ్బు వంటి వాటిని ఉపయోగించకూడదు. వీటివల్ల యోని ఆరోగ్యం దెబ్బతింటుంది. వెజీనాను శుభ్రం చేసుకోవడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తే సరిపోతుంది. 

5. సెక్స్ తర్వాత కచ్చితంగా మూత్రానికి వెళ్లాలి – ఆ మధ్య ఇంటర్నెట్‌లో బాగా హల్ చల్ చేసిన విషయమిది. అలా చేయకపోతే.. యోని ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటుందన్నది దాని సారాంశం. అయితే సంభోగానికి ముందు తర్వాత మూత్రం పోయడమనేది ఆరోగ్యకరమైన అలవాటే. దీనివల్ల యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ సెక్స్ తర్వాత కచ్చితంగా యూరిన్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే సెక్స్ త‌ర్వాత‌ యోనిని శుభ్రం చేసుకోవడమనేది మంచి అలవాటు.

1-myths-about-vagina

6. టాంఫూన్ ఉండిపోతే తీయడం కష్టం – టాంఫూన్ మాత్రమే కాదు.. సురక్షితమైన సెక్స్ కోసం ఉపయోగించే కండోమ్‌లు వంటివి పొరపాటున వెజీనాలో ఉండిపోతే.. ఇక తీయడానికి ఉండదని, అవి ఎప్పటికీ అక్కడే ఉండిపోతాయని.. దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది అభిప్రాయం. ఈ అపోహ వల్లే టాంఫూన్లు, మెనుస్ట్రువల్ కప్స్ వాడటానికి ఎక్కువ మంది అమ్మాయిలు అంత‌గా ఇష్టపడరు. కానీ ఇది నిజం కాదు. పొరపాటున లోపలికి వెళ్లినా.. వాటిని సులువుగానే బయటకు తీసేయవచ్చు. మన యోని నిర్మాణం దానికి తగినట్లుగానే ఉంటుంది.

ADVERTISEMENT

7. ఎక్కువగా లైంగిక చర్యలో పాల్గొంటే వెజీనా వదులుగా అయిపోతుంది – ఇది కూడా చాలా మంది బలంగా నమ్మే అపోహ. యోని కండరాలు సహజంగానే సంకోచ, వ్యాకోచ గుణాలను కలిగి ఉంటాయి. ఆ సమయంలో ఇవి వ్యాకోచించినప్పటికీ తర్వాత సంకోచించి పూర్వపు స్థితికి చేరుకొంటాయి. కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా రొమాంటిక్‌గా సమయం గడపండి.

8. మొదటి కలయిక విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది – సాధారణంగా ఎక్కువ మంది అమ్మాయిల్లో ఉండే అపోహ ఇది. హైమెన్ పొర చిర‌గ‌డం వల్లే అంత నొప్పి వస్తుందని భావిస్తారు. నిజానికి అప్పటి వరకు సెక్స్ గురించి తెలియకపోవడం, కొత్త అనుభవం కావడం వల్ల ఈ నొప్పి కలిగే అవకాశం ఉంది.

9. అక్కడ వెంట్రుకలు పెరగనివ్వకూడదు – ఇది మనలో ఉండే భావన. కానీ దీనికి పూర్తి విరుద్ధమైన ప్రయోజనాలు అక్కడి రోమాల వల్ల కలుగుతాయి. మనం ధరించే లోదుస్తుల వల్ల అక్కడి చర్మం రాపిడికి గురి కాకుండా అవి మ‌న‌ల్ని కాపాడ‌తాయి. అలాగే.. లైంగిక చర్యలో పాల్గొనే సమయంలోనూ అక్కడి చర్మానికి రక్షణ కవచంగా అవి పనిచేస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

10. యోని జీవితాంతం ఒకే విధంగా ఉంటుంది. ఇది కూడా అపోహే. మన శరీరంలోని అన్ని భాగాలకు వార్థక్యం వచ్చినట్టుగానే యోని సైతం వయసుకి తగినవిధంగా మార్పులకు లోనవుతుంది. రజస్వల కావడం, సెక్స్‌లో పాల్గొనడం, పిల్లలకు జన్మనివ్వడం ఇలా వివిధ కారణాల వల్ల యోని స్వరూపం మారుతుంది.

ADVERTISEMENT

Images: Shutterstock

Also Read: సెక్స్టింగ్‌తో మీ లైంగిక జీవితాన్ని మరింత హాట్ గా మార్చుకోండి

03 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT