కాలేజీ భామలూ.. రూ. 500 విలువైన ఈ లిప్ స్టిక్స్ మీ కోసమే సుమా..!

కాలేజీ భామలూ.. రూ. 500 విలువైన ఈ లిప్ స్టిక్స్ మీ కోసమే సుమా..!

అమ్మాయిలందరి దగ్గరా కచ్చితంగా ఉండే మేకప్ ఐటమ్ లిప్ స్టిక్ (Lipsticks). అది మీ అందాన్ని పెంచి చూపిస్తుంది. మిమ్మల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. అందుకే రకరకాల లిప్ స్టిక్ లను అమ్మాయిలు ఉపయోగిస్తుంటారు. అందులోనూ కాలేజీ యువత వీటిపై ఆసక్తి చూపిస్తుంటారు. వారి కోసమే.. మేం 15 రకాల లిప్ స్టిక్ బ్రాండ్ లను వారి ముందుకు తీసుకొస్తున్నాం. ఇవన్నీ రూ. 500 లోపే లభ్యమవుతున్నాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని పెదాలకు అప్లైచేసుకొని పౌట్ సెల్ఫీ తీసుకోండి.


1. మేబిలీన్  వయొలెట్ లిప్ మాట్టె


మోనోక్రోమ్ (ఒకే రంగులో వేర్వేరు డిజైన్లలో ఉన్న టాప్, బాటమ్) ఫ్యాషన్ అనుసరించే వారికి ఊదారంగు లిప్ స్టిక్ చక్కగా నప్పుతుంది. మీ బ్యూటీ కిట్ లో ఈ రంగు లిప్ స్టిక్ లేనట్లయితే వెంటనే దాన్ని కొనుగోలు చేయండి.


ధర: రూ. 274. ఇక్కడ కొనండి.2. ఇంగ్లోట్ ఫ్రీడం సిస్టమ్ స్క్వేర్ లిప్ స్టిక్


ప్రతి కాలేజీ అమ్మాయి మేకప్ కిట్ లో ఎరుపు రంగు లిప్ స్టిక్ కచ్చితంగా ఉంటుంది. ఈ రంగు అధరాలకు అద్ధితే హాట్ హాట్ గా కనిపిస్తారు. అందుకే అమ్మాయిలకు ఈ రంగు లిప్ స్టిక్ అంటే ఇష్టం. అందుకే మీ మేకప్ కిట్ లో ఇంగ్లోట్ ఫ్రీడం రెడ్ లిప్ స్టిక్ కి స్థానం కల్పించండి. దీనిలోని విటమిన్ ఇ మీ పెదవులను తాజాగా కనిపించేలా చేస్తుంది.


ధర: రూ. 450. 3. మేకప్ రివల్యూషన్


నైట్ పార్టీలకు వెళ్లేటప్పుడు ఈ లిప్ స్టిక్ వేసుకొంటే మీ అందం రెట్టింపవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మీ పెదవులను ఎక్కువ సమయం తేమ కోల్పోకుండా చేస్తుంది.


ధర: రూ. 283.4. నైకా మ్యాట్టె లిప్ స్టిక్


న్యూడ్ షేడ్ లిప్ స్టిక్స్ సహజంగా కనిపించి.. ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. దీనిలోని క్రీమీ స్మూత్ టెక్స్చర్ అధరాలపై సమానంగా పరచుకొని నేచురల్ లుక్ ని మీకందిస్తుంది.


ధర: రూ. 3995. మేబిలీన్ పింక్ లిప్ స్టిక్


కాలేజీ భామలకు బాగా నప్పే రంగు లిప్ స్టిక్ ఇది. పింక్ రంగు లిప్ స్టిక్ మీకు హాట్ లుక్ అందిస్తుంది. మేబిలీన్ అందిస్తోన్న ఈ లిప్ కలర్ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.


ధర: రూ. 254. 6. నోట్ రిచ్ క్యాండీ న్యూడ్ లిప్ స్టిక్


చాలా మంది అమ్మాయిలు తమ బ్యూటీ కిట్ లో కచ్చితంగా న్యూడ్ కలర్ కావాలని కోరుకొంటారు. మీరు కూడా అలాగే అనుకొంటున్నారా? అయితే నోట్ రిచ్ అందిస్తోన్న  ఈ క్యాండీ న్యూడ్ కలర్ లిప్ స్టిక్ ఎంచుకోండి. దీనికున్న పింక్ టోన్ మీకు అదనపు సౌందర్యాన్ని జోడిస్తుంది. రోజూ పెదవులకు అప్లై చేసుకోవడానికి అనువైన రంగు ఇది.


ధర: రూ. 475. ఇక్కడ కొనండి.7.  ఓరిఫ్లేమ్ ప్యూర్ కలర్ ఇంటెన్స్


బోల్డ్ గా కనిపించాలనుకొనే అమ్మాయిలకు నప్పే లిప్ స్టిక్ షేడ్ ఇది. కాస్త డార్క్ గా కనిపించే ఈ లిప్ స్టిక్ మీరు అప్లై చేసుకొన్నారంటే.. కాలేజీలో అందరి కళ్లూ మీ మీదే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


ధర: రూ. 149. ఇక్కడ కొనండి.8. లాక్మే 9 టు 5 కాఫీ కమాండ్


అటు న్యూడ్ కలర్ గా కనిపిస్తూనే.. ఇటు కాంతిమంతంగా కనిపించేలా పెదవులను తీర్చిదిద్దుకోవాలనుకొనేవారికి సరైన ఎంపిక లాక్మే 9 టు 5 కాఫీ కమాండ్. దీనిలోని విటమిన్ ఇ పెదవులకు పోషణ ఇవ్వడమే కాకుండా.. ఎక్కువ సమయం లిప్ స్టిక్ రంగు నిలిచి ఉండేలా చేస్తుంది.


ధర: రూ. 439. ఇక్కడ కొనండి.9. మేబిలీన్ వెల్వెట్ మాట్టె లిప్ స్టిక్


కాస్త సెక్సీ లుక్ కావాలని కోరుకొనే వారికి మేబిలీన్ వెల్వెట్ మాట్టె లిప్ స్టిక్ మంచి ఎంపిక అని చెప్పుకోవాలి. ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండటమే కాకుండా మీ పెదవులకు మంచి లుక్ ని సైతం ఇస్తుంది.


ధర: రూ. 404. 10. కలర్ బార్ వెల్వెట్ మాట్టె లిప్ స్టిక్


ఎరుపు రంగు లిప్ స్టిక్ అమ్మాయిలకు సరికొత్త అందాలను అందిస్తుందని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీని క్రీమీ టెక్స్చర్ కారణంగా పెదవులపై సమానంగా పరచుకొంటుంది.


ధర: రూ. 276. ఇక్కడ కొనండి.11. కలర్ సెన్స్ లిప్ కలర్ న్యూడ్ షేడ్


న్యూడ్ లిప్ షేడ్ ని ఇష్టపడేవారికి కలర్ సెన్స్ లిప్ షేడ్ చాలా బాగా నచ్చుతుంది. సహజంగా కనిపించే ఈ లిప్ కలర్.. కాలేజీ భామలకు చక్కగా సరిపోతుంది.


ధర: రూ. 180. ఇక్కడ కొనండి.12. ఎన్ వై ఎక్స్ రెడ్ లిప్ స్టిక్


రెడ్ లిప్ స్టిక్ అమ్మాయిల ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీ కోసం మరో లిప్ స్టిక్ బ్రాండ్ ని పరిచయం చేస్తున్నాం. అదే ఎన్ వైఎక్స్. ఈ లిప్ స్టిక్ కూడా మీకు నచ్చుతుంది.


ధర: రూ. 500. 13. లోటస్ హెర్బల్స్ ఆరెంజ్ ఎన్వీ మాట్టె లిప్ కలర్


పూర్తిగా సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన లోటస్ హెర్బల్స్ లిప్ స్టిక్స్ మీ పెదవుల సౌందర్యాన్ని పదిలంగా ఉంచుతాయి. అందులోనూ ఆరెంజ్ రంగులోని ఈ లిప్ స్టిక్ మీ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. సహజసిద్ధమైన ఉత్పత్తులను ఇష్టపడే వారు దీన్ని ఎంచుకోవచ్చు.


ధర: రూ. 293. 14. ఫేసెస్ గో చిక్ లిప్ స్టిక్


ఒక్క నిమిషంలో మీ అధరాలు సరికొత్తగా తయారవ్వాలంటే అది ఫేసెస్ గో చిక్ లిప్ స్టిక్ తోనే సాధ్యం. దీన్ని ఒక్కసారి పెదవులపై గ్లైడ్ చేస్తే చాలు.. మళ్లీ మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం రాదు. అందుకే ఇది అమ్మాయిల ఫేవరెట్ గా నిలుస్తోంది.


ధర: రూ. 234. 15. ఎల్లె 18 కలర్ పాప్ మాట్టె లిప్ కలర్


కాలేజీకి వెళ్లే ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సిన లిప్ స్టిక్ ఇది. దీనికున్న రస్టీ టోన్ కారణంగా మీకు డిఫరెంట్ లుక్ వస్తుంది. ముఖ్యంగా పార్టీలు, ఫంక్షన్లకు దీన్ని అప్లై చేసుకొంటే మీ అందం రెట్టింపవుతుంది. పైగా ఇది చాలా చవకగా లభిస్తుంది.


ధర: రూ. 96. అమ్మాయిలూ.. ఇంకెందుకాలస్యం. వీటిలో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకొని మీ మేకప్ బాక్స్ లో వాటికి కొంచెం చోటివ్వండి.