ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
హైదరాబాద్ మెట్రో రైల్.. ఓ  అమ్మాయి అనుభవం..!

హైదరాబాద్ మెట్రో రైల్.. ఓ అమ్మాయి అనుభవం..!

హాయ్.. నా పేరు రితిక‌. నేను ఉండేది బెంగ‌ళూరులో! కానీ నాకు వివిధ ప్ర‌దేశాల‌ను చుట్టి రావ‌డం అంటే చాలా ఇష్టం. అందులో భాగంగానే నేను డిగ్రీ చ‌దువుతున్న రోజుల్లో తొలిసారి హైద‌రాబాద్ (Hyderabad)కు వ‌చ్చా. అప్ప‌టికి ఈ న‌గ‌రం ఇంకా అభివృద్ధి చెందుతోన్న ద‌శ‌లోనే ఉంది. ఆ స‌మ‌యానికి ఎంఎంటిఎస్, ఆర్టీసీ బ‌స్సుల స‌దుపాయాలు మాత్రమే ఇక్క‌డ అందుబాటులో ఉండేవి.

నేను మొదటిసారి హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు నాతో మ‌రో ఇద్ద‌రు ఫ్రెండ్స్ కూడా వ‌చ్చారు. వారిలో ఒక‌రు సంజ‌న కాగా; మ‌రొక‌రు ఫ‌రీదా. ముగ్గురం క‌లిసి ఇక్క‌డే ఒక హోట‌ల్లో రూమ్ తీసుకున్నాం. బెంగ‌ళూరులో ఉండ‌గానే హైద‌రాబాద్‌లో ఏయే ప్ర‌దేశాలు చూడ‌ద‌గిన‌వి? ఒక రోజుకి ఎన్ని ప్ర‌దేశాలు చుట్టి రావ‌చ్చు.. వంటి అంశాల‌న్నీ వివ‌రంగా మాట్లాడుకున్నాం. దాంతో మా ప్ర‌ణాళిక అంతా ముందుగానే పక్కాగా సిద్ధ‌మైపోయింది.

ముచ్చ‌ట‌గా మూడు రోజుల్లో మా ప‌ర్య‌ట‌న ముగించాల‌న్న‌ది మా ప్లాన్. ముందుగా చార్మినార్, మ‌క్కా మ‌సీదు.. ప్రాంతాలు చూసేందుకు అటుగా ప‌య‌న‌మ‌య్యాం. కానీ వెళ్లేందుకు, అక్క‌డి నుంచి వచ్చేందుకు ట్రాఫిక్ కార‌ణంగా చాలా స‌మ‌య‌మే ప‌ట్టేసింది. అందుకే మా మొద‌టి రోజు సంద‌ర్శ‌న‌లో కేవ‌లం రెండు ప్ర‌దేశాల‌నే మేము చూడ‌గ‌లిగాం. ఆ త‌ర్వాత రెండు రోజులు కూడా ఇదే స‌మ‌స్య పునరావృతం అయింది. దాంతో మేం ప‌ది ప్రాంతాలు సంద‌ర్శించాల‌ని అనుకుంటే.. వాటిలో కేవ‌లం ఐదు మాత్ర‌మే చూడ‌గ‌లిగాం. మిగతావి చూడాల్సి ఉన్నా మా వ‌ద్ద అంత స‌మ‌యం లేక‌పోవ‌డంతో ఇక్క‌డి నుంచి తిరుగు ప‌య‌నం కాక త‌ప్ప‌లేదు.

 

ADVERTISEMENT

అంతేకాదు.. ఈ టూర్‌లో మా ముగ్గురికీ కాస్త చేదు అనుభ‌వాలు కూడా ఎదుర‌య్యాయి. మేం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో కొంద‌రు ఆక‌తాయిలు మ‌మ్మ‌ల్ని కామెంట్ చేయ‌డం.. మేం వారితో గొడ‌వ పెట్టుకోవ‌డం వాటిలో ఒక‌టి. అలాగే బ‌స్సులో ప్ర‌యాణించే స‌మ‌యంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ముందు వైపు నుంచి బ‌స్సు ఎక్కిన కొంద‌రు పురుషులు.. బ‌స్సులో ఉన్న మ‌హిళ‌ల‌ను కావాల‌నే తాకుతూ వెళ్లారు. దాని గురించి మేం మాట్లాడాల‌ని అనుకున్నా మిగ‌తా వారెవరూ నోరెత్త‌క‌పోయేస‌రికి మేం కూడా మిన్న‌కుండిపోయాం. కానీ ఎవ‌రో అలా మ‌మ్మ‌ల్ని తాకుతూ వెళ్తుంటే ..ఒళ్లంతా తేళ్లు, జెర్రులు పాకిన‌ట్లైంది. ఇలాంటి కార‌ణాల వ‌ల్ల మా టూర్‌ని కొనసాగించడం ఇష్టం లేక.. ఇక్క‌డ నుంచి వెనుదిర‌గ‌క త‌ప్ప‌లేదు. ఇదంతా జ‌రిగి ఇప్ప‌టికి ఐదేళ్లు కావ‌స్తోంది.

 

నాకు మొద‌టిచూపులోనే హైద‌రాబాద్ బాగా న‌చ్చేసింది. ఇక్క‌డి ప‌రిస‌రాలు, ప‌ర్యాట‌క ప్రాంతాలు.. అన్నీ న‌న్ను ఎంత‌గానో ఆక‌ర్షించాయి. అందుకే మ‌ళ్లీ ఎప్ప‌టికైనా ఈ ప్రాంతాన్ని త‌ప్ప‌కుండా చూడాల‌ని నిర్ణ‌యించుకున్నా. అలా ఐదేళ్ల కింద‌ట నేను తీసుకున్న నిర్ణ‌యాన్ని ఈ మ‌ధ్యే అమ‌ల్లో పెట్టా. అదేనండీ.. నేను ఈసారి ఒంటరిగానే హైదరాబాద్‌కు వ‌చ్చా. అప్ప‌టికీ ఇప్ప‌టికీ హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో చాలా మార్పు క‌నిపించింది. ముఖ్యంగా ఈవ్ టీజింగ్ స‌మ‌స్య బాగా త‌గ్గుముఖం ప‌ట్టింది. అలాగే ఈసారి నా దృష్టిని బాగా ఆక‌ర్షించిన వాటిలో మొద‌టిది మెట్రో రైల్ (Metro Rail). టికెట్ ఖ‌రీదు సామాన్యుల‌కు కాస్త  ఎక్కువే అనిపించినా.. మ‌హిళ‌ల‌కు మాత్రం ఇదొక వ‌ర‌మే అని చెప్పాలి. 

పైగా మెట్రో రైలులో మహిళలకు అదనపు వసతులు కల్పించడం నాకు చాలా సంతోషం కలిగించింది. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా టికెటింగ్ ఆఫీసర్లను రిక్రూట్ చేసుకున్నారు. అలాగే ఇటీవలే మెట్రోలో సర్వైలెన్స్ విభాగం కూడా తమ సేవలను మరింత పటిష్టం చేస్తుందని తెలుసుకొని ఆనందించాం. తమ వస్తువులు ఏవైనా పోతే మహిళలు ఫిర్యాదు చేయడానికి.. స్టేషనులోనే ఒక ప్రత్యేక విభాగం ఉంది. అలాగే ఫస్ట్ ఎయిడ్, మెడికల్ అడ్వైజ్ విభాగాలు కూడా ఉన్నాయి. అలాగే మహిళల కోసం ప్రత్యేక కోచ్, ప్రత్యేక వెయిటింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. 

ADVERTISEMENT

దీంతో మాకు ఆక‌తాయిల వేధింపులు.. ట్రాఫిక్ ఇక్క‌ట్ల నుండి ఉపశమనం లభించినట్లైంది. అదీకాకుండా ప్ర‌యాణించే స‌మ‌యం కూడా బాగా త‌గ్గింది. దాంతో త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ ప్ర‌దేశాలు చుట్టి వ‌చ్చే అవ‌కాశం ల‌భించింది.

అందుకే ఈసారి నాలుగు రోజులు పాటు ప్లాన్ చేసుకున్న నా ప‌ర్య‌ట‌న రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. మిగ‌తా రెండు రోజుల్లో హైదరాబాద్‌లో నివసిస్తున్న నా స్నేహితులు, బంధువుల ఇళ్ల‌కు వెళ్లి వారిని కూడా పల‌క‌రించి వ‌చ్చా. ఈ సారి ట్రిప్ చాలా హాయిగా ముగిసింది. ఇప్ప‌డు నాకు హైద‌రాబాద్ పై ఉన్న ప్రేమ మ‌రింత పెరిగింది. అందుకే క‌నీసం రెండేళ్లకోసారైనా ఇక్క‌డకు వ‌చ్చి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నా! అలాగే మెట్రో యాజ‌మాన్యానికి నా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేయాల‌ని అనుకుంటున్నా..!

Images: https://www.instagram.com/lthydmetrorail

ఇవి కూడా చ‌ద‌వండి

ADVERTISEMENT

పాఠ‌శాల నుంచి ప‌రిణ‌యం వ‌ర‌కు.. సాగిన ఈ ప్రేమ‌క‌థ అద్భుతం..!

మీ ప్రేమ బంధం .. ఎలాంటి అనుబంధమో తెలుసుకోవాలని భావిస్తున్నారా..?

ఈ ప్రయాణికుల‌ అంద‌మైన ప్రేమక‌థ‌లు విన్నారా?

18 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT