ఆరాధ్య ముద్దులొలికే ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

ఆరాధ్య ముద్దులొలికే ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

ఆరాధ్య బ‌చ్చ‌న్.. (Aaradhya bachchan) అందాల సుంద‌రి ఐశ్వ‌ర్యా రాయ్‌, జూనియ‌ర్ బ‌చ్చ‌న్ అభిషేక్‌ల ముద్దుల త‌న‌య‌. బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన అతిపెద్ద కుటుంబం బ‌చ్చ‌న్ ఫ్యామిలీ (bachchan family)కి వార‌సురాలు.. త‌న త‌ల్లిదండ్రుల‌కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఆరాధ్య సొంతం. అయితే బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో ఒక ర‌కానికి చెందిన వారు లైమ్‌లైట్ ని ఎంజాయ్ చేస్తుంటారు. తైమూర్‌లాంటివారు ఇందులో ఉంటే.. ఆరాధ్య లాంటి వాళ్లు మాత్రం మీడియా నుంచి దూరంగా ఉండాల‌నుకుంటారు.


మీడియాకి పోజులివ్వాలంటే ఆరాధ్య అప్పుడ‌ప్పుడూ కాస్త క‌న్‌ఫ్యూజ్ అవ్వ‌డం కూడా చూడొచ్చు. తాజాగా ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహ‌తాల పెళ్లిలో ఇలాంటిదే ఓ సంద‌ర్భం ఆరాధ్య‌కు ఎదురైంది. అప్పుడు ఆరాధ్య ఇచ్చిన‌ ఒక‌ ఫ‌న్నీ ఎక్స్‌ప్రెష‌న్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఆకాశ్‌-శ్లోకాల పెళ్లిలో ఫొటోగ్రాఫ‌ర్ల‌కు పోజులిచ్చే సంద‌ర్బంగా త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి పోజిచ్చింది ఆరాధ్య‌. అయితే చాలామంది ఫొటోగ్రాఫ‌ర్లు ఉండి.. అంద‌రూ ఇటు చూడండి.. ఇటు చూడండి.. అంటుంటే ఎటు చూడాలో అర్థం కాక‌.. క‌ళ్లు తిప్పి చూస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్లు ఇచ్చింది ఆరాధ్య‌. అవి చూసి మ‌న‌మంతా న‌వ్వుకోవాల్సిందే. ఆ రియాక్ష‌న్ల‌ను ఓసారి చూడండి..

ఈ వేడుక‌లో ఐష్, ఆరాధ్య ఇద్ద‌రూ గులాబీ రంగు ఎంబ్రాయిడ‌రీ డ్ర‌స్సులు వేసుకున్నారు. ఐశ్వ‌ర్య అనార్క‌లీ ధ‌రించ‌గా.. ఆరాధ్య గౌన్ వేసుకుంది. న‌లుపు రంగు సూట్‌లో ఆక‌ట్టుకున్నాడు అభిషేక్‌. త‌ల్లితో అవుట్‌ఫిట్ ట్విన్నింగ్ చేసిన‌ ఈ ముద్దుల స్టార్‌కిడ్ పార్టీలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. డైమండ్ టియారా పెట్టుకొని ఆక‌ట్టుకుంది. ఫొటోగ్రాఫ‌ర్లు అంద‌రూ ఒక్కసారే మాట్లాడుతుండ‌డంతో ఎటు చూడాలో అర్థం కాక అటూ ఇటూ త‌లాడిస్తూ ఉన్న ఆరాధ్య వీడియో ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారుతోంది.

ఎటు చూసి పోజివ్వాలో అర్థం కాక ఆరాధ్య ఇచ్చిన ఈ క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్ల‌ను చూసిన ఐశ్వ‌ర్య త‌న‌కి ఎటు చూసి పోజివ్వాలో చెప్పింది. దీంతో అంతా క‌లిసి పోజులిచ్చి వెళ్తుండ‌గా.. కొంద‌రు ఫొటోగ్రాఫ‌ర్లు మ‌రో ఫొటోకి ఫోజివ్వ‌మ‌ని అడిగారు దీంతో ఆరాధ్య బ‌స్ క‌రో (ఇంక చాలు..) అంటూ చెప్ప‌డం త‌న త‌ల్లిదండ్రుల‌తో పాటు అంద‌రినీ న‌వ్వించింది. ఈ వ్య‌వ‌హార శైలిని చూసి కొంద‌రు నాన‌మ్మ పోలికలే వ‌చ్చాయ‌ని చెప్పుకోవ‌డం విశేషం. ఇదొక్క‌సారే కాదు.. త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్ల‌తో చాలాసార్లు అంద‌రినీ ఆక‌ట్టుకుంది ఆరాధ్య‌..


aradya %281%29


త‌న తాతతో క‌లిసి అల్ల‌రి చేయ‌డంలో ఆరాధ్య ఎప్పుడూ ముందుంటుంది. త‌న టియారాను తాత త‌ల‌లో పెట్టి క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్లు ఇస్తూ దిగిన ఈ ఫొటో చూడండి ఎంత బాగుందో..


aradya %283%29


అమ్మ, అమ్మ‌మ్మ‌లతో క‌లిసి దిగిన ఈ ఫొటోలో ఆరాధ్య పెద్ద‌వాళ్ల‌లాగే చేతుల‌తో హార్ట్ సింబ‌ల్ చూపుతూ పోజిచ్చింది చూడండి..


aradya %2813%29


ఇక నాన్న అభిషేక్‌తో క‌లిసి క్యాజువ‌ల్‌గా దిగిన ఈ ఫొటోలో నాలుక బ‌య‌ట‌పెట్టి ఫంకీగా పోజిస్తోంది ఆరాధ్య‌.


aradya %285%29


ఈఫిల్ ట‌వ‌ర్ ముందు ఆరాధ్య ఇచ్చిన ఈ పోజ్ చూస్తుంటే అచ్చం రాకుమారిలా అనిపిస్తోంది క‌దా..


aradya %286%29నాన్న‌, తాత‌ల‌తో క లిసి ఆరాధ్య దిగిన క్యాజువ‌ల్ ఫొటో ఇది. ఇందులోనూ ఆమె ఎక్స్‌ప్రెష‌న్ క్యూట్‌గా ఉంది క‌దా.


aradya %289%29


ఓ ఫంక్ష‌న్లో తెలుపు రంగు డ్ర‌స్ వేసుకొని తెల్ల‌ని న్యాప్‌కిన్ మెడ‌కు పెట్టుకొని ప్లేట్ ప‌ట్టుకొని ఉన్న ఆరాధ్య ఫొటో ఎంతో క్యూట్ గా ఉండ‌డంతో ఇంట‌ర్‌నెట్‌లో అది కూడా వైర‌ల్‌గా మారిపోయింది.


aradya %2814%29


తండ్రితో క‌లిసి ఓ మ్యాచ్ సంద‌ర్భంగా స్టేడియంకి వెళ్లిన ఆరాధ్య మీడియాకి ఫోజులిస్తూ ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చింది. ఆ పోజ్‌ని మీరూ ఓసారి చూసేయండి మ‌రి..


aradya %2812%29


త‌ల్లితో క‌లిసి కేన్స్ వేడుక సంద‌ర్భంగా అచ్చం నిజ‌మైన బార్బీ బొమ్మ‌లా పోజిచ్చిన ఆరాధ్య‌.. ఎంత క్యూట్‌గా ఉందో క‌దా..


aradya %2811%29


ఆరాధ్య క్యూట్‌నెస్ చిన్న‌త‌నం నుంచే మొద‌లైంది. దానికి ఈ ఫోటోనే నిద‌ర్శ‌నం. కావాలంటే మీరూ ఒకసారి చూసేయండి.


Images : Instagram/Aishwarya Rai Bachchan


Images : Instagram/Abhishek Bachchan


ఇవి కూడా చ‌ద‌వండి.


త‌మ త‌ల్లిదండ్రుల కంటే.. ఈ బుజ్జాయిలు భ‌లే ఫేమ‌స్‌ తెలుసా..!


డియర్ మమ్మీ... నా మనసు చెప్పే మాటలు వింటావా ప్లీజ్..?


నైసా దేవగన్ .. ఈ బాలీవుడ్ స్టార్‌కిడ్ గురించి మీరు త‌ప్ప‌క‌ తెలుసుకోవాల్సిందే.. !