ADVERTISEMENT
home / Bollywood
సాహోలో ఆ ఒక్క సీన్ కోసం.. ఎంత ఖర్చు చేశారో తెలిస్తే ఔరా అనకమానరు..!

సాహోలో ఆ ఒక్క సీన్ కోసం.. ఎంత ఖర్చు చేశారో తెలిస్తే ఔరా అనకమానరు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas) హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సాహో (Saaho).. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ కథానాయికగా కనిపించనుంది. కేవలం శ్రద్ధ మాత్రమే కాదు.. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ వంటి బాలీవుడ్ స్టార్లందరూ ఈ సినిమాలో కనిపించనున్నారు.

ఈ సినిమా షూటింగ్ కోసం రెండు సంవత్సరాల సమయం కేటాయించాడు ప్రభాస్. జూన్ 9, 2017 తేదిన సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా షూటింగ్ జులై 15, 2019 న పూర్తయింది. 25 నెలల పాటు ఈ సినిమా కోసం కష్టపడిన ప్రభాస్ చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో.. కేక్ కట్ చేసి, చిత్ర యూనిట్ సభ్యులతో ఆనందంగా గడిపారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల కానున్న ఈ చిత్రం.. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ హిట్‌గా మారుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

twitter

ADVERTISEMENT

వాయిదా పడిన సాహో విడుదల తేదీ.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా?

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటి అనుకుంటున్నారా? సాహో చిత్రం కోసం అబుదాబిలో షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించిన సమాచారమే అది. అవును.. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కి సినిమాలో అత్యంత ప్రాధాన్యత ఉండడంతో ఇందులో సీజీఐ ( కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ) కాకుండా.. అసలైన వాహనాలనే ఉపయోగించాలనుకున్నారట దర్శకనిర్మాతలు. ఇలాంటిది జరగడం సినిమా చరిత్రలోనే ఇది మొదటిసారని వెల్లడిస్తోందీ చిత్ర యూనిట్.

twitter

ADVERTISEMENT

#15AugWithSaaho సాహో సినిమాపై ఆసక్తిని.. మరింత పెంచే విశేషాలు మీకోసం..!

ఒళ్లు గగుర్పొడిచేలా ఉండే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్.. సినిమాలో ఎనిమిది నిమిషాల నిడివి కలిగి ఉంటుందట. మరి, ఈ ఎనిమిది నిమిషాల కోసం చిత్ర దర్శకనిర్మాతలు పెట్టిన ఖర్చెంతో తెలుసా? అక్షరాలా 70 కోట్ల రూపాయలు. ఈ భారీ యాక్షన్ ఛేజింగ్ సీక్వెన్స్.. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఉండేందుకే ఇంత ఖర్చు పెట్టి షూటింగ్ చేశారట. ఈ సినిమాలో ఆ సీన్‌కి ఉన్న ప్రాధాన్యం అలాంటిది కాబట్టే.. దానికి అంత ఖర్చు పెట్టామని చిత్ర యూనిట్ చెబుతోంది.

దీని గురించి దర్శకుడు సుజీత్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ- ‘ఈ సినిమాలో ఎక్కువ బడ్జెట్ అద్బుతమైన ఫైట్ సీక్వెన్స్ రూపొందించేందుకే ఉపయోగించాం. ఇది కమర్షియల్ సినిమానే అయినా.. ఇందులోనూ మేం కాస్త విభిన్నంగా ప్రయత్నించి ప్రేక్షకుడికి ఆ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ అందించాలనుకున్నాం’ అని వెల్లడించారు. ఖలీజ్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ- ‘ఈ ఫైట్ సీన్ కోసం మేం 37 కార్లు, ఐదు ట్రక్కులను నుజ్జునుజ్జు చేసేశాం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ మంది సీజీఐ ( కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ) ఉపయోగిస్తుంటారు. కానీ మేం మాత్రం దానికి రియల్ లుక్ అందించాలనుకున్నాం. అందుకే ఎక్కువ శాతం రియల్ షూట్ పైనే ఆధారపడ్డాం. అందుకే ఇది ఇంతకుముందెప్పుడూ చూడని ఫైట్‌గా మారిపోయింది..’ అంటూ వెల్లడించాడు.

ప్రభాస్ “సాహో” ఫస్ట్ సాంగ్.. “ఆగడిక సైకో సయ్యా” లిరిక్స్ మీకోసం..!

ADVERTISEMENT

twitter

ఈ ఫైట్ సీన్‌ని హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో నిర్వహించారట. ఆయన పర్ల్ హార్బర్, ట్రాన్స్‌ఫర్మేషన్స్: డార్క్ ఆఫ్ ద మూన్, మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రోటోకాల్ వంటి చిత్రాలతో ఫేమస్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంలోనూ ..టెక్నీషియన్స్ అంతా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ఈ సినిమా ప్రభాస్ అభిమానులనే కాదు.. ప్రతిఒక్కరికీ నచ్చేలా ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడిస్తోంది. ఈ సినిమాతో ప్రభాస్‌కి మరోసారి బాహుబలిలాంటి హిట్ రావడం ఖాయం అంటూ వెల్లడించడం విశేషం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

ADVERTISEMENT

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

 

17 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT