"త్రిషా.. మనిద్దరం పెళ్లి చేసుకుందామా"- ఛార్మీ కౌర్

"త్రిషా.. మనిద్దరం పెళ్లి చేసుకుందామా"-  ఛార్మీ కౌర్

టాలీవుడ్ నటి త్రిషకి ఆమె స్నేహితురాలు, నటి ఛార్మీ కౌర్ వైవిధ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. "బేబీ ఐ లవ్ యూ ఫరెవర్.. నేను మోకాళ్ల మీద నిలబడి మరీ నిన్ను కోరేది ఒక్కటే. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు నా ప్రపోజల్‌ని అంగీకరిస్తావా. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు " అని ఛార్మీ (Charmy Kaur) చేసిన ఫన్నీ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ట్వీట్‌లో ఆమె పేర్కొంటూ.. ఇలాంటి పెళ్లిళ్లూ ఇప్పుడు సమ్మతమే అని చెప్పడమూ కొసమెరుపు. ఇలాంటి ఫన్నీ ట్వీట్స్ చేయడం ఛార్మీకి కొత్తేమీ కాదు.


గతంలో కూడా త్రిషకు ఆమె ఇలాంటి ట్వీట్స్ చేయడం గమనార్హం. అయితే ఛార్మీ చేసిన ఈ ట్వీట్ చదివిన త్రిష (Trisha Krishnan).. తను ఆమె ప్రపోజల్‌ను ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్పడం విశేషం. ఛార్మీ గత కొంత కాలంగా నిర్మాతగా మారి.. సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్‌తో కలిసి పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించింది. అలాగే పూరీ కనెక్ట్స్ అనే సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలిగా కూడా వ్యవహరిస్తోంది. 


కాగా..త్రిష తన 36వ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘పరమపదం విలయాట్టు’ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు నిర్మాతలు.
తిరుజ్ఞానం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్రిష కెరీర్‌లో 60వ చిత్రం కావడం గమనార్హం. తెలుగులో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి హిట్ చిత్రాలలో త్రిష నటించిన సంగతి తెలిసిందే.


'పౌర్ణమి' చిత్రంలో ప్రభాస్ సరసన, తన స్నేహితురాలు ఛార్మీతో కలిసి మరీ నటించింది త్రిష. త్రిష నటించిన ఆఖరి తెలుగు చిత్రం "నాయకి" 2016లో విడుదల అయ్యింది.


ఇటీవలే రజనీకాంత్ సరసన "పెట్టా" చిత్రంలో నటించే మంచి అవకాశాన్ని కూడా కొట్టేసింది త్రిష. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో త్రిష ఇప్పటి వరకూ నటించింది.

Subscribe to POPxoTV

ఇక ఛార్మీ విషయానికి వస్తే.. ఈమె నటించిన ఆఖరి తెలుగు చిత్రం "మంత్ర 2" 2015 లో విడుదలైంది. అంతకు ముందు జ్యోతిలక్ష్మి, ప్రతిఘటన, నగరం నిద్రపోతున్న వేళ మొదలైన చిత్రాలలో నటించింది ఛార్మీ. కానీ గత కొద్ది సంవత్సరాలుగా పూరీ జగన్నాథ్ తీస్తున్న సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది ఛార్మీ.


రోగ్, పైసా వసూల్, మెహబూబా లాంటి చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించింది. ఛార్మీ జిల్లా ఘజియాబాద్, బుడ్డా హోగా తేరే బాప్, రాంబో రాజ్ కుమార్ లాంటి హిందీ చిత్రాలలో కూడా మెరిసిన సంగతి తెలిసిందే. "నీతోడు కావాలి" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఛార్మీకి.. ఆమె నటించిన మాస్, మంత్ర, అనుకోకుండా ఒకరోజు, లక్ష్మీ, స్టైల్, కావ్యాస్ డైరీ మొదలైన చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి. 'మంత్ర' చిత్రంలో నటనకు గాను నంది అవార్డును కూడా కైవసం చేసుకుంది ఛార్మీ. 


ఇవి కూడా చదవండి


అందాల నాయిక.. అభినయ దీపిక (టాలీవుడ్ తార త్రిష బర్త్‌డే స్పెషల్)


గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌కి ప‌రిచ‌య‌మైన‌ప్పుడు.. ఈ అందాల రాశులు ఎలా ఉన్నారంటే..!


రజినీకాంత్ స్టామినాని.. మరోసారి రుచి చూపించిన "పేట" (సినిమా రివ్యూ)