తల్లులందరికీ స్పూర్తి.. నెలల బిడ్డతో శిఖరమెక్కిన సమీరా రెడ్డి ..!

తల్లులందరికీ స్పూర్తి.. నెలల బిడ్డతో శిఖరమెక్కిన సమీరా రెడ్డి ..!

(Actress Sameera Reddy Climbs Karnatakas Tallest Mullayanagiri Peak with her Baby Daughter)

ఈ ప్రపంచంలో అన్నింటి కంటే కష్టమైన పని ఓ బిడ్డకు జన్మనివ్వడం. తల్లి కావడమనేది ఓ అద్భుతమైన వరం లాంటిది. ఈ జగత్తులోనే అందమైంది ఏదైనా ఉందంటే.. అది చిరుదరహాసాన్ని చిందించే  చిన్నారి ముఖమే. అలాంటి ముఖాన్ని రోజూ చూసే తల్లుల కంటే అదృష్టవంతులు వేరొకరు ఉండరేమో. ఆ నవ్వులను చూడగానే తొమ్మిది నెలల పాటు కడుపులో బిడ్డ కోసం పడిన ఆవేదనని.. ప్రసవించే సమయంలో పడే కష్టాలన్నింటినీ వారు మర్చిపోతారు. ఒకప్పుడు తల్లులు ప్రసవం తర్వాత బిడ్డను చూసుకోవడం.. విశ్రాంతి తీసుకోవడం మాత్రమే చేసేవారు. కానీ ఇప్పటి తల్లులు.. పిల్లలు పుట్టిన కొద్ది నెలల్లోనే.. తిరిగి జిమ్‌లో చేరి మునుపటిలా మారిపోతున్నారు.  ఆఫీస్ పనులతో సహా.. తమ సొంత పనులన్నింటినీ సజావుగా చేసుకుంటున్నారు.

ప్రపంచంలోని తల్లులందరికీ.. ఫిట్‌నెస్ విషయంలో స్ఫూర్తిని అందిస్తూ.. ఆ దిశగా వారిలో ఆసక్తిని పెంచుతున్నారు అనేకమంది సెలబ్రిటీ మామ్స్. అలాంటివారిలో ఒకరు అందాల తార సమీరా రెడ్డి.  ఆమె తొలి సారి తల్లయినప్పుడు.. వివిధ సమస్యల కారణంగా వంద కేజీల వరకూ బరువు పెరిగిందట. తర్వాత అదే బరువును తగ్గించుకొనే క్రమంలో.. ఎన్నో ఇబ్బందులను కూడా చవిచూసిందామె.

కానీ రెండో సారి గర్భం ధరించినప్పుడు మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ.. తనలాంటి తల్లులందరికీ 'అమ్మతనం అంటే అదో అద్భుతమని చెబుతూ'.. అలాగే బరువు గురించి ఏమాత్రం కంగారుపడాల్సిన అవసరం లేదని అందరికీ చాటిచెప్పింది సమీర.

ప్రస్తుతం తన పాప నైరా పుట్టి రెండు నెలలైన క్రమంలో... మరో అడుగు ముందుకు వేసింది సమీర. ఓ మహిళ ఏదైనా సాధించాలనుకుంటే అమ్మతనమే కాదు.. మరేదీ ఆమెను ఆపలేదని నిరూపించింది సమీరా రెడ్డి. కర్ణాటకలోని ముల్లాయనగిరి పర్వతాన్ని ఎక్కి.. తనంటే ఏంటో నిరూపించింది. కానీ ఆ పర్వతాన్ని తను ఒక్కర్తే అధిరోహించలేదు. తన రెండు నెలల కూతురు నైరాని వీపున కట్టుకొని మరీ ఎక్కింది. కొండ ఎక్కుతూ.. తన కూతురికి కూడా అక్కడి అందాలను చూపిస్తూ వీడియో తీసింది.  అదే వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమీరా రెడ్డి.

ఈ వీడియోను పోస్ట్ చేస్తూ "నైరాని వీపున కట్టుకొని ముల్లాయనగిరి పర్వతం ఎక్కే ప్రయత్నం చేశాను. అయితే మధ్య వరకూ ఎక్కేసరికి నాకు ఊపిరి అందట్లేదు. అందుకే అక్కడికే ఆపేసి కిందకి దిగిపోయాను. 6300 అడుగుల ఎత్తున్న ఈ పర్వతం కర్ణాటకలోనే ఎత్తైనది. ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన ట్రావెల్ స్టోరీస్ చూసి.. చాలామంది తల్లులు వారు కూడా... ప్రయాణాలు చేసేందుకు స్ఫూర్తిని పొందుతున్నామని మెసేజ్‌లు చేస్తున్నారు. నా ట్రావెల్ స్టోరీస్‌కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు.. నాకెంతో ఆనందంగా, థ్రిల్లింగ్‌గా ఉంది" అని తెలిపింది 

బిడ్డ పుట్టిన తర్వాత తల్లులు మోటివేషన్ లేకుండా.. తమ గురించి ఆలోచించకుండా తయారవుతారు. కానీ నేను మాత్రం నా ప్రసవం వల్ల ఏమాత్రం ఇబ్బంది పడకుండా.. అన్నింట్లో ముందుకెళ్లాలని భావించాను. చాలామంది తల్లులు 'ఈ సమయంలో నైరాకి ఎలా పాలు పట్టాను' అని అడుగుతున్నారు.

తను ఆకలేసి ఏడ్చినప్పుడల్లా.. నేను ఆగి తనకు పాలు పట్టాను. బాటిల్స్, పాలు అన్నీ తీసుకెళ్లడం కంటే.. ఇలా తల్లి పాలు పట్టడం చాలా సులువైన మార్గం. ప్రయాణ సమయాల్లో ఎలాంటి ఇబ్బంది లేని ఆప్షన్ కూడా" అంటూ తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించింది సమీరా రెడ్డి.

గతంలో బిడ్డ పుట్టక ముందు కూడా #imperfectlyperfect అంటూ క్యాంపెయిన్ నిర్వహించిన సమీరా రెడ్డి.. స్విమ్ సూట్‌తో మెటర్నిటీ ఫొటోషూట్ కూడా చేయించుకున్న సంగతి తెలిసిందే. తాను గర్భం దాల్చిన విషయం వెల్లడించిన రోజు నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సమీర.. మొదటి సారి తను ప్రపంచం నుంచి దూరంగా పారిపోవాలని భావించట్లేదని వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.