"అర్జున్ రెడ్డి" డైరెక్టర్ సందీప్ రెడ్డికి.. నటి తాప్సీ తాజా కౌంటర్..!

"అర్జున్ రెడ్డి" డైరెక్టర్ సందీప్ రెడ్డికి.. నటి తాప్సీ తాజా కౌంటర్..!

అర్జున్ సింగ్, కబీర్ సింగ్ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఇటీవలే చేసిన కామెంట్లపై..  తాజాగా నటి తాప్సీ (Taapsee) మరోమారు స్పందించారు. ‘ఓ స్త్రీని ప్రేమించినప్పుడు అందులో  నిజాయతీ ఉంటుంది. ప్రేమికులకు ఒకరిపై మరొకరు చేయి చేసుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది. అదే లేనప్పుడు వారి మధ్య ప్రేమ, ఎమోషన్‌ ఉంటాయని నేను అనుకోను. ఓ అబ్బాయి తాను ప్రేమించిన అమ్మాయిని టచ్ చేయలేనప్పుడు, తనపై చేయి చేసుకోనప్పుడు.. వారి మధ్యనున్న బంధంలో ఎమోషన్‌ కనిపించదు’ అని సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

అప్పుడు సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలువురు మండి పడిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతంలో ఓ ఘటన జరిగింది. తన ప్రియురాలి మీద అనుమానంతో ఓ వ్యక్తి.. ఆమె తలను పగలకొట్టి దారుణంగా హతమార్చాడు. ఆ వార్త క్లిప్పింగ్‌ని ట్యాగ్ చేస్తూ.. తాప్సీ సందీప్ వ్యాఖ్యలకు  కౌంటర్ ఇచ్చారు. "అతను అనుమానంతో ఆ అమ్మాయి తలను పగలగొట్టాడా? వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారు కాబట్టి.. తన ప్రేమను నిరూపించుకోవడానికే తనను హతమార్చాడా" అని తాప్సీ ట్వీట్ చేశారు. 

అర్జున్ రెడ్డి వర్సెస్ కబీర్ సింగ్: ఎవరి సత్తా ఏమిటి..?

సందీప్ రెడ్డి ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు చెప్పినప్పుడు కూడా పలువురు సెలబ్రిటీలు మండిపడ్డారు. ముఖ్యంగా చిన్మయి శ్రీపాద, లక్ష్మీ మంచు, అనసూయ మొదలైనవారు ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తాజాగా తాప్సీ చేసిన ట్వీట్ పై పలువురు నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఒక దారుణ సంఘటనకు.. సందీప్ రెడ్డి వ్యాఖ్యలకు లింక్ పెట్టి తాప్సీ చేస్తున్న వ్యాఖ్యలు కవ్వించే విధంగా ఉన్నాయని.. అందులో నిజాయతీ లేదని తెలిపారు. అలాగే నిజాలు చెబితే ఇలాంటి అమ్మాయిలకు నచ్చదని కూడా కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు. 

కాగా, ఎన్నో వివాదాల మధ్య బాలీవుడ్‌లో విడుదలైన కబీర్ సింగ్ (Kabir Singh) చిత్రం ఇంకా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. దాదాపు రూ.300 కోట్ల పై చిలుకు కలెక్షన్లను రాబట్టింది. మురాద్ ఖేతాని, అశ్విన్ వర్దే, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. షాహిద్ కపూర్, ఖైరా అద్వానీ ముఖ్య పాత్రలు పోషించారు. 2019లో విడుదలైన బాలీవుడ్ చిత్రాలలో.. ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసిన సినిమాల జాబితాలో "కబీర్ సింగ్" కూడా స్థానాన్ని సంపాదించుకుంది.

'కబీర్ సింగ్' ప్రేయసి.. మన 'అర్జున్ రెడ్డి'ని ఎందుకు కలిసింది..?

టాలీవుడ్ చిత్రం "అర్జున్ రెడ్డి"కి రీమేకైన.. కబీర్ సింగ్ చిత్రంపై మొదటి నుంచీ విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సింగర్ చిన్మయి శ్రీపాద, సందీప్ రెడ్డి వ్యాఖ్యల పై స్పందిస్తూ.. "ప్రేమలో ఉంటే ఒకరినొకరు కొట్టుకోవాలని రూలేమీ లేదు. నేను, నా భర్త కూడా ప్రేమించుకున్నాం. కానీ తను నన్ను ఎప్పుడూ కొట్టలేదు. ఒకరిని ఒకరు కొట్టుకుంటేనే ప్రేమ ఉంటుందనే మాటలో అర్థం లేదు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు.. ఆ సినిమాలు తీసే డైరెక్టర్లు చేసే కామెంట్ల వల్లే పిల్లలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది" అని తెలిపారు. 

ఆసుపత్రిలో "అర్జున్ రెడ్డి".. విజయ్ దేవరకొండకు ఏమైంది...?

అలాగే ప్రముఖ యాంకర్ అనసూయ మొదటి నుండీ కబీర్ సింగ్ సినిమాను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చిన్మయి శ్రీపాద తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశాక.. తనలాంటి వారికి మరింత బలం చేకూరిందని తెలిపారామె. అయితే తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగాక.. సందీప్ కూడా తన వివరణ ఇచ్చారు. తన మాటలు వక్రీకరించారని.. తన భావాలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. అయితే సందీప్ రెడ్డి వంగా వ్యాఖ్యలకు.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతు ఇచ్చారు. ఆయన మాటలలో నిజాయతీ, ధైర్యం ఉన్నాయని తెలిపారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.