ADVERTISEMENT
home / Bollywood
‘రాజు గారి గది 3’ చిత్రంలో హీరోయిన్‌గా.. మిల్కీ బ్యూటీ తమన్నా

‘రాజు గారి గది 3’ చిత్రంలో హీరోయిన్‌గా.. మిల్కీ బ్యూటీ తమన్నా

రాజు గారి గది (Raju Gari Gadhi) – ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకి భయంతో పాటు.. పొట్ట చెక్కలయ్యే కామెడీ సీన్లు కూడా గుర్తుకొస్తాయి . ఎందుకంటే 2015 లో ఈ చిత్రం హారర్ కామెడీ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది . ఇక ఆ ఫార్ములా హిట్ కావడంతో.. ఆ చిత్ర  దర్శకుడు, ప్రముఖ యాంకర్ ఓంకార్, 2017 సంవత్సరంలో సమంత (Samantha) & నాగార్జునల (Nagarjuna) కాంబినేషన్‌లో ‘రాజు గారి గది 2’ చిత్రాన్ని తీశారు. అయితే ఈ టైటిల్ చూసి ప్రేక్షకులు మంచి వినోదాత్మకమైన చిత్రాన్ని ఆశించి థియేటర్ల‌కి వెళ్ళగా.. వారికి నిరాశే మిగిలింది.

ఇక ఆ సినిమా ఫలితంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఓంకార్ (Ohmkar), మళ్ళీ ఇప్పుడు ‘రాజు గారి గది 3’ చిత్రంతో ముందుకొస్తున్నాడు.  అయితే ఈ చిత్రంలో కథానాయికగా తమన్నాని (Tamannaah) ఎంపిక చేయడంతో.. మళ్లీ అందరి కళ్లూ ఈ సినిమాపై పడ్డాయి.  ఈ చిత్రం ద్వారా తన తమ్ముడు అశ్విన్‌ని సోలో హీరోగా పరిచయం చేయనున్నాడు ఓంకార్.

ఈ రోజే ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక  తమన్నా మాట్లాడుతూ ” రాజు గారి గది వంటి సూపర్ హిట్ ఫ్రాంచైజీలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. అదే సమయంలో దర్శకుడు ఓంకార్ చెప్పిన కథ కూడా చాలా బాగుంది. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుంది” అని ఆశాభావం వ్యక్తం చేసింది.

ADVERTISEMENT

Raju Gari Gadhi 2 Movie Opening

ఇక దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ – “ఈ చిత్రం కచ్చితంగా రాజు గారి గది సినిమా అంచనాలకు అందుకుంటుంది. ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉంటాయి”  అని స్పష్టం చేశాడు. 

రేపటి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనుండగా.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి బుఱ్ఱా సాయి మాధవ్ సంభాషణలు అందిస్తుండగా .. ఓంకార్  కథ, కథనం & దర్శకత్వ బాధ్యతలని నిర్వహిస్తున్నారు. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర కథానాయిక తమన్నా విషయానికి వస్తే.. తాను ఈ సంవత్సరం F2 చిత్రం ద్వారా మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తాను ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “సైరా నరసింహ రెడ్డి”లో ఒక కీలక పాత్రను పోషిస్తుండడం విశేషం. అలాగే తమిళంలో మరో మూడు సినిమాలు చేస్తోంది. దీనితో దాదాపు అయిదు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయని తెలుస్తోంది. అలాగే తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న “దటీజ్ మహాలక్ష్మి” చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం “రాజు గారి గది 3” చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికై.. మళ్లీ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది తమన్నా. 

ADVERTISEMENT

Tamannaah

ఏదేమైనా… తెలుగునాట హారర్  కామెడీ చిత్రాలకు రోజు రోజుకూ  ఆదరణ పెరుగుతుందన్న మాట వాస్తవమే. రాజు గారి గది 3 చిత్రం కూడా అదే కోవలో ప్రేక్షకులను రంజింపజేస్తుందని భావిద్దాం. 

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

ద‌టీజ్ మ‌హాల‌క్ష్మితో.. టాలీవుడ్ క్వీన్‌గా మార‌నున్న‌ త‌మ‌న్నా!

తమ‌న్నా ఈ న‌టుడితో.. డేటింగ్‌కి వెళ్లాల‌ని అనుకుందట. ఎందుకో తెలుసా?

టాప్ 5 టాలీవుడ్ క్వీన్స్ ఎవరో తెలుసా..?

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

20 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT