టిక్ టాక్ (Tik Tok) వీడియోలతో ఆకట్టుకుంటోన్న కథానాయికలు వీరే..

టిక్ టాక్ (Tik Tok) వీడియోలతో ఆకట్టుకుంటోన్న కథానాయికలు వీరే..

టిక్ టాక్ (Tik Tok).. ప్రస్తుతం భారత్ లో అత్యంత పాపులారిటీ ఉన్న సోషల్ మీడియాల్లో ఇదీ ఒకటి. మన సొంత గొంతుకకి లేదా అందులో అందుబాటులో ఉన్న మ్యూజిక్ కి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం లేదా డ్యాన్స్ చేయడం.. ఇలా మనకు నచ్చినట్లుగా వీడియో (Video) చేసే వీలుంటుంది. అందుకే యువతీయువకులు కూడా ఎక్కువగా టిక్ టాక్ పై మనసు పడుతున్నారు. ఓ వైపు ఈ యాప్ వల్ల పోర్నోగ్రఫీ ఎక్కువవుతోందని.. దీన్ని బ్యాన్ చేయమని ఇటీవలే మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఇలా టిక్ టాక్ ని ఇష్టపడే వారిలో కేవలం సాధారణ వ్యక్తులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఉన్నారండోయ్.. తమ వీడియోలతో ఇతర సోషల్ నెట్ వర్కింగ్  వెబ్ సైట్ల కంటే టిక్ టాక్ యాప్ లో ఎక్కువ మంది ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో చేరింది బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోనీ.


సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీల్లో సన్నీ లియోనీ ముందుంటుంది. తన ఫొటోలు, వీడియోలతో పాటు తన కుటుంబానికి సంబంధించిన ఫొటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది సన్నీ.. తాజాగా టిక్ టాక్ లోనూ అడుగుపెట్టి భర్త డేనియల్ వెబర్.. తన టీంతో కలిసి డ్యాన్స్ చేసింది. టిక్ టాక్ లో డ్యాన్స్ చేసిన ఆ వీడియోని ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ గా మారడం విశేషం. అయితే ఇలా టిక్ టాక్ వీడియోలతో వైరల్ అయిన సెలబ్రిటీల్లో సన్నీ మొదటి వ్యక్తేమీ కాదు. తన కంటే ముందే ఎంతో మంది సెలబ్రిటీలు టిక్ టాక్ వీడియోలు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉండడమే కాకుండా తమ సరదా కూడా తీర్చుకుంటున్నారు. కేవలం సినిమా స్టార్లే కాదు.. బుల్లితెర నటులు కూడా ఇందులో ఉండడం విశేషం. టిక్ టాక్ లో బాగా ఫేమస్ అయిన కొందరు తారల వీడియోలను మనమూ చూసేద్దాం రండి.
1. తెలుగు తారల్లో టిక్ టాక్ లో ఫేమస్ అయిన వారిలో ముందుంటుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె ఖాతాకి లక్షల్లో అభిమానులున్నారు. ఆమె చేసిన ఫన్నీ వీడియోల్లో ఇదీ ఒకటి. ఈ వీడియోను ఓసారి చూసేయండి.
2. ఇటు తెలుగు తో పాటు అటు మలయాళంలోనూ వీడియోలు రూపొందించి పోస్ట్ చేస్తూ రెండు చోట్లా అభిమానుల ఆదరాభిమానాలను సంపాదించుకుంటోంది బబ్లీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. తన టిక్ టిక్ వీడియోలు బోలెడన్ని ఉన్నాయి. వాటిలో ఎంతో క్యూట్ గా ఉండి అందరి మనసునూ హత్తుకున్న వీడియో మాత్రం ఇదే..
3. తెలుగు తారల్లో టిక్ టాక్ లో బాగా యాక్టివ్ గా ఉండే మరో తార పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 లో నటించిన ఈ భామ ఒక్క చిత్రంతోనే అందరి మనసులను దోచుకుంది. ఈ అమ్మడు చేసిన ఈ క్యూట్ వీడియో కూడా మీరు చూసేయండి.

Subscribe to POPxoTV


4. ప్రేమ జంట దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ లు కూడా టిక్ టాక్ లో యాక్టివ్ గానే ఉంటారు. హోలీ సందర్భంగా ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన ఈ వీడియో వారి అభిమానుల మనసులను ఎంతగానో ఆకర్షించింది.
5. బాలీవుడ్ బ్యూటీల్లో తరచూ టిక్ టాక్ వీడియోలు చేస్తూ యాక్టివ్ గా ఉండేవారిలో జాక్వెలిన్ ముందుంటుంది. తన బిజీ షెడ్యూల్లోనూ టిక్ టాక్ వీడియోలు చేయడం ఈ అమ్మడి సరదా అట.
6. జాకీలా తరచుగా కాకపోయినా సరే.. అప్పుడప్పుడూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకునే మరో కథానాయిక శ్రద్ధా కపూర్. తను పోస్ట్ చేసిన ఈ వీడియో మీరూ ఓసారి చూసేయండి.
7. అందాల భామ యామీ గౌతమ్ షాహిద్ కపూర్ తో కలిసి చేసిన ఈ వీడియో ప్రతి అభిమానినీ ఆకర్షిస్తోందంటే నమ్మండి.


వీళ్లే కాదు.. తెలుగు తారల్లో తమన్నా, సమంత, కీర్తి సురేష్ లాంటివాళ్లు.. బాలీవుడ్ బ్యూటీల్లో క్రితీ సనన్, మలైకా వంటివాళ్లు కూడా టిక్ టాక్ లో యాక్టివ్ గానే ఉంటారు. మరి, మీరూ వెంటనే వారిని ఫాలో అయిపోండి. చక్కటి ఎంటర్ టైన్ మెంట్ ని పొందండి.


ఇవి కూడా చదవండి.


 నా దగ్గర అంత డబ్బు లేదు: శ్రీదేవి కుమార్తె జాన్వి ఆసక్తికర వ్యాఖ్యలు


RRR సినిమా కోసం.. తెలుగు భాషతో కుస్తీ పడుతున్న బాలీవుడ్ భామ..!


పుట్టిన రోజు నాడు.. ర‌ష్మిక ఎందుకు అలిగిందో మీకు తెలుసా..?