కమనీయం.. కన్నుల వైభోగం.. అగ్నిసాక్షి ఫేమ్ గౌరీ కల్యాణం..!

కమనీయం.. కన్నుల వైభోగం.. అగ్నిసాక్షి ఫేమ్ గౌరీ కల్యాణం..!

ఐశ్వర్యా పిస్సే (Aishwarya pisse).. అగ్నిసాక్షి (agnisakshi) సీరియల్‌తో తెలుగు లోగిళ్ల ప్రేక్షకులందరిలో మంచి పేరు తెచ్చుకున్న కథానాయిక. బుల్లి తెర హీరోయిన్ అయినా.. వెండితెర కథానాయికలకు ఉన్నంత ఫాలోయింగ్ ఆమె సొంతం. కన్నడ అమ్మాయే అయినా అగ్నిసాక్షి కథానాయికగా అచ్చం తెలుగమ్మాయిలా తెలుగు ప్రేక్షకులు తమ ఇంట్లో అమ్మాయే అన్నట్లుగా మారేలా చేసింది.

కన్నడ నాట అనురూప, పునర్వివాహ అనే సీరియళ్లతో తన కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య.. కొన్ని సినిమాల్లోనూ నటించింది. తెలుగులో ఆమె నటించిన అగ్ని సాక్షి సీరియల్ తర్వాత.. కన్నడంలో సర్వ మంగల మాంగల్యే అనే మరో సీరియల్‌లోనూ నటించడం ప్రారంభించింది.

తెలుగులో గౌరి పాత్రలో నటిస్తున్న ఆమె కన్నడంలో పార్వతి పాత్రలో ఇమిడిపోయింది. అయితే ఆమె కుటుంబ నేపథ్యం మాత్రం పూర్తిగా భిన్నం. ఐశ్వర్య తండ్రి అశ్వనీ కుమార్ అడ్వకేట్. అమ్మ పుష్పాంజలి హౌజ్ వైఫ్. వాళ్లిద్దరికీ ఏకైక కుమార్తె ఐశ్వర్య. సినిమాలతో ఏమాత్రం సంబంధం లేని నేపథ్యం నుంచి వచ్చినా.. సీరియళ్లతో పేరు సంపాదించుకుంది. 

Instagram

తాజాగా నిన్నే (జులై 15) ఐశ్వర్య తన స్నేహితుడు హరి వినయ్‌ని వివాహమాడింది. వీళ్లిద్దరిదీ ప్రేమతో పాటు పెద్దలు కుదిర్చిన వివాహం అని ఐశ్వర్య వెల్లడించింది. మే నెలలో వీరిద్దరి ఎంగేజ్ మెంట్‌కి సంబంధించిన ఫొటోలు ఇన్ స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.  కొన్ని రోజుల క్రితం తన కళ్యాణ శుభలేఖను షేర్ చేస్తూ అందరికీ తన పెళ్లి గురించి వెల్లడించింది ఐశ్వర్య.

బెంగళూరుకే చెందిన హరి వినయ్ బిజినెస్ చేస్తుంటాడట. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ అయ్యాక ఇంత చిన్న వయసులోనే వివాహం చేసుకుంటున్నారని అభిమానుల నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ ఐశ్వర్య తన జీవితం గురించి తాను కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నానని.. వాటిపై తన అభిప్రాయం మారదని చెప్పుకొచ్చింది. 

పెళ్లికి సిద్ధమయ్యేందుకు.. ఈ వధువులిచ్చే సలహాలు ఎంతో తోడ్పడతాయి..!
Instagram

ఐశ్వర్య, హరి వినయ్‌ల వివాహం పూర్తిగా సంప్రదాయబద్ధంగా జరిగింది. వివాహానికి చక్కటి పట్టుచీరతో, పక్కన కొప్పు వేసుకొని గోదా దేవిలా సిద్ధమైంది ఐశ్వర్య. హరి వినయ్ పంచెకట్టుతో సిద్ధమయ్యాడు. పూలదండలు ఆభరణాలు వీరికి పెళ్లి కళను మరింత పెంచాయి. సంప్రదాయబద్ధమైన ఈ వివాహ వేడుక బెంగళూరులోని ఓ కల్యాణ వేదికలో జరిగింది.

ఈ వివరాలను ఐశ్వర్య బయటకు వెల్లడించలేదు. అయితే పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారాయి. పెళ్లి వేడుకలు తమిళ బ్రాహ్మణ వివాహ పద్ధతిలో జరిగాయి. వధూవరులిద్దరినీ భుజాలపై మోయడం.. ఒళ్లో కూర్చొబెట్టుకొని తాళి కట్టించడం వంటివన్నీ అందరినీ ఆకర్షించాయి. 

అంగరంగ వైభవంగా జరిగిన.. అస్మిత పరిణయం..!

హరి వినయ్ సోదరి, మరో ప్రముఖ టీవీ నటి నవ్యా స్వామి, ఐశ్వర్యా కలిసి పెళ్లిలోనూ సందడి చేశారు. ఎంగేజ్ మెంట్‌లో వీరు ముగ్గురు కలిసి దిగిన ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేశాయి. దాంతో అభిమానులంతా వీరిద్దరి బంధుత్వం గురించి ఐశ్వర్యను ప్రశ్నించగా.. ఆమె తాను పెళ్లాడబోతున్న హరి వినయ్‌కి సొంత చెల్లెలని.. తనకు కాబోయే ఆడ పడుచని చెప్పుకొచ్చింది ఐశ్వర్య.

నవ్యా స్వామి ప్రస్తుతం కంటే కూతుర్నే కనాలి, నా పేరు మీనాక్షి సీరియళ్లలో నటిస్తూ బిజీగా ఉంది. ఐశ్వర్య, హరి వినయ్‌ల పెళ్లి వేడుక‌కి తెలుగు, కన్నడ టీవీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్లి వేడుక తర్వాత.. త్వరలో వీరిద్దరి రిసెప్షన్ వేడుక కూడా జరగనుంది. ఈ వేడుకలో వధూవరులిద్దరూ డిజైనర్ దుస్తుల్లో మెరవనున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్  చేసిన నవ్య కొత్త దంపతులకు ఆశీర్వాదాలు అందించమంటూ అభిమానులను కోరింది. 

పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా.. ప్రేమతో అల్లుకున్న బంధం ఈ తారలది..!
Instagram

మరి, వివాహంతో ఒక్కటైన ఐశ్వర్య, హరి వినయ్‌ల జంటకు మనమూ శుభాకాంక్షలు చెబుదాం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.