యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి.. నటిగా గుర్తింపు తెచ్చుకొంది ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh). ఈమె చెన్నైలో పుట్టి, పెరిగిన తెలుగు అమ్మాయి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా? తెలుగులో కమెడియన్‌గా మనల్ని అలరించిన నటి శ్రీలక్ష్మి మేనకోడలు. నటుడు రాజేశ్ కూతురు. సాధారణంగా కెరీర్ ఆరంభంలో హీరోయిన్లకు ఛాలెంజింగ్ రోల్స్ రావడమంటే అరుదు. కానీ ఐశ్వర్య రాజేశ్ దానికి పూర్తిగా భిన్నం. కెరీర్ ఆరంభంలోనే మంచి పాత్రలను అందుకొని నటిగా మంచి పేరు సంపాదించుకొంది. కాకామట్టై, వడా చెన్నై వంటి సినిమాలు ఆమెను నటిగా మరో మెట్టు ఎక్కించాయి. అందుకేనేమో కథానాయిక నేపథ్యమున్న సినిమాలు ఆమెకు వరస కడుతున్నాయి. తాజాగా కౌసల్య కృష్ణమూర్తిగా (Kousalya Krishnamurthy) తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు ఐశ్వర్య. మహిళల క్రికెట్ నేపథ్యంగా తెరెకెక్కుతోన్న తొలి తెలుగు చిత్రమిది.
#AishwaryaRajesh was born in telugu speaking family in chennai. Her father Rajesh was an actor who had appeared in 54 films in Telugu, her aunt Srilakshmi, is a Telugu comedian with over 500 films. https://t.co/uKeKahW6RT #KousalyaKrishnamurthy pic.twitter.com/XnxShHwIJ0
— Creative Commercials (@CCMediaEnt) 25 May 2019
రైతు కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి క్రికెటర్‌గా జాతీయ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం కోసం చేసిన ప్రయత్నమే కథగా తమిళంలో ‘కనా’ అనే సినిమాను రూపొందించారు. కథానాయిక నేపథ్యమున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటించారు. సత్యరాజ్, దర్శన్ ముఖ్యపాత్రలు పోషించారు. నటుడు శివ కార్తికేయన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం విమర్శకులు, సినీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంది. ఎన్నో అవార్డులను సైతం దక్కించుకొంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ‘క్రికెట్ ఇన్ ది బ్లడ్’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఈ సినిమాలోనూ ఐశ్వర్య రాజేషే కథానాయిక.
Aishwarya Rajesh as Kousalya scores well in both the emotional and cricketing scenes. The effort put in by her to learn cricket and portray this role translates well on screen. pic.twitter.com/i4ipqaL3w3
— Creative Commercials (@CCMediaEnt) 25 May 2019
ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ మూవీ మేకర్స్ పతాకంపై కేఏ వల్లభ నిర్మిస్తున్నారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, ఝాన్సీ, రంగస్థలం మహేశ్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దిబూ నీనన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో మహిళా క్రికెట్ నేపథ్యంగా తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.
Here it is!! First look and motion poster of #KausalyaKrishnamurthy. 🏏🏟!! https://t.co/B5ScBMa4Lg#KKMfirstlook #CricketInTheBlood @aishu_dil @CCMediaEnt #KarthikRaju @KA_Vallabha @Siva_Kartikeyan @vennelakishore #BheemaneniSrinivasaRao
— aishwarya rajessh (@aishu_dil) 24 May 2019
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదలయ్యాయి. వాటికి తెలుగు సినీ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. పొలాల్లో బ్యాట్ పట్టుకొని సాదాసీదాగా కనిపించిన ఐశ్వర్య.. ఆ తర్వాత స్టేడియంలో బ్లూ జెర్సీలో బాల్ పట్టుకొని కనిపిస్తుంది. తమిళ సినిమానే యథాతథంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకొంటుందో తెలుసుకోవాలంటే.. మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
చెన్నైలో స్థిరపడిన తెలుగు సినీ కుటుంబంలో జన్మించిన ఐశ్వర్య చక్కగా తెలుగు మాట్లాడుతుంది. తన అత్త శ్రీలక్ష్మి, తండ్రి రాజేష్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని కథానాయికగా రాణిస్తోన్న ఐశ్వర్య.. విక్రమ్, ధనుష్, నివిన్ పౌలీ, దుల్కర్ సల్మాన్, అర్జున్ రాంపాల్ వంటి హేమాహేమీల సరసన నటించి మెప్పించింది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన మరో చిత్రంలోనూ నటిస్తోంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.