బిగ్ బాస్ నుండి అలీ రెజా & శివజ్యోతి లలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో తెలుసా...

బిగ్ బాస్ నుండి అలీ రెజా & శివజ్యోతి లలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో తెలుసా...

బిగ్ బాస్ (bigg boss) తెలుగు సీజన్ 3లో భాగంగా నిన్న జరిగిన ఎపిసోడ్ తొలుత కాస్త వివాదాస్పదంగా మొదలై చివరకు ఒకరిని సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించడంతో ముగిసింది. అయితే ఇది పక్కనపెడితే, ఈ వారం నామినేషన్స్ లో ఉన్న బాబా భాస్కర్ ఇప్పటికే ఫినాలే కి ఎంపికైనట్టుగా బిగ్ బాస్ ప్రకటించిన తర్వాత నిన్నశ్రీముఖి కూడా ఫైనల్ కి వెళ్లినట్టుగా తేల్చేశారు. దీనితో వరుణ్ సందేశ్, అలీ రెజా (ali reza) & శివజ్యోతి (shivajyothi) లు ఇంకా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురిలో చూస్తే, అలీ రెజా & శివజ్యోతి లలో ఒకరు కచ్చితంగా ఈ వారం ఎలిమినేషన్ (elimination) అవుతారు అని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో అన్నది ఈ రాత్రికి ప్రసారమయ్యే ఎపిసోడ్ లో తేలిపోనుంది.

ఓట్ల కోసం హౌస్ మేట్స్ కి చిత్రవిచిత్రమైన టాస్కులు పెడుతోన్న బిగ్ బాస్..

నిన్నటి ఎపిసోడ్ తొలుత వివాదాలతో ప్రారంభమైంది. ఇందులో భాగంగా నాగార్జున ప్రస్తావించిన వివాదాలు ఏంటంటే - బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు ఏవేవో ఊహించుకుని వాటి వల్ల తమకి బిగ్ బాస్ లో అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా  అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. వాటిని నివృత్తి చేయడానికి స్వయంగా నాగార్జున ఇంటిసభ్యులకి అపోహలు ఉన్న అంశాలకి సంబంధించిన వీడియోస్ ని ప్రసారం చేయడం.. ఆ వీడియోల్లో ఇంటిసభ్యులు మాట్లాడిన మాటలకి సంబంధించి వివరాలని కూడా నిశితంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు నాగ్.

ముందుగా గత వారాంతంలో బిగ్ బాస్ కి తనని శ్రీముఖి రికమండ్ చేసినట్టుగా తనకి తెలిసి చాలా బాధపడ్డాను అని రాహుల్ సిప్లిగంజ్ చెప్పడం జరిగింది. అలాంటి మాటలు తన తోటివారితో చెప్పడం తనని ఇంకా బాధించింది అని కూడా చెప్పాడు. ఒకవేళ నేను చెబుతున్న ఈ మాటల్లో ఏదైనా తప్పు ఉంటే నేను చేసినదానికి శిక్షగా బిగ్ బాస్ నుండి వెళ్ళిపోతాను అని కూడా చెప్పాడు. దీనితో శ్రీముఖి.. రాహుల్ గురించి పైన పేర్కొన్నదానికి సంబంధించిన వీడియో ప్లే చేశారు, అందులో ఎక్కడా కూడా రాహుల్ ఆరోపించినట్టుగా శ్రీముఖి చెప్పినట్టుగా కనపడలేదు. దీనితో రాహుల్ సిప్లిగంజ్ చేత శ్రీముఖికి క్షమాపణ చెప్పించారు నాగార్జున.

ఇక మరొక సందర్భానికి సంబందించిన వీడియో ని ప్రసారం చేశారు. ఆ వీడియో లో రాహుల్ సిప్లిగంజ్ ఫేక్ ఎలిమినేషన్ తరువాత బిగ్ బాస్ క్రూ లో కొంతమంది నువ్వు ఎక్కడికి వెళ్లవు, ఇక్కడే ఉంటావు అని చెప్పారని.. అలాగే నువ్వే ఈ సీజన్ విన్నర్ అని కూడా అతనికి చెప్పారని.. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా శివజ్యోతి & అలీ రెజా లతో చెప్పాడని, అదే విషయం తనకి శివజ్యోతి చెప్పిందంటూ శ్రీముఖి బాబా భాస్కర్ తో ఈ మాటలు చెప్పడం జరిగింది.

ఈ మాటల గురించి శ్రీముఖిని అడగగా - తనకి శివజ్యోతి చెప్పిన విషయాన్నే బాబా భాస్కర్ కి చెప్పాను అని చెప్పింది. దీనికి సంబంధించి శివజ్యోతిని వివరణ అడగగా - అసలు తాను విన్నర్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పలేదు అని & రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ చూసి వచ్చాక చెప్పిన సంఘటనలే శ్రీముఖి తో మాట్లాడాను అని.. అందులో విన్నర్ అనే పదం అస్సలు లేనే లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇదే అంశమై రాహుల్ సిప్లిగంజ్ ని అడిగితే కూడా, తనని బాగా ఆడు అని చెప్పి ప్రోత్సహించారే తప్ప ఇంకెలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు అని తన వివరణ ఇచ్చాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు సర్ ప్రైజ్ ఎలిమినేషన్ ఉండబోతోందా?

ఈ అంశంలో శ్రీముఖి తప్పుగా ఊహించుకుని.. ఏదేదో అనుకుని అనవసరంగా లేని పోని అంశాలు చర్చించింది అని నిరూపణ జరిగింది. అందుకే బిగ్ బాస్ ఏ కంటెస్టెంట్లకి సపోర్ట్ చేయట్లేదని.. కేవలం వారి ఆటతీరుని చూసి ప్రేక్షకులు వేసే ఓట్ల ఆధారంగానే వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని నాగార్జున తేల్చి చెప్పాడు. కావాలంటే ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది.

ఇదంతా జరిగాక, ఇంటిసభ్యులకి ఒక ఆసక్తికరమైన టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ లో ఒక్కొక్కరు ఈ ఇంటిలో బిగ్ బాస్ విన్నర్ అయ్యేందుకు ఎవరికి ఎక్కువ అవకాశం లేదా తమ అంచనాల్లో టైటిల్ గెల్చుకునే అవకాశం ఉన్న వారి పేరుని చెప్పమని & అదే సమయంలో టైటిల్ గెలవని మిగతావారి పేర్లు చెప్పమని బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు.

అందులో రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్ లు శివజ్యోతి పేరుని చెప్పగా ఆమె కూడా టైటిల్ గెలవడానికి తాను సరైన వ్యక్తిని అని అభిప్రాయం చెప్పారు. ఆ తరువాత రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుస్తాడు అని అలీ రెజా, బాబా భాస్కర్ చెప్పడం జరిగింది. శ్రీముఖి టైటిల్ గెలుస్తుందని శివ జ్యోతి, బాబా భాస్కర్ చెప్పడం విశేషం. ఇలా ఒక్కొక్క ఇంటిసభ్యుడు టైటిల్ గెలిచే వారి పేర్లు చెప్పడం జరిగింది. దీన్నిబట్టి ఇంటిసభ్యులు సరిగ్గా ఒకరి పట్ల మరొకరు సరైన అంచనాతో లేరు అని చెప్పారు వ్యాఖ్యాత నాగార్జున.

ఆఖరుగా ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో ఆఖరి నామినేషన్స్ ఈరోజు జరగబోతున్నాయి. మరి ఈ నామినేషన్స్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అన్నా చెల్లెలు అయిన అలీ రెజా & శివజ్యోతి లలో ఒకరు ఎలిమినేట్ అవ్వనున్నారు అనేది తెలుస్తుంది. మరి అందరూ ఊహించినట్టుగానే కాకుండా ఇంకేదేమైనా జరుగుతుందా అనేది వేచి చూడాలి.

అలీ రెజా చేసిన పొరపాటుతో.. రాహుల్ సిప్లిగంజ్ కి బిగ్ బాస్ ఫినాలే టికెట్