'అల వైకుంఠపురములో' ట్రైలర్ టాక్ - 'అల్లు అర్జున్ & త్రివిక్రమ్' మ్యాజిక్

'అల వైకుంఠపురములో' ట్రైలర్ టాక్ - 'అల్లు అర్జున్ & త్రివిక్రమ్' మ్యాజిక్

Allu Arjun and Trivikram's Ala Vaikunthapurramloo Movie Trailer Talk

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  కలయికలో వస్తున్న మూడవ చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ చిత్రానికి సంబంధించి నిన్న రాత్రి హైదరాబాద్‌‌లో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు తమన్, గీత రచయితలు - సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణ చైతన్యలు.. అలాగే పలువురు గాయకులూ పాల్గొన్నారు

"స్టైల్‌గా ఉంది కదా! నాకు కూడా నచ్చింది - "అల వైకుంఠపురము లో" టీజర్‌లో అల్లు అర్జున్

ఇదే ఈవెంట్‌లో 'అల వైకుంఠపురములో' సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఇదే ట్రైలర్ అంతర్జాలంలో ట్రెండింగ్ వీడియోగా మారింది. ఇంతకి ఈ ట్రైలర్ ఎలా ఉందో తెలియాలంటే.. ఈ  ట్రైలర్ టాక్ చదవాల్సిందే.

ఇక ఈ ట్రైలర్ మొదట్లోనే.. కలల్లో విహరిస్తున్న అల్లు అర్జున్‌కి ఆయన తండ్రి మురళి శర్మ చెప్పే మాటలివి -

"రేయ్.. మనది మిడిల్ క్లాస్.. లక్ష పనులు, కోటి వర్రీస్ ఉంటాయి... తలొంచుకుని వెళ్ళిపోవాలి అంతే!" అంటూ చెప్పిన డైలాగ్‌తో సినిమా కథకు సంబంధించిన కీలక పాయింట్‌ను చెప్పే ప్రయత్నం చేశారు దర్శకులు. అలాగే దానితో పాటు అల్లు అర్జున్ చెప్పే డైలాగ్‌తో ఆయన పాత్ర స్వభావాన్ని కూడా తెలియచేశారు. 

"చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో 'ఆహా' అనుకునే రోజు ఒక్కటి కూడా లేదు." అనే డైలాగ్ పాత్ర ఫీలింగ్‌ను తెలియజేస్తుంది.

అలా అని చెప్పి అల్లు అర్జున్ పాత్రకి ఏమాత్రం కూడా విలువలు లేవు అనుకోవడానికి వీలు లేకుండా వెంటనే.. "చిన్న అబద్దం కూడా చెప్పడం రాకపోతే ఎలా రా?" అని వాళ్ళ నాన్న అంటే దానికి - "నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది నాన్న... చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది..." అని చెప్పించారు

 

ఇలా విలువలు, అసహనం కలగలిసిన ఆ పాత్ర చుట్టూ నడిచే కథ ఇదని అర్ధమవుతుంది. ఇక త్రివిక్రమ్ చిత్రాల్లో ఆడవారి పై మంచి సంభాషణలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకు ఈ చిత్రం కూడా మినహాయింపు కాదు. 

"దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్...

ఒకటి నేలకి, రెండోది వాళ్ళకి (ఆడవారికి).. అలాంటోళ్ళతో మనకి గొడవలెందుకు సార్, జస్ట్ సరెండర్ అయిపోవాల్సిందే." అన్న డైలాగ్ మహిళల వ్యక్తిత్వాన్ని పెంచేదిగా ఉంది.

ఇక తన ప్రతి చిత్రంలో ఏదో ఒక జీవిత సత్యం గురించి ప్రస్తావించడం... అందుకు తగ్గ మాటలను చక్కగా పొందుపరచడం వంటివి చేస్తుంటారు త్రివిక్రమ్. ఈ 'అల వైకుంఠపురములో' కూడా అటువంటి ఓ సంభాషణ ఉంది. అదే - "గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్... గొప్ప యుద్ధాలన్నీ, నా అనుకునే వారితోనే!!"

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' ట్రైలర్.. ఫ్యాన్స్ అంచనాలని అందుకుందా?

వీటితో పాటుగానే త్రివిక్రమ్ మార్క్ లవ్ డైలాగ్స్, హీరోయిజాన్ని ప్రస్తావించే డైలాగ్స్ కూడా ఈ ట్రైలర్ నిండా పుష్కలంగా ఉన్నాయి.

"కాల్ మీ.. వెన్ ఫ్రీ అని... అందులో తప్పేముంది?! ఫ్రీగా ఉంటే కాల్ చేయమంది..

అంటే చివరలో బేబీ అని ఉంది... ఒక హార్ట్ సింబల్ కూడా ఉంది, అది కూడా రెడ్ కలర్ లో..."

హీరోయిజం డైలాగ్స్‌కి వస్తే -

"అదే టైంలో... పులొచ్చింది... మేక సచ్చింది.. "

"ఐ ఫీల్ లైక్ విజిలింగ్... ప్స్చ్ !! దీనికి విజిలొక్కటి సరిపోదు... బద్దలైపోయె బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ... స్లో మోషన్, గాల్లో సూట్ ఎగరడం... చాలా స్పెషల్ ఎఫెట్స్ ఉన్నాయి.. రేపు ప్లాన్ చేస్తాను... నువ్వొచ్చేయ్ బ్రదర్.

అంటూ అల వైకుంఠపురములో ట్రైలర్‌ని ఆసక్తికరంగా ముగించారు దర్శకులు. మరి ఈ ట్రైలర్ టాక్ చదివాక, ఈ సినిమా సంక్రాంతికి కచ్చితంగా విజయాన్ని అందుకోవడం ఖాయమని తెలుస్తుంది కదా..!

'అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల' ప్రేమకథ.. సినిమా కథని మరిపించేలా ఉంటుంది తెలుసా...!