బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి బాబా భాస్కర్.. టెన్షన్ లో మిగతా నలుగురు కంటెస్టెంట్స్

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి  బాబా భాస్కర్.. టెన్షన్ లో మిగతా నలుగురు కంటెస్టెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ (bigg boss) ఊహించని ట్విస్ట్ ఇచ్చి అందరిని టెన్షన్ లోకి నెట్టేశాడు. అయితే ఆ ఊహించని ట్విస్ట్ ఏంటంటే - ప్రతివారం నామినేషన్స్ లో ఉన్న వారు సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా ప్రకటించేది శనివారం, ఆదివారం అయితే, ఈ వారం మాత్రం నిన్న అనగా శుక్రవారం నాడు ఈ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది.

ఇక నిన్నటి ఆ ప్రక్రియలోకి వెళితే, అర్ధరాత్రి మూడున్నర గంటల సమయంలో బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అయిదుగురు సభ్యులైన - బాబా భాస్కర్ , వరుణ్ సందేశ్. శ్రీముఖి, అలీ రెజా, శివజ్యోతి లని సైరన్ మోగించి నిద్రలేపడం జరిగింది. అలా నిద్రలేపిన తరువాత వారికి చెరొక సూట్ కేస్ ఇచ్చి అందులో తమ బట్టలని సర్దుకొమ్మని చెప్పడం జరిగింది.

 బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు సర్ ప్రైజ్ ఎలిమినేషన్ ఉండబోతోందా?

ఈ అనూహ్య పరిణామంతో ఇంటిసభ్యులంతా షాక్ లో ఉండిపోయారు. అలా షాక్ కి గురైన సభ్యులని ఇంటి బయట ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు పిలిచి ఆ అయిదుగురిని వారికి కేటాయించిన పొడియమ్స్ పైన నిలబెట్టడం జరిగింది. అలా నిలబెట్టాక, ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ఎటువంటి ఆలోచనతో వచ్చి ఉంటారు అని అదే సమయంలో ఎన్ని ఆలోచనలతో వచిన్నప్పటికి కూడా ఇక్కడ ఉత్పన్నమయ్యే పరిస్థితులు కారణంగా వాటికి అనుకూలంగా మార్చుకుంటూ ఇంతవరకు ప్రయాణం చేశారు అని తెలిపారు.

బిగ్ బాస్ మాటలు పూర్తయ్యాక, నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్క సభ్యులు తమ బిగ్ బాస్ జర్నీ గురించి చెప్పమని కోరగా.. ముందుగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ - తాను జీవితంలో చాలా బిడియంతో ఉండేవాడిని అని అలాగే కాస్త కోపం కూడా ఎక్కువగానే ఉండేది అని చెప్పి.. అయితే బిగ్ బాస్ కి వచ్చాక మాత్రం ఈ రెండిటిని జయించాను అని చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా తన భార్య వితికతో కలిసి 90 రోజుల పాటు ఇక్కడ ఉండడంతో తమ మధ్య ఉన్న బంధం కూడా చాలా బలపడింది అని చెప్పాడు.

ఓట్ల కోసం హౌస్ మేట్స్ కి చిత్రవిచిత్రమైన టాస్కులు పెడుతోన్న బిగ్ బాస్..

వరుణ్ తరువాత బాబా భాస్కర్ మాట్లాడుతూ.. తన జీవితంలో ఎవ్వరూ కూడా నువ్వు చేసింది తప్పు అని చెప్పేవారు లేరు, అయితే ఇక్కడ మాత్రం వంట సరిగా చేయకపోయినా ఇంటిసభ్యులు నిలదీస్తారు అని.. ఇక శ్రీముఖి తనకి ఒక మంచి శ్రేయోభిలాషిగా బిగ్ బాస్ హౌస్ లో ఉందని తెలపడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక, ఒకటి ఏదైనా నేర్చుకోవాలి లేదా ఏదైనా ఒకటి నేర్పించాలి అని ముగించాడు. శ్రీముఖి బయట ఎవరి జీవితానికి వాళ్లే బాస్ లు.. కానీ ఇక్కడ బిగ్ బాస్ చెప్పినట్లు చేస్తూ క్రమశిక్షణ నేర్చుకున్నామని చెప్పింది. ఇంటి సభ్యులందరినీ తాను బయటకు వెళ్లాక కలిసినా.. బిగ్ బాస్ హౌజ్ ని, బిగ్ బాస్ గొంతును ఎంతో మిస్సవుతానని చెప్పుకొచ్చింది. 

వీరి తరువాత అలీ రెజా & శివజ్యోతి లు తమ ప్రయాణాన్ని గురించి వివరించడం జరిగింది. వీరు కూడా తమ బిగ్ బాస్ ప్రయాణం పట్ల చాలా వరకు సంతృప్తినే వ్యక్తపరిచారు. వీరి మాటలు ముగిశాక, బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్న టాప్ 5 లోకి ఎంపికైన మరొక సభ్యుడు & బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే (bigg boss grand finale) కి వెళ్ళేది  బాబా భాస్కర్ (baba bhaskar) అని తెలియచేశారు.

దీనితో టాప్ 5లో ఇప్పటికే ఇద్దరు సభ్యులు (contestants) - రాహుల్ సిప్లిగంజ్ & బాబా భాస్కర్ లు కన్ఫర్మ్ అయిపోగా మిగిలిన మూడు స్థానాల కోసం నలుగురు సభ్యులు పోటీలో ఉండడం జరిగింది. మరి ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.

Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్ & శ్రీముఖి ల మధ్య పెరుగుతున్న వైరం