Bigg Boss Telugu 3 : బాబా భాస్కర్ & రవికృష్ణలలో.. ఎవరు ఎలిమినేట్ అవుతారు?

Bigg Boss Telugu 3 : బాబా భాస్కర్ & రవికృష్ణలలో.. ఎవరు ఎలిమినేట్ అవుతారు?

(Baba Bhaskar or Ravikrishna to be eliminated from Bigg Boss Telugu 3)

'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3'లో.. ఈరోజుతో 10వ వారం ముగియనుంది. అదే సమయంలో ఈరోజు నామినేషన్స్‌లో భాగంగా ముగ్గురు సభ్యులలో ఒకరు - బాబా భాస్కర్, రవికృష్ణ & శ్రీముఖిలలో ఒకరు ఎలిమినేట్ కావడం తథ్యం. అయితే శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్ పరంగా చూస్తే, ఆమె ఈ వారం ఇంటి నుండి నిష్క్రమించదనే భావన కలుగుతోంది. దీనితో బాబా భాస్కర్, రవికృష్ణ‌‌లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. 

Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్‌లకి.. క్లాస్ పీకిన నాగార్జున!

అయితే ఈ వారం బిగ్ బాస్ ఎపిసోడ్లను ఒకసారి పరిశీలిస్తే.. బాబా భాస్కర్ ఎక్కువగా ఎంటర్‌టైన్ చేసినప్పటికి, ఆయన పై వ్యతిరేకత కూడా బాగా పెరిగింది. అదే సమయంలో రవికృష్ణ విషయానికి వస్తే, ఈ మధ్యకాలంలో గేమ్ షోలో తన పెర్ఫెర్మెన్స్ కొంతవరకూ తగ్గింది. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నాడు. అయితే ఇంటి సభ్యుల నుండి తనకు వ్యతిరేకత ఉన్నా..దాని ప్రభావం అతనిపై పెద్దగా పడినట్లు కనిపించలేదు.

కనుక ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యేందుకు.. ఎక్కువ అవకాశాలు బాబా భాస్కర్ వైపే ఉన్నాయి. ఆయన కూడా "బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినా ఫర్వాలేదు" అని చెబుతుండడంతో.. తన భవిష్యత్తు ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున .. ఇంటిసభ్యులు ఈ వారమంతా చేసిన పనుల పై ఒక సమీక్ష చేస్తారు. వారి తప్పులని వారికే తెలియచేస్తూ ఎపిసోడ్‌ని కొనసాగించారు. ముందుగా రాహుల్ సిప్లిగంజ్ - వరుణ్ సందేశ్‌ల మధ్య జరిగిన గొడవ ప్రస్తావనను తీసుకురావడం.. అందులో ఈ ఇద్దరూ తమ వెర్షన్‌ని వినిపించగా.. ఆ వివాదంతో సంబంధం ఉన్న వితిక, పునర్నవిలని ప్రశ్నించడం కూడా జరిగింది. వారు కూడా తాము చూసింది చెప్పారు. ఈ  క్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. ఈ వివాదంలో ఇద్దరి తప్పు ఉందని చెప్పడంతో పాటుగా.. రాహుల్ సిప్లిగంజ్ & వరుణ్ సందేశ్‌ల మధ్య ఒక రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు.

దీని తరువాత బాబా భాస్కర్‌ని బాబా మాస్కర్ అని పేర్కొంటూ.. ఆయనకి సంబంధించి కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. ఈ వీడియోల్లో ఆయన ఒకే విషయం పై.. మూడు, నాలుగు అభిప్రాయాలు చెప్పడం గమనార్హం. దీనితో అసలు ఆయన మనసులో.. ఏముందో తెలుసుకోవడం కష్టమవుతోందని చెప్పడం జరిగింది. ఒకరకంగా ఈ కామెంట్స్ ఆయన పై నెగటివిటీని పెంచాయనే చెప్పాలి. ఆ కామెంట్స్ వల్లే ఆయన ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని టాక్. 

Bigg Boss Telugu 3: అలీ రెజా రీ-ఎంట్రీతో.. బిగ్ బాస్ ఇంటిసభ్యులు షాక్?

ఇక బాబా భాస్కర్ తరువాత.. పునర్నవి బిగ్‌బాస్ హౌస్‌లో మాట్లాడుతున్న తీరును గురించి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పని ఆమెకు హితబోధ చేశారు. "బయట కూడా ఇలాగే మాట్లాడతావా నువ్వు?" అంటూ నాగార్జున ప్రశ్నించారు. ఇటువంటివి మాట్లాడకుండా ఉంటే మేలని.. ఆమెకు తెలియజేసే ప్రయత్నం చేశారు.

ఆఖరుగా హార్ట్ బ్రేకర్ టాస్క్‌ని.. ఇంటి సభ్యులకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇంటి సభ్యులు తమ హార్ట్ బ్రేక్ చేసిన వారిని ఎంపిక చేసుకోవాలి. తర్వాత వారి ముందుకు వెళ్లి.. హార్ట్ సింబల్‌లో ఉన్న వస్తువును విరగొట్టాలి. ఈ టాస్క్‌లో ఎక్కువమంది బాబా భాస్కర్ ముందు హార్ట్ బ్రేక్ చేయగా.. ఆ తరువాత మరికొందరు పునర్నవి ముందు హార్ట్‌ని బ్రేక్ చేయడం జరిగింది. అలాగే నామినేషన్స్‌లో ఉన్న వరుణ్ సందేశ్‌..  సేఫ్ జోన్‌లో ఉన్నట్టుగా నాగార్జున ప్రకటించారు.

ఇక ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో.. నాగార్జున ఇంటి సభ్యులకు "బిగ్ బాస్ టీవీ" అనే టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇంటి సభ్యుల చేత రకరకాలైన ఫీట్లు చేయించారు. అదే సమయంలో ఈవారానికి సంబంధించిన నామినేషన్స్ అంశాన్ని కూడా ఆసక్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో బాబా భాస్కర్ & రవికృష్ణలలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాలంటే.. ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

అయితే అందరూ ఊహించినట్టు ఎలిమినేషన్ జరుగుతుందా? లేదా బిగ్ బాస్ ఇందులో కూడా మరేదో ట్విస్ట్ పెడతాడా ? అనేది ఈ రాత్రికి తెలిసిపోతుంది.

Bigg Boss Telugu 3 : రాహుల్ హౌస్‌‌లోకి రావడంతో.. డల్ అయిన శ్రీముఖి!