అలీ కి రొమాంటిక్ ట్రీట్.. బాబా భాస్కర్ కి ఫ్యామిలీ ప్యాక్ ఆనందం..

అలీ కి రొమాంటిక్ ట్రీట్.. బాబా భాస్కర్ కి ఫ్యామిలీ ప్యాక్ ఆనందం..

బిగ్ బాస్ హౌస్ (bigg boss house) లో సందడి వాతావరణం నెలకొంది. రెండు రోజులుగా ప్రసారమవుతున్న ఎపిసోడ్స్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని కలవడానికి వారి కుటుంబసభ్యులు రావడం జరుగుతున్నది. దీనితో తమ వారిని చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు హౌస్ మేట్స్. అలాగే వచ్చిన వారు కూడా తమ వారు గేమ్ ఎలా ఆడాలి అని చెబుతూ బయట ఉన్న ఫాలోయింగ్ ని, వారు చేయాల్సిన పనులను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Bigg Boss Telugu 3 : వరుణ్ సందేశ్ & శివజ్యోతి కారణంగా నామినేషన్స్ లోకి మొత్తం ఇంటిసభ్యులు

మొదటిరోజు వితిక చెల్లెలు & అలీ రెజా భార్య ఇంటిలోకి రావడం జరిగింది. నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే , శివజ్యోతి భర్త & బాబా భాస్కర్ కుటుంబం బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. అయితే మొన్నటి ఎపిసోడ్ లో అలీ రెజా భార్య ప్రవేశించినా ఆమె తాలూకా సన్నివేశాలని నిన్న ప్రసారం చేశారు. తను ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అందరూ స్లీప్ మోడ్ లో ఉండగా.. ఆమె అలీని పట్టుకొని ఏడ్చేసింది. ఆ తర్వాత తను వెళ్లేటప్పుడు అలీని ఫ్రీజ్ మోడ్ లో ఉంచి గేట్ దగ్గరకి వెళ్లిన తర్వాత రిలాక్స్ చేశారు. దీంతో ఆయన అక్కడికి పరిగెత్తుకెళ్లి తనని హత్తుకొని ముద్దుపెట్టి పంపించేశాడు. హౌజ్ లోకి అడుగుపెట్టిన ఆమె తన భర్త అలీ రెజా తో మాట్లాడుతూ 'నువ్వు ఇంటిలోకి ఎందుకు వచ్చావో అన్న విషయం మర్చిపోకు.. నీ గేమ్ నువ్వు ఆడు అంతే తప్ప పక్కన వారి కోసం ఆడకు. ముఖ్యంగా శివజ్యోతి కోసం ఆట ఆడడం ఆపేసేయ్.

నువ్వు ఇలానే శివజ్యోతి కోసం గేమ్ ఆడతుంటే బయట ప్రేక్షకులు నీకు ఓటు వెయ్యడం మానేస్తారు. నేను, బయట ప్రేక్షకులు కూడా పాత అలీ రెజా చూడాలనుకుంటున్నాము. అలాగే వితిక, వరుణ్ సందేశ్ & రాహుల్ సిప్లిగంజ్ లని స్ట్రాంగ్ గా ఉండమని పునర్నవి మెసేజ్ ఇచ్చింది అని తెలిపింది'.

ఆ తరువాత ఇంటిలోకి వచ్చిన శివజ్యోతి (shiva jyothi) భర్త కూడా.. తన భార్యకి ఇంటిలో ఎలా ఉండాలి అనేదాని గురించి చెప్పడం. ఎవ్వరి గురించి కూడా తప్పుగా కాని అనవసరంగా మాట్లాడడం చేయకు.. టాస్కులలో నువ్వు ఇంత యాక్టివ్ గా చేస్తావు అని నేను అనుకోలేదు అని చెప్పడం జరిగింది. అంతేకాదు.. నువ్వు ఏడుస్తావు అని అందరూ అంటున్నారు. నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. నువ్వేమి భయపడకు, తప్పకుండా నువ్వు టాప్ 5 లో ఉంటావు అని ధైర్యం చెప్పి వెళ్ళాడు.

ఆఖరుగా నిన్న ఇంటిలోకి వచ్చిన బాబా భాస్కర్ (baba bhaskar) కుటుంబసభ్యులు ఆయన బిగ్ బాస్ ప్రయాణం గురించి నిజాయితీగా చెప్పడం జరిగింది. అలాగే బాబా భాస్కర్ భార్య రేవతి (revathi) మాట్లాడుతూ - వితిక (vithika) మీకు థాంక్స్ చెప్పాలి... మీరు గనుక అలా రిక్షా నుండి బయటకి తోసెయ్యకపోతే.. ఈయన ఏమి చేసేవారో అన్నది ఊహించడానికే భయంగా ఉంది అంటూ మాట్లాడడంతో బిగ్ బాస్ హౌస్ లో నవ్వులు పూశాయి.

Bigg Boss Telugu 3: కుండ బద్దలు కొట్టి నిజాలు చెప్పిన.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ..!

అలాగే బాబా భాస్కర్ కి కూడా అయన కుటుంబసభ్యులు గేమ్ మంచిగా ఆడండి & గెలవడానికి ప్రయత్నించండి. ఇంకొక మూడు వారాలు మిగిలి ఉన్నాయి కదా అని గుర్తు చేస్తూ ఆయనకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. బాబా భాస్కర్ కూడా తన కుటుంబసభ్యులని ఇంటిలోకి పంపినందుకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. వీరంతా వచ్చినందుకు తనకి బలం వచ్చింది అంటూ చెప్పడం జరిగింది.

ఇక ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో రాహుల్ సిప్లిగంజ్ తల్లి & వరుణ్ సందేశ్ బామ్మ ఇంటిలోకి రానున్నారు. వరుణ్ సందేశ్ బామ్మ ఇంటిసభ్యులతో చేసే సందడి ఈరోజు ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రసారమైన ప్రోమోలో వీటిని చూపెట్టడం జరిగింది.

ఏదేమైనా.. కుటుంబ సభ్యులు రావడంతో మరో మూడు వారాల పాటు హౌజ్ లో ఉండేందుకు.. కొత్త ఉత్సాహంతో ఆడేందుకు హౌజ్ మేట్స్ కి మరింత బలం వచ్చిందనే చెప్పుకోవాలి. 

కుటుంబ సభ్యులను పంపి ఇంటి సభ్యులను సర్ ప్రైజ్ చేస్తున్న బిగ్ బాస్..