భాగమతి (Bhaagamathie).. అనుష్క కథానాయికగా.. ఉన్ని క్రిష్ణన్ హీరోగా రూపొందిన హారర్ థ్రిల్లర్ సినిమా. బాహుబలి తర్వాత అనుష్క నటించిన ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. 2018లో విడుదలైన ఈ సినిమాలో మురళీ శర్మ, ఆశా శరత్‌లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదలైంది. అక్కడ కూడా సూపర్ హిట్‌గా నిలిచి .. శ్రీదేవి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన కథానాయికగా అనుష్కకి పేరు తెచ్చిపెట్టింది.
ఇప్పుడు ఈ సినిమా హిందీలో రూపొందబోతోంది. తెలుగులో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన జి. అశోక్ హిందీలోనూ దర్శకత్వ బాధ్యతలను చేపట్టనున్నారట. ఈ రీమేక్ (remake) సినిమాలో కథానాయికగా అనుష్క పాత్రను మరోసారి చేసి మెప్పించబోతోంది "సాండ్ ఖీ ఆంఖ్" అంటూ.. ఇటీవలే మన ముందుకొచ్చి అందరినీ ఆకర్షించిన భూమి పెడ్నేకర్. ఆమె గతంలో నటించిన "టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథ" సినిమా నిర్మాతలు.. భాగమతి హిందీ రీమేక్ హక్కులను కూడా కొనుగోలు చేశారట. అయితే రీమేక్ కూడా ఒరిజినల్లా.. మరో అద్భుతంగా నిలిచిపోవాలని.. ఒరిజినల్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడినే సంప్రదించారట. ముందు ఈ దర్శకుడు హిందీలో సినిమాని తిరిగి రూపొందించేందుకు అంతగా ఇష్టపడకపోయినా .. ఓ టాప్ టాలీవుడ్ హీరో ఆయనతో మాట్లాడి ఒప్పించారని టాక్.
ప్రస్తుతం తెలుగులో హిట్టయిన సినిమాలన్నీ బాలీవుడ్లో రీమేక్‌లుగా రూపొందడం కామన్‌గా మారిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన "అర్జున్ రెడ్డి" బాలీవుడ్లో "కబీర్ సింగ్"గా రూపొంది మంచి కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో హీరోగా నటించిన షాహిద్ ఇప్పుడు మరో తెలుగు రీమేక్‌లోనూ నటిస్తున్నాడు. నాని హీరోగా రూపొంది మంచి విజయాన్ని సాధించిన "జెర్సీ" సినిమా బాలీవుడ్లో తిరిగి రూపొందుతోంది. అందులో కూడా షాహిద్ హీరోగా నటిస్తున్నాడు.
@UV_Creations seriously have you guys lost your mind. Even it's no doubt but still #Bhaagamathie worked in Box office only because of #AnushkaShetty's Phenomenal acting.
— Debo😉 (@debothedevil) November 14, 2019
And for Hindi remake you can choose again Sweety for this role why partiality towards her only?
దాని తర్వాత ఇప్పుడు మరో తెలుగు సినిమా బాలీవుడ్లో తిరిగి రీమేక్ అవుతుందంటే.. తెలుగు సినిమా కథలపై బాలీవుడ్ నిర్మాతలకు ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవచ్చు.
ఇక "భాగమతి" చిత్రానికి వస్తే ఈ సినిమాకు హిందీలో విక్రమ్ మల్హోత్రాతో పాటు ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. అంతే కాదు.. అక్షయ్ ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలోనూ కనిపించనున్నారట. దీనికోసం ఎనిమిది రోజుల పాటు ఆయన షూటింగ్లో పాల్గొంటారట.
ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా? తాజాగా "నిశ్మబ్దం" చిత్రంలో అనుష్క సరసన కనిపించిన టాప్ హీరో మాధవన్. మరి, భూమి, మాధవన్‌ల జంట ఎలా ఉంటుంది? మనల్ని ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది తెరపై చూడాల్సిందే. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ తొలి వారం నుంచి ప్రారంభం కానుంది. ఇంకా ఈ సినిమాలో ఆశా శరత్ పాత్ర ఎవరు పోషిస్తారో తెలియాల్సి ఉంది. అలాగే తెలుగులో ఉన్న కథను అచ్చం అలాగే పునర్నిర్మిస్తారా? లేక ఏవైనా మార్పులు చేర్పులు చేసి సినిమా తీస్తారా? అన్న విషయం పైనా ఇంకా క్లారిటీ రాలేదు.
చంచల అనే ఓ ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగులో బాగానే ఆదరణను పొందింది. తనకు కాబోయే భర్తను చంపిన నేరంపై జైల్లో ఉన్న ఆమెను ఎంక్వైరీ కోసం ఓ పాడు పడ్డ బంగ్లాకి తీసుకెళ్తారు. ఆ తర్వాత అక్కడ ఆమెను ఓ ఆత్మ ఆవహించడం.. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు.. వంటి ట్విస్టులతో రూపొందిన భాగమతి తెలుగు ప్రేక్షకుల మనసులను హత్తుకున్నట్లే.. దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు.
మరి కొన్ని నెలలు ఆగితే చాలు.. "భగ భగ భాగమతిరా".. అంటూ అనుష్క తెలుగులో చెప్పిన డైలాగ్‌ని హిందీలో భూమి నోట వినొచ్చన్నమాట. భాగమతిగా భూమి పెడ్నేకర్ నటన మెప్పిస్తుందా? అనుష్కను మరిపిస్తుందా? చూడాల్సిందే.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.