బిగ్ బాస్ 3 గురించి ఎవరికీ తెలియని సీక్రెట్‌ : హౌస్‌లోకి వెళ్లేదెవరో తెలుసా?

బిగ్ బాస్ 3 గురించి ఎవరికీ తెలియని సీక్రెట్‌ : హౌస్‌లోకి వెళ్లేదెవరో తెలుసా?

బిగ్ బాస్ (Big Boss) తెలుగు టీవీ చరిత్రలోనే ఓ సెన్సేషన్. ఇటీవలి కాలంలో మిగిలిన అన్ని షోల కంటే అత్యధిక టీఆర్పీని ఇది సొంతం చేసుకొంది. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా.. అలాగే కనీసం గడియారం కూడా లేకుండా 24 గంటల పాటు కెమెరా కళ్ల మధ్య గడపడమంటే మాటలు కాదు. చెప్పాలంటే గేమ్‌లో అసలు ఆసక్తికరమైన పాయింట్ ఇది కానే కాదు. ఎప్పుడు, ఏ సమయంలో.. ఎవరి మధ్య గొడవలు వస్తాయి? ఎవరి మనసు ఏవిధంగా మారుతుంది? గేమ్ గెలవడానికి హౌస్ మేట్స్ ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారు?

ఇలాంటి విషయాల మీద ఉన్న ఇంట్రెస్ట్‌తోనే షో చూసేవారు ఎక్కువగా ఉంటారు. హౌస్‌లో జరిగే గొడవలు కొన్నిసార్లు ప్రేక్షకులకు తలనొప్పి, చిరాకు రప్పించినా.. ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తితో గేమ్‌ను చూడటానికి ప్రాధాన్యమిస్తుంటారు. ఇవన్నీ ఒకెత్తయితే.. వారాంతాల్లో జరిగే బిగ్ బాస్ ప్రసారం మరో ఎత్తు. ఎందుకంటే.. ఆ రెండ్రోజుల్లో హౌస్ మేట్స్ చేసిన పొరపాట్లు ఎత్తి చూపడంతో పాటు షోని మరింత హైప్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ రెండ్రోజులకు హోస్ట్‌గా వ్యవహరించేది ఓ టాప్ సెలబ్రిటీ కావడంతో ఆ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది.

‘మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కూడా ఓ కన్నేసి ఉంచండి’ అంటూ తొలి సీజన్ హోస్ట్‌గా అందరినీ మెప్పించాడు జూనియర్ ఎన్టీయార్. రెండో సీజన్‌‌లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా చేసినప్పటికీ.. అంత ప్రభావం చూపించలేకపోయాడు. ఈ నేపథ్యంలో మూడో సీజన్‌కు వ్యాఖ్యాతగా ఎవరు వ్యవహరిస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎందుకంటే ఈసారి వ్యాఖ్యాతగా వ్యవహరించేది తారక్, నాని కాదు. మరో టాలీవుడ్ టాప్ స్టార్. నిన్నమొన్నటి వరకు ఈ విషయంలో ఎన్నో ఊహాగానాలు వచ్చాయి.

వెంకటేష్, నాగార్జునల్లో ఎవరో ఒకరు ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారనే వార్తలు వినిపించాయి. గత సీజన్లో విజేతను విక్టరీ వెంకటేష్ ప్రకటించడంతో.. మూడో సీజన్ ఆయనే హోస్ట్ చేస్తారని చాలామంది భావించారు. మరో వైపు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో సక్సెస్‌ఫుల్ హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున (Nagarjuna) ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారని మరో వర్గం భావించింది. ఈ క్రమంలో బిగ్ బాస్ 3 త్వరలో.. అనే ప్రకటన రావడంతో ఈ సీజన్‌కు హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తారనే విషయంలో ఆసక్తి మరింత పెరిగింది.

రెండ్రోజుల క్రితం విడుదలైన ప్రోమోతో  హోస్ట్ ఎవరనే అంశంపై ఓ క్లారిటీ వచ్చింది. బిగ్ బాస్ ఎప్పుడు మొదలవుతుందనే విషయం ప్రోమోలో చెప్పలేదు. కానీ హోస్ట్ విషయంలో మాత్రం అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అందులో నల్లటి హుడీ వేసుకొన్న వ్యక్తిని హోస్ట్ గా చూపించారు. ఆ వ్యక్తి నడక, మ్యానరిజమ్స్ చూస్తుంటే కింగ్ నాగార్జున అనిపిస్తుంది. దీంతో బిగ్ బాస్ షో ఓ రేంజ్‌కి వెళ్లిపోతుందనే అంచనాలు పెరిగిపోయాయి.

బిగ్ బాస్ హోస్ట్ గురించి జనాల్లో ఎంత క్యూరియాసిటీ ఉందో.. అంతకంటే ఎక్కువ ఆసక్తి కంటెస్టెంట్స్ విషయంలోనూ ఉంది. ఎందుకంటే షో మొత్తం నడిచేది వారి భుజాల మీదే కాబట్టి. గత రెండు సీజన్లలో కంటెస్టెంట్స్ ప్రవర్తన, వారి నిజాయతీ ఆధారంగా ఆన్‌లైన్‌లో వారికి మద్ధతు తెలిపే గ్రూపులు కూడా ఏర్పడ్డాయి. ఈ గ్రూపులే విజేతలను నిర్ణయించడంతో పాటు ఎవరిని ఎలిమినేట్ చేయాలో కూడా నిర్దేశిస్తుంటాయి. రెండో సీజన్లో ఈ విషయం సుస్పష్టంగా తెలిసింది. అందుకేనేమో కంటెస్టెంట్స్ విషయంలోనూ అంత ఆసక్తి నెలకొంది.

నటి రేణుదేశాయ్, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాల గుత్తా, సింగర్ హేమచంద్ర బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్‌గా పాల్గొంటారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వారు కొట్టిపడేశారు. తాము బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్స్ కాదని స్పష్టం చేశారు. కానీ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోన్న ఓ జాబితా మాత్రం ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. శ్రీముఖి, గెటప్ శ్రీను, ఉదయభాను, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, శోభిత ధూలిపాళ్ల, నటుడు వేణు, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కృష్ణ చైత‌న్య‌, రేవంత్, బిత్తిరి సత్తి, న్యూస్ రీడర్ సావిత్రి ఈ సీజన్లో పార్టిసిపేట్ చేయనున్నారని సమాచారం.

గత సీజన్లకు ముందు కూడా కంటెస్టెంట్స్ విషయంలో ఇలాంటి ఊహాగానాలే వచ్చాయి. ఆ జాబితాలోని కొంత మంది హౌస్‌లోకి ప్రవేశించినప్పటికీ.. ఎవరూ ఊహించని వారు సైతం హౌస్‌లోకి అడుగుపెట్టారు. గత సీజన్ మాదిరిగా సామాన్యులకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇస్తారా? లేదా? అనే ప్రశ్న మాత్రం బుల్లితెర ప్రేక్షకుల మదిలో అలాగే ఉంది. దీనికి సమాధానం కావాలంటే మాత్రం కొన్ని రోజులు వేచి  చూడాల్సిందే. ఈ కార్యక్రమం జూలై నెల నుంచి ప్రసారం కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వ్యవహరిస్తానంటోన్న రేణు దేశాయ్

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.