ADVERTISEMENT
home / Bigg Boss
బిగ్ బాస్ హౌస్ లో తమ ప్రయాణం చూసి ఎమోషనల్ అవుతున్న కంటెస్టెంట్స్

బిగ్ బాస్ హౌస్ లో తమ ప్రయాణం చూసి ఎమోషనల్ అవుతున్న కంటెస్టెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఇంకొక 4 రోజుల్లో ముగియనుంది. ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్(bigg boss house) లో ఉన్న అయిదుగురు కంటెస్టెంట్స్ (contestants) కూడా తమ బిగ్ బాస్ (bigg boss) జర్నీ గురించి ఒకసారి ఆలోచించుకునే సమయం వచ్చింది. ఇందుకు తగ్గట్టుగానే మొన్న ప్రముఖ యాంకర్ సుమని (anchor suma) బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం జరిగింది. సుమ ఇంటిలోకి వెళ్లి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ తో ఒకరోజు మొత్తం గడపడంతో పాటు వారి మనసులో ఉన్న సందేహాలు తీర్చే ప్రయత్నం చేయడంతో పాటు ఒకరి పట్ల మరొకరు ఏ అభిప్రాయంతో ఉన్నారు అన్న విషయాలని వారితో స్వయంగా చెప్పించే కార్యక్రమం చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు సర్ ప్రైజ్ ఎలిమినేషన్ ఉండబోతోందా?

ఇదిలావుండగా బిగ్ బాస్ జర్నీ ఇప్పటివరకు ఎలా సాగిందో కంటెస్టెంట్స్ కి తెలియచేయడానికి వారిని ఒక్కొక్కరిగా బిగ్ బాస్ హౌస్ లోని యాక్టివిటీ రూమ్ కి పిలిపించి వారికి సంబందించిన 100 రోజుల ప్రయాణాన్ని వారికి చూపెట్టనున్నారు. దీనికి సంబందించిన ప్రోమో కూడా కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.  ఆ వీడియో లో కూడా వరుణ్ సందేశ్ కి సంబందించిన బిగ్ బాస్ జర్నీని చూపెట్టగా అది చూసి ఆయన చాలా ఎమోషనల్ (emotional) అయ్యారు.

ఇలాగే మిగిలిన ఇంటిసభ్యులకి కూడా ఒక్కొక్కరిని యాక్టివిటీ రూమ్ కి పిలిపించి వారి 100 రోజుల ప్రయాణాన్ని చూపెట్టబోతున్నారు. వీటిని మనం ఈరోజు, రేపటి ఎపిసోడ్స్ లో చూసే వీలుంది. ఏదేమైనా 15 వారాల బిగ్ బాస్ ప్రయాణంలో కచ్చితంగా అనేక తీపి, చేదు జ్ఞాపకాలు ఉంటాయి, వాటిని మరొకసారి చూస్తే ఎవ్వరైనా ఎమోషనల్ అవ్వక తప్పదు.

ADVERTISEMENT

ఇక నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేత సుమ రకరకాల టాస్కులు ఆడించడంతో పాటుగా బయట వీరికి మద్దతు అందిస్తున్నవారి, అలాగే విమర్శిస్తున్న వారి సందేశాలని చూపించడం జరిగింది. ఈ సందేశాలని స్వయంగా బిగ్ బాస్ ఆయా ఇంటిసభ్యుల చేతనే చదివించడం జరిగింది. అవి చదివాక తమకి తోచిన వివరణలని కూడా వారు ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా మొన్న జరిగిన టాస్క్ లో విజేతగా నిలిచిన కారణంగా వరుణ్ సందేశ్ కి బయట ఉన్న ఆయన అభిమాని నుంచి ఒక ఫోన్ కాల్ కూడా రావడం జరిగింది.

ఓట్ల కోసం హౌస్ మేట్స్ కి చిత్రవిచిత్రమైన టాస్కులు పెడుతోన్న బిగ్ బాస్..

దేనికి తరువాత టారో కార్డు రీడింగ్ (జాతకాలు చెప్పే కార్డులు చదివే) స్పెషలిస్ట్ ని ఇంటిలోకి పంపించి ఆ స్పెషలిస్ట్ చేత ఇంటిసభ్యులొక్కొకరికి తమకి ఉన్న సందేహాలని ఈ టారో కార్డు రీడింగ్ ద్వారా సమాధానాలు తెలుసుకునే అవకాశాన్ని కలిగించారు బిగ్ బాస్. బాబా భాస్కర్ , రాహుల్ సిప్లిగంజ్ లు బిగ్ బాస్ తరువాత తమ కెరీర్ ఎలా ఉండబోతుంది అని అడగగా.. శ్రీముఖి & అలీ రెజా లు ఈ బిగ్ బాస్ షో తాలూకా ఫలితం ఎలా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. వరుణ్ సందేశ్ మాత్రం ఇందుకు భిన్నంగా అసలు లైఫ్ ఎలా ఉంటుంది అని అడిగి తెలుసుకున్నారు.

ఇలా ఇంటిసభ్యులు గ్రాండ్ ఫినాలే కి దగ్గరవుతున్న కొద్ది తమ బిగ్ బాస్ ప్రయాణం & బిగ్ బాస్ తరువాత తమ జీవితం ఎలా ఉండబోతుంది అన్న దాని పైన ఉంచుకున్న సందేహాలకు కొంతవరకు సమాధానాలు పొందగలిగారు అని చెప్పవచ్చు.

ADVERTISEMENT

ఆఖరుగా ఇంకొక నాలుగు రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత ఎవరో తేలిపోనుంది. మరి మీరు ఇప్పుడున్న అయిదుగురిలో ఎవరికి మద్దతు తెలుపుతున్నారు? మీ సమాధానాన్ని కామెంట్లలో తెలియజేయండి. 

రాహుల్ సిప్లిగంజ్ ని సున్నితంగా మందలించిన శ్రీముఖి తల్లి లత!

 

30 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT