మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!

మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!

chinese


మ‌న‌లో చాలామంది జాత‌కాల‌ను విప‌రీతంగా న‌మ్ముతూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు చూసే స‌మ‌యంలో కూడా అమ్మాయి, అబ్బాయి జంతు గ‌ణాలేంటి?  వాటికి పొసుగుతుందా?  లేదా?? ఇద్ద‌రికీ జాత‌కం విష‌యంలో ఎంత వ‌ర‌కు పాయింట్లు క‌లిశాయి.. వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తూ ఉంటారు. వీటిని మూఢ‌న‌మ్మ‌కాలుగా భావించేవారు కూడా లేక‌పోలేదు! కానీ మీకు చైనీస్ జ్యోతిష్యం (Chinese astrology) గురించి తెలుసా??  మాండ‌రిన్‌లో ఉన్న ఈ  జ్యోతిష క్యాలెండ‌ర్‌ను వారు షెంగ్ గ్జియో అని పిలుస్తారు. ఇందులో ఉండే 12 జంతు చిహ్నాల ప్ర‌కారం ఒక వ్య‌క్తి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చట! ఇంత‌కీ ఆ చిహ్నాలేంటి? అవి మ‌న వ్య‌క్తిత్వం గురించి ఏం చెప్తున్నాయో ఓసారి మ‌న‌మూ తెలుసుకుందాం రండి..


rat


 1. తెలివైన ఎలుక‌


జ‌న్మించిన సంవ‌త్స‌రం: 1912, 1924, 1936, 1948, 1960, 1972, 1984, 1996, 2008 2020..


ఎలిమెంట్:  నీరు


చైనీయుల జ్యోతిష చార్ట్‌లో ఉండే మొట్ట‌మొద‌టి జంతు చిహ్నం ఎలుక‌. ఈ జంతు చిహ్నం ఉన్న వ్య‌క్తులు చాలా తెలివైన‌వారు. అలాగే స‌మాజంలో అంద‌రితోనూ చాలా క‌లుపుగోలుగా వ్య‌వ‌హ‌రిస్తారు. చేసే ప‌నిలో వారెప్పుడూ ఉన్న‌త స్థానంలో ఉండాల‌నే భావిస్తారు. ఇక క‌ళ‌లు, క్రియేటివిటీ వంటివి వీరి రక్తంలోనే ఉంటాయి. అంతేకాదు.. అవి వారి ప‌నిలో కూడా ప్ర‌తిబింబిస్తూ ఉంటాయి. కొత్త విష‌యాల‌ను నేర్చుకునేందుకు, తెలుసుకునేందుకు వీరు ఎప్పుడూ ముందే ఉంటారు. వీరికి ఉన్న ఈ ప్ర‌త్యేక‌మైన గుణాల కార‌ణంగా ఇత‌రుల‌తో చాలా స్నేహంగా మెల‌గ‌గ‌ల‌రు. కానీ కొంత‌మంది ప‌ట్ల మాత్రం కాస్త దురుసుగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు. ఈ విష‌యంలో మాత్రం వీరు కాస్త జాగ్ర‌త్త‌ప‌డాల్సి ఉంటుంది.


 ox


2. సంక‌ల్పం ఉన్న ఎద్దు


జ‌న్మించిన సంవ‌త్స‌రం: 1913, 1925, 1937, 1949, 1961, 1973, 1985, 1997, 2009, 2021...


ఎలిమెంట్:  భూమి


చైనీయుల జ్యోతిష చార్ట్‌లో ఉన్న బ‌ల‌మైన జంతు చిహ్నాల్లో ఇదీ ఒక‌టి. వీరు త‌మ ఫీలింగ్స్‌ను ఎప్పుడూ త‌మ‌లోనే దాచేసుకుంటారు. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు వ‌ద్ద మాత్ర‌మే వీరి మ‌న‌సులో ఏముందో పంచుకుంటారు. ఈ త‌ర‌హా వ్య‌క్తులు త‌మకంటూ కొన్ని నియ‌మాల‌ను ప్ర‌త్యేకంగా రూపొందించుకొని వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ప‌ని విష‌యంలో ఎంతో యాక్టివ్‌గా ఉండే వీరు చ‌క్క‌ని ఆత్మ‌విశ్వాసం క‌లిగి ఉంటారు. మంచి మంచి ఐడియాస్‌తో ముందుకు రావ‌డ‌మే కాకుండా అనుకున్న ప‌నిని పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అయితే ఈ త‌ర‌హా వ్య‌క్తులు న‌లుగురితోనూ అంత సుల‌భంగా క‌ల‌వ‌లేరు. అందుకు కాస్త స‌మ‌యం ప‌డుతుంది.


 tiger


3. ప్ర‌కాశ‌వంత‌మైన‌, ప్ర‌మాద‌క‌ర‌మైన పులి


జ‌న్మించిన సంవ‌త్స‌రం: 1914, 1926, 1938, 1950, 1962, 1974, 1986, 1998, 2010, 2022...


ఎలిమెంట్:  చెక్క‌


ఈ జంతు చిహ్నంతో జ‌న్మించిన‌వారు చాలా వేగంగా ఉండ‌డ‌మే కాదు.. కాస్త క్రూరంగా కూడా ఉంటారు. ముఖ్యంగా చైనీయుల జ్యోతిష క్యాలెండర్ ప్ర‌కారం వీరు చాలా గ‌ట్టి పోటీదారులు. ఒక్క‌సారి వారి దృష్టి పడితే అనుకున్న‌వి సుల‌భంగా సాధించ‌గ‌ల‌రు. ఇక వీరికి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు వెన్న‌తో పెట్టిన విద్య‌వంటివి. ధైర్యం, శ‌క్తి.. ఇవి పుట్టుక‌తోనే వీరికి వ‌స్తాయి. ఒంట‌రిగా ఉండాల‌న్నా భ‌య‌ప‌డ‌ని మ‌న‌స్త‌త్వం వీరిది. అంతేకాదు.. న్యాయం కోసం పోరాడేందుకు కూడా ఎప్పుడూ ముందే ఉంటారు.


 rabbit


4. వేగ‌వంత‌మైన కుందేలు


జ‌న్మించిన సంవ‌త్స‌రం: 1915, 1927, 1939, 1951, 1963, 1975, 1987, 1999, 2011, 2023...


ఎలిమెంట్:  చెక్క‌


వీళ్లు చాలా నెమ్మ‌ద‌స్తులు. జీవితంలో ప్ర‌తి క్ష‌ణాన్ని చాలా బాగా ఆస్వాదిస్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తూ చాలా త్వర‌గా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో వీరి త‌ర్వాతే ఇంకెవ‌రైనా! ఇత‌రుల విష‌యాల్లో కూడా స‌రైన నిర్ణ‌యాలు తీసుకునేలా ప్రోత్స‌హిస్తారు కాబ‌ట్టి వీరిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా న‌మ్మ‌చ్చు. అయితే వీరు అనుకున్న‌ది సాధించే క్ర‌మంలో త‌గిన మార్గాలు క‌నిపించ‌ని ప‌క్షంలో కాస్త ఒత్తిడికి గుర‌వుతుంటారు.


 dragon


5. గొప్పదైన డ్రాగ‌న్


జ‌న్మించిన సంవ‌త్స‌రం: 1916, 1928, 1940, 1952, 1964, 1976, 1988, 2000, 2012, 2024...


ఎలిమెంట్:  భూమి


వీరు పుట్టుకతోనే అదృష్ట‌వంతులు. వీరి జీవితాల్లో కుల‌మ‌తాలకు అతీతంగా మంచికే ప్రాధాన్యం ఇస్తారు. స‌దా ఆత్మ‌విశ్వాసం కోల్పోకుండా చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఎలాంటి స‌వాల్ నైనా ఇట్టే స్వీక‌రించే మ‌న‌స్థత్వం వీరిది. పోరాడ‌కుండా ఓట‌మిని అస్స‌లు అంగీక‌రించ‌రు. ప్రేమ‌, అనుబంధాల విష‌యానికి వచ్చేసరికి వీరు చాలా నిజాయ‌తీగా వ్య‌వ‌హ‌రిస్తారు. కొత్త ప‌నులు ప్రారంభించే ముందు చేతిలో ఉన్న పనుల‌ను మొద‌ట పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు.


 snake


6. తెలివైన పాము


జ‌న్మించిన సంవ‌త్స‌రం: 1917, 1929, 1941, 1953, 1965, 1977, 1989, 2001, 2013, 2025...


ఎలిమెంట్:  నిప్పు


ర‌హ‌స్యాల‌ను ఎవ‌రికీ తెలియ‌కుండా దాచాల‌న్నా, ర‌హ‌స్య జీవితాన్ని జీవించాల‌న్నా వీరి త‌ర్వాతే ఎవ‌రైనా అని చెప్ప‌చ్చు. ఏ ప‌ని చేసే ముందైనా ఒక‌టికి రెండు సార్లు ఆలోచించ‌డం వీరికి అల‌వాటు. ఎక్క‌డైనా స‌రే.. త‌మ‌ని తాము చాలా ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తులుగా ముద్ర వేసుకోగ‌ల స‌త్తా వీరి సొంతం. ఇక అనుబంధాల విష‌యానికి వ‌స్తే తాత్కాలిక బంధాల‌కు కాకుండా శాశ్వత బంధాల‌కే వీరు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాదు.. ఎదుటివారి మ‌న‌స్త‌త్వాల‌ను వీరు చాలా తేలిక‌గా అంచ‌నా వేయ‌గ‌ల‌రు. వారికి సౌక‌ర్యంగా అనిపించ‌ని వ్య‌క్తుల‌కు వీరు చాలా దూరంగా ఉంటారు.


 Horse


7. నోబుల్ గుర్రం


జ‌న్మించిన సంవ‌త్స‌రం: 1918, 1930, 1942, 1954, 1966, 1978, 1990, 2002, 2014, 2026...


ఎలిమెంట్:  నిప్పు


వీరు మార్పుని చాలా త్వ‌ర‌గా ఆహ్వానించ‌డ‌మే కాదు.. దానిని అంతే వేగంగా ఆచ‌ర‌ణ‌లో కూడా పెడ‌తారు. ఒక్క‌సారి వీరికి బాగా ద‌గ్గ‌రైతే వారి కోసం ప్రాణాలైనా పెట్టేందుకు వీరు సిద్ధ‌మైపోతారు. అయితే ఏ విష‌య‌మైనా నేరుగా మాట్లాడే వీరు తేనె పూసిన మాట‌ల‌ను అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. అంతేకాదు.. వీరికి సంబంధించిన విష‌యాలేవీ బ‌య‌ట‌కు అంత‌గా తెలియ‌నివ్వ‌రు. అందుకే కొంద‌రికి వీరి జీవ‌న‌శైలి కాస్త ర‌హ‌స్యంగా కూడా అనిపించ‌వ‌చ్చు. ఇక అనుబంధాల విష‌యానికి వ‌స్తే చాలా నిజాయ‌తీగా వ్య‌వ‌హ‌రించే భాగ‌స్వాముల‌ను వీరు ఇష్ట‌ప‌డ‌తారు.


goat 


8. సిగ్గ‌రి అయిన గొర్రె\ మేక‌


జ‌న్మించిన సంవ‌త్స‌రం: 1919, 1931, 1943, 1955, 1967, 1979, 1991, 2003, 2015, 2027...


ఎలిమెంట్:  భూమి


వీరు చాలా సిగ్గ‌రులు. అలాగే చాలా నిశ్శ‌బ్దంగా కూడా ఉంటారు. అయితే ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు మాత్రం వీరు సంతోషంగా ఉంటారు, ఏ ప‌నైనా వీరికి న‌చ్చిన‌ట్టుగానే చేస్తారు. స‌హ‌నం కోల్పోవ‌డం చాలా అరుద‌నే చెప్ప‌చ్చు. కానీ ఒక్క‌సారి వీరు తమ స‌హ‌నాన్ని కోల్పోతే వీరి పూర్తి వ్య‌క్తిత్వ‌మే మారిపోయిన‌ట్లుగా అనిపిస్తుంది. ఇక‌, త‌మ జీవితానికి సంబ‌ంధించిన స్నేహితులు, అనుబంధాల‌ను ఏర్ప‌రుచుకునే క్ర‌మంలో వీరు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. సంఖ్య కంటే నాణ్య‌త‌కే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఫ్యాష‌న్, సంగీతంపై వీరికి చ‌క్క‌ని అభిరుచి ఉంటుంది. భ‌విష్య‌త్తుని కూడా చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటారు.


 monkey


9. చ‌మ‌త్కార‌మైన కోతి


జ‌న్మించిన సంవ‌త్స‌రం:  1920, 1932, 1944, 1956, 1968, 1980, 1992, 2004, 2016, 2028...


ఎలిమెంట్ :  లోహం


మ‌న‌సులో ఉన్న ఆలోచ‌న‌ల‌కు అక్ష‌ర‌రూపం ఇవ్వ‌డంలో వీరిది అందెవేసిన చేయి. వీరికి ఉన్న అద్భుత‌మైన జ్ఞాప‌క‌శ‌క్తి కార‌ణంగా ప్ర‌తి చిన్న విష‌యాన్నీ  సుల‌భంగా గుర్తుంచుకుంటారు. అయితే ఎక్కువ కాలం ఒకే ప్ర‌దేశంలో ఉండ‌డం వీరికి న‌చ్చ‌దు. ఎదుటి వ్య‌క్తిని చూసి వారి ఆలోచ‌న‌లేంటో ఇట్టే చెప్పేయ‌గ‌ల‌రు. సాహ‌సాలు చేయ‌డ‌మ‌న్నా, కొత్త ప్ర‌దేశాల‌కు వెళ్ల‌డ‌మ‌న్నా వీరికి చాలా ఇష్టం. వీరికి ఉన్న ప్ర‌తిభ కార‌ణంగా ఎక్క‌డైనా, ఎవ‌రితోనైనా క‌లిసి సంతోషంగా ప‌ని చేయ‌గ‌ల‌రు. వారికి ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ, ఐడియాల కార‌ణంగా ప‌నిలో కూడా చ‌క్క‌గా రాణిస్తారు.


 rooster


10. ఆడంబ‌ర‌మైన కోడి


జ‌న్మించిన సంవ‌త్స‌రం: 1921, 1933, 1945, 1957, 1969, 1981, 1993, 2005, 2017, 2029...


ఎలిమెంట్ :  లోహం


వీరికి స్పాట్ లైట్‌లో ఉండ‌డం అంటే చాలా ఇష్టం. స్నేహితులు, న‌లుగురు పోగైన చోట వీరు ప్ర‌త్యేకంగా నిల‌వాల‌ని కోరుకుంటారు. కోతి చిహ్నం ఉన్న‌వారిలానే వీరు కూడా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకుంటూ ఉంటారు. ఒకేసారి ఎక్కువ స‌వాళ్ల‌ను స్వీక‌రించి వాటిని సాధించేందుకు పోరాడుతారు. ఇది కాస్త రిస్క్ అయిన‌ప్ప‌టికీ వారు ఇష్టంగా చేస్తారు. ఇక ప్రేమ విష‌యానికి వచ్చేస‌రికి వారికి న‌చ్చే వ్యక్తి తార‌స ప‌డే వర‌కు అదొక‌ ఆట‌. కానీ ఒక్క‌సారి ఎవ‌రినైనా ప్రేమిస్తే వారి కోసం ప్రాణ‌మిచ్చేందుకైనా సిద్ధ‌ప‌డిపోతారు.


 dog


11. విశ్వాస‌వంత‌మైన కుక్క‌


జ‌న్మించిన సంవ‌త్స‌రం: 1922, 1934, 1946, 1958, 1970, 1982, 1994, 2006, 2018, 2030...


ఎలిమెంట్:  భూమి


కాలం ఎంత క‌ష్ట‌మైన ప‌రీక్ష‌లు పెట్టినా వీరు న‌మ్మిన వ్యక్తుల‌కు ఎప్పుడూ స‌పోర్ట్‌గానే నిల‌బ‌డ‌తారు. వారు ప్రేమించే లేదా ఇష్టప‌డే వ్య‌క్తుల‌తో చాలా నిజాయ‌తీగా, విశ్వాసం క‌లిగి ఉంటారు. ముఖ్యంగా వారు అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధించేందుకు యాటిట్యూడ్ ప‌రంగా వారిలో ఎలాంటి మార్పులు అవ‌స‌ర‌మో వీరు తెలుసుకుంటారు.


 pig


12. ఉదార‌త క‌లిగిన వరాహం


జ‌న్మించిన సంవ‌త్స‌రం: 1923, 1935, 1947, 1959, 1971, 1983, 1995, 2007, 2019, 2031...


ఎలిమెంట్ :  నీరు


చైనీయుల జ్యోతిష క్యాలెండ‌ర్‌లో ఆఖ‌రి జంతు చిహ్నం వరాహం. ఈ చిహ్నం క‌లిగిన వ్య‌క్తులు వారి మ‌న‌సుతో ఆలోచిస్తారు. ఎవ్వ‌రి మీదా ఆధార‌ప‌డ‌రు. అంతేకాదు.. ఇత‌రుల‌ను కూడా ముందుకు న‌డిపిస్తూ ఉంటారు. ఒత్తిడితో ఆడుకోవ‌డం అంటే వీరికి స‌ర‌దా.  ప‌ని విష‌యానికి వ‌చ్చే స‌రికి చేతిలో ఉన్న‌ది పూర్తి చేసిన త‌ర్వాతే కొత్త ప‌నిని ప్రారంభిస్తారు. వీరు చాలా న‌మ్మ‌క‌స్థులైన భాగ‌స్వాములు. జీవితంలో వ‌చ్చే ప్ర‌తి క్ష‌ణాన్ని ఆస్వాదించేందుకు వీరు అమితంగా ఆసక్తి చూపిస్తారు.


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ ప్రయాణికుల‌ అంద‌మైన ప్రేమక‌థ‌లు విన్నారా?


మీ ప్రేమ బంధం .. ఎలాంటి అనుబంధమో తెలుసుకోవాలని భావిస్తున్నారా..?


పాఠ‌శాల నుంచి ప‌రిణ‌యం వ‌ర‌కు.. సాగిన ఈ ప్రేమ‌క‌థ అద్భుతం..!