ADVERTISEMENT
home / Dating
ప్రేమ జీవితాంతం ఉండాలంటే.. గొడవ పెట్టుకోవాల్సిందే..!

ప్రేమ జీవితాంతం ఉండాలంటే.. గొడవ పెట్టుకోవాల్సిందే..!

భార్యాభర్తలు (couple) లేదా ప్రేమికులు.. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ (love) ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? గొడవ (arguments) పెట్టుకోవాలట. అవును.. ఇది పరిశోధకులు చెబుతోన్న నిజం. ఈ మధ్య కాలంలో మీకూ మీ భాగస్వామికి మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయని భావిస్తున్నారా? అవసరం లేని చిన్న చిన్న విషయాలకూ గొడవవుతోందని బాధపడుతున్నారా? కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు ఇలా గొడవలు జరగడం సర్వసాధారణం. పైగా సహజం కూడా. ఇది మంచిదే అని చెబుతున్నారు పరిశోధకులు. అవును.. ఎక్కువగా గొడవ పెట్టుకునే జంటలు ఆనందంగా ఉంటారని వారు తేల్చారు.

couple4

రీసర్చ్ ప్రకారం ఏదైనా విషయం గురించి చర్చించుకోవడం లేదా గొడవపెట్టుకోవడం వంటివి చేసే జంటలు మిగిలిన జంటలకంటే పది రెట్లు ఎక్కువ ఆనందంగా ఉంటారట. భాగస్వామి చేసిన పనులు నచ్చకపోయినా వాటిని చూస్తూ వూరుకునే వ్యక్తులు ఆనందంగా ఉండలేరట.

ఆ అసహనం వారిలో పెరిగిపోతూ ఎప్పుడో ఒకసారి పెద్ద గొడవకు దారి తీసే ప్రమాదం ఉంటుందని వారు చెబుతున్నారు. వెయ్యిమంది పై నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలిందట. ప్రముఖ రచయిత జోసఫ్ జెన్నీ గొడవలను వాయిదా వేయడం జంటలు చేసే అతి పెద్ద తప్పు అని తెలిపారు.

ADVERTISEMENT

మనం ఎంతో అనుకుంటాం. బాధపడతాం, కోపం తెచ్చుకుంటాం. కానీ ఎదుటివారికి మాత్రం ఏమీ చెప్పం. కనీసం మన కోపం పట్టలేనంతగా మారేవరకూ అయితే ఏమీ మాట్లాడం. ఆ తర్వాత ఒకేసారి అన్నీ కలిపి గొడవ పెట్టుకోవడం వల్ల ఇన్నాళ్లూ ఆపిన కోపం మొత్తం కలిసి పట్టరానంతగా మారిపోతుంది.. అంటారు జోసఫ్. మనం ఎదుటివారితో కోపంగా మాట్లాడడాన్ని ఆపుతూ ఉంటాం. కోపం వచ్చినా దాన్ని మనలోనే అణచుకోవాలని భావిస్తుంటాం. కానీ ఇలా మాట్లాడకుండా ఉండడంలో ఉన్న నష్టాలను మనం అంచనా వేయలేం.. అంటారాయన. దీనికి ఉదాహరణగా ఒకటీ రెండు సార్లు మీరు వదిలేద్దాం అనుకున్న అంశాలు అతి పెద్ద గొడవగా మారిన సందర్బాలను గుర్తుచేసుకోమంటారాయన.

మనం అలా అనుకోవడానికి కూడా కారణాన్ని చెబుతారాయన.. మనం గొడవ పెట్టుకుంటే వెంటనే వచ్చే ఫలితాలపైనే మనం మనసు లగ్నం చేస్తాం. కానీ దీర్ఘకాలం గురించి మనం ఆలోచించం. ఇలా గొడవ పెట్టుకోకుండా ఎదుటివారిపై కోపాన్ని పెంచుకుంటే వారిపై నమ్మకం, మీ ఇద్దరి మధ్య ఫీలింగ్స్, దగ్గరితనం అన్నింటిపై అది ప్రభావం చూపించే అవకాశం ఉంటుందట.

ఇలా జరగడం వల్ల ప్రస్తుతం చిన్నవే అనుకున్న విషయాలు కూడా పెద్దవిగా మారిపోయి భవిష్యత్తులో మన బంధాన్ని బీటలు వారేలా చేస్తాయట. అందుకే చిన్న చిన్న కారణాలకు కూడా అప్పటికప్పుడు గొడవ పెట్టుకొని.. దాన్ని అక్కడికి వదిలేసే జంటలు.. ఎక్కువగా గొడవలు పడని వారికంటే చాలా క్లోజ్‌గా ఎక్కువ కాలం ఆనందంగా ఉంటారట.

couple2

ADVERTISEMENT

అందుకే ప్రతి బంధంలోనూ ఇద్దరూ ఆనందంగా ఉండేందుకు ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటే ఆనందంగా ఉండగలుగుతారని ఈ పరిశోధన చెబుతుంది. కమ్యూనికేషన్ అంటే కేవలం మంచి విషయాలు మాత్రమే కాదు.. చెడు విషయాల గురించి కూడా చర్చించుకోవాలట. ప్రతి రోజూ మాట్లాడాలని.. ప్రతి రోజూ గొడవ పడాలని రూలేం లేదు.

కానీ ఎప్పుడూ మంచి విషయాల గురించే కాకుండా చెడు విషయాల గురించి కూడా మాట్లాడాలని చెబుతున్నారు. ఇద్దరి మధ్యా గొడవను తీసుకొస్తాయి అనుకున్న విషయాలను కూడా ఎప్పటికప్పుడూ చర్చించుకోవడం వల్ల.. చిన్న గొడవతోనే సమస్యను పరిష్కరించవచ్చు. ఈ పరిశోధన ప్రకారం రెండో పెళ్లి చేసుకున్నవారిలో చాలామంది తాము సరిగ్గా అన్ని విషయాల గురించి చర్చించుకోకపోవడం వల్లే.. మొదటిసారి విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కూడా వెల్లడించడం విశేషం.

మొత్తంగా చెప్పాలంటే ఓ బంధం బలంగా ఉండడం అనేది.. ఆ బంధంలోని ఇద్దరు సెన్సిటివ్ ఇష్యూస్ అంటే గొడవలను కలిగించే విషయాల గురించి చర్చించే విధానంపై ఆధారపడి ఉంటుందట. ప్రేమ అనేది కేవలం ఒకసారి ప్రేమించి తర్వాత వదిలేసేది కాదు.. ఆనందకరమైన బంధం కోసం ప్రతి రోజూ ఇద్దరూ ప్రయత్నిస్తూ ఉండాల్సిందే. బంధంలో కేవలం నిజం చెప్పడం, అవసరమైన విషయాల గురించి గొడవలు లేకుండా చర్చించుకోవడం, ఒకరిపై మరొకరికి నమ్మకం, ఇద్దరి మధ్యా దగ్గరితనం.. ఇవన్నీ వారు ఎన్ని రోజులు కలిసి ఉంటారు అన్న అంశాన్ని నిర్ణయిస్తాయట.

couple3

ADVERTISEMENT

అయితే గొడవలు కలిగించే విషయాల గురించి ఎప్పటికప్పుడూ మాట్లాడుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ విషయం గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారన్న విషయం కూడా ముఖ్యమేనట. మాటలతో ప్రారంభించి చర్చ లేదా చిన్న వాగ్వాదం వరకూ ఫర్వాలేదు కానీ అది మరీ పెద్ద గొడవగా కాకుండా భార్యాభర్తలిద్దరూ ప్రయత్నించాల్సి ఉంటుంది. కేవలం ఎదుటివారిపైనే నెపం మొత్తం నెట్టేయడం కూడా సరికాదట. మీరు మాట్లాడే స్వరం కూడా ఇందులో కీలకమేనట.

భాగస్వామికి గౌరవం ఇస్తూనే వారు చేసిన పొరపాటు గురించి వారిని అడగాలి.. కానీ వారి తప్పులన్నీ ఎత్తి చూపుతూ గొడవ పడుతూ వారిని ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసేయడం కూడా సరికాదని వీరు చెబుతున్నారు. ఇలా మీ గొడవ ఒక వాగ్వాదంలా సాగితే మీరు ఇతరుల కంటే పది రెట్లు ఆనందంగా ఉంటారట. మీ ఇద్దరూ ఒక అభిప్రాయానికి వస్తే ఇద్దరూ విజేతలే.. బేధాభిప్రాయాలుంటే ఇద్దరూ ఓడిపోయినట్లే.. బంధంలో ఒకరు గెలవడం మరొకరు ఓడిపోవడం అంటూ ఉండదు. అందుకే డిబేట్‌లా కాకుండా ఆఖరికి ఇద్దరూ ఒకే అభిప్రాయానికి వచ్చే ప్రయత్నం చేయండి.

ఇవి కూడా చదవండి.

ఈ లక్షణాలుంటే మీ బాయ్ ఫ్రెండ్.. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లే..!

ADVERTISEMENT

పెళ్లి తర్వాత.. మీరు బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా?

ఉత్తమ భర్తలు అంటే వీరేనేమో.. ఎందుకో తెలుసా?

15 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT