'ఢీ' ఫేమ్ యశ్వంత్ మాస్టర్ ప్రేమ కథ.. సినిమా స్టోరీ లానే ఉంది కదూ!

'ఢీ' ఫేమ్ యశ్వంత్ మాస్టర్ ప్రేమ కథ.. సినిమా స్టోరీ లానే ఉంది కదూ!

'ఢీ' (Dhee) డ్యాన్స్ షో ద్వారా బుల్లితెరపై తమ సత్తా చాటిన కొరియోగ్రాఫర్స్ ఎంతోమంది ఉన్నారు. అయితే ఢీ - 10 షో ద్వారా యశ్ మాస్టర్‌గా ప్రేక్షకులకు సుపరిచితుడైన.. యశ్వంత్  (Yashwanth Master) గురించి ప్రస్తుతం ఎవరికీ ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు.


కానీ యశ్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడని మీకు తెలుసా?? అవునండీ.. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో అతను ఎంతగానో ప్రేమించిన ప్రియురాలితోనే ఏడడుగులు వేసి.. తన జీవితంలో కొత్త అంకానికి తెర తీశాడు. ఇక ఢీ షో ద్వారా అతనికి వచ్చిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందుకే ప్రస్తుతం యశ్ మాస్టర్ పెళ్లి వార్త కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది.


ఇంతకీ మన యశ్ పెళ్లాడిన అమ్మాయి గురించి, వారి ప్రేమ కథ గురించి మీరు విన్నారా?? నిజానికి వీరి కథ వింటే ఏదో సినిమా స్టోరీలా అనిపించడం ఖాయం. మరి, ఆ కథేంటో మనం ఒక సారి తెలుసుకుందామా..?


 
 

 

 


View this post on Instagram


Bhaag BHAAAAAAG .... @varshabhavanimath


A post shared by Yashwanth Master (@yashwanthmaster) on


 

 

 


View this post on Instagram


Happiness 😍@varshabhavanimath


A post shared by Yashwanth Master (@yashwanthmaster) on
యశ్, వర్షలు (Varsha) చిన్నప్పట్నుంచీ మంచి స్నేహితులు. అయితే వీరిద్దరూ పరస్పరం ఒకరినొకరు ఇష్టపడడం మొదలుపెట్టి నాలుగేళ్లవుతోంది. వాస్తవానికి వీరి ప్రేమాయణం మొదలైంది స్కూల్లో చదివే రోజుల్లోనే. ఇటీవలే వీరు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ముందు జీవితంలో స్థిరపడిన తర్వాత ఇరు కుటుంబ సభ్యులకు తమ ప్రేమ విషయం చెప్పి, వారి అంగీకారంతోనే వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకుందీ జంట.


 


అనుకున్న విధంగా యశ్ మాస్టర్ తనకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్‌లో శిక్షణ పొందుతూ.. ఢీ 10 ద్వారా తన టాలెంట్‌‌తో అందరినీ ఆకట్టుకొని.. తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోనే క్రేజ్ ఉన్న కొరియోగ్రాఫర్స్‌లో యశ్వంత్ కూడా ఒకరు అన్న స్థాయికి చేరుకున్నాడు. ఇక అతని భార్య వర్ష విషయానికి వస్తే చిన్నప్పట్నుంచీ ఎయిర్ హోస్టస్ కావాలని కలలు కనేదట.. ఆ కలను నిజం చేసుకుంటూ.. ఈ మధ్యే ఎయిర్ హోస్టస్‌గా జాబ్ సంపాదించుకొని తనని తాను నిరూపించుకుంది.


 
 

 

 


View this post on Instagram


😊🙏


A post shared by Yashwanth Master (@yashwanthmaster) on
ఇలా ఇద్దరూ ఎవరి కాళ్లపై వారు నిలబడిన తర్వాత .. వారు మొదట తీసుకున్న నిర్ణయం మేరకు ఇరువురి ఇళ్లలోనూ తమ ప్రేమ గురించి చెప్పారట. ఇద్దరూ జీవితంలో స్థిరపడి ఉండడం, వర్ష వాళ్ల తల్లిదండ్రులకు యష్ బాగా నచ్చడంతో వీరి పెళ్లికి ఎలాంటి అభ్యంతరాలు కూడా ఎదురుకాలేదు. అలా వీరి ఎనిమిదేళ్ల ప్రేమ.. మొత్తానికి ఏడడుగులతో పెళ్లిగా మారింది.


 
 

 

 


View this post on Instagram


You saying something???? @rio.events


A post shared by Yashwanth Master (@yashwanthmaster) on
శనివారం (ఏప్రిల్ 27) పెద్దల సమక్షంలో స్నేహితులు, బంధువుల మధ్య ఎంతో కోలాహలంగా వీరి పెళ్లి జరిగింది. వివాహ వేడుక అనంతరం తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు యశ్. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో యశ్ - వర్షలకు సెలబ్రిటీలు మొదలుకొని సాధారణ అభిమానుల వరకు ఎంతోమంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


ప్రేమించడం ఎంత ముఖ్యమో.. పెద్దల ఆమోదంతో దానిని వైవాహిక బంధంగా మార్చుకొని తమ ప్రేమను నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని.. జీవితంలో స్థిరపడిన తర్వాతే ప్రేమ విషయంలో ముందడుగు వేయాలని ప్రస్తుత యువతకు చాటి చెబుతోందీ జంట.                                                                   


మరి, ఈ యువజంటకు మన POPxo తెలుగు తరపున కూడా వివాహ శుభాకాంక్షలు తెలియజేసేద్దామా..


హ్యాపీ మ్యారీడ్ లైఫ్ యష్ & వర్ష


ఇవి కూడా చదవండి


శృతి హాసన్ "లవ్ లైఫ్"కి బ్రేక్ పడిందా..?


మహేష్ బాబు vs అక్కినేని అఖిల్.. ఈ ఇద్దరిలో రష్మిక ఓటు ఎవరికి?


'జెర్సీ' ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ ఎదుర్కొన్న.. #MeToo అనుభవం గురించి మీరు విన్నారా??