రణ్ వీర్‌తో ఉంటే.. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు : దీపిక

రణ్ వీర్‌తో ఉంటే.. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు : దీపిక

దీపికా పదుకొణె (Deepika Padukone).. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. గతేడాది నవంబర్‌‌లో ఇటలీలోని లేక్ కొమొలో తన చిరకాల మిత్రుడు, ప్రేమికుడు రణ్ వీర్ సింగ్‌ని (Ranveer Singh) పెళ్లాడిందీ బ్యూటీ. దీపిక పై రణ్ వీర్ చూపించే ప్రేమను చూస్తే.. తనకూ ఇలాంటి భర్తే రావాలని కోరుకోని అమ్మాయి ఉండదంటే అతిశయోక్తి కాదు.

పెళ్లి తర్వాత చాలా సార్లు దీపిక ప్రెగ్నెన్సీ గురించి వార్తలొచ్చాయి. అయితే.. అన్ని సార్లూ ఈ విషయాన్ని తోసిపుచ్చింది దీపిక. ఆ మధ్య ఓసారి రణ్ వీర్ పోస్ట్‌కి దీపిక 'డాడి' అని కామెంట్ పెట్టినప్పుడు.. వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారనే అందరూ అనుకున్నారు. కానీ అది కూడా కేవలం రణ్ వీర్‌ను ఆటపట్టించేందుకు చేసిన పోస్ట్ మాత్రమే అని తర్వాత తెలిసింది. తాజాగా తన సినిమా 'ఛపాక్' ప్రమోషన్లలో భాగంగా రణ్ వీర్ గురించి.. తన ప్రెగ్నెన్సీ పై వచ్చే పుకార్ల గురించి స్పందించింది దీపిక.

"రణ్ వీర్ చాలా అద్భుతమైన వ్యక్తి. నా కష్టసుఖాలు అన్నింటిలో తను నాకు తోడు నిలిచాడు. తనని, మేఘన గుల్జార్ భర్త గోవింద్‌ని చూసిన తర్వాతే..  ఈ లోకంలో అద్బుతమైన మగవాళ్లు కూడా ఉన్నారని నాకు అర్థమైంది. రణ్ వీర్‌కి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అందుకే నేను తన కంటే మంచి పాత్రలో నటించినా.. లేదా నాకు మంచి పేరు వచ్చినా.. తను సంతోషంగా ఫీలవుతాడే కానీ అసూయపడడు. ఇలాంటి వ్యక్తులు ఉండడం ఎంతో అవసరం.

'ఛపాక్' సినిమా షూటింగ్‌లో.. నా ముఖానికి మేకప్ వేయడానికి కొన్ని గంటలు పట్టేది. అందుకే సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యేది. ఈ క్రమంలో షూటింగ్ తర్వాత ఇంటికి ఆలస్యంగా వెళ్తే తను ఏమంటాడో అని కానీ.. లేదా ఉదయం నుంచి బిజీగా ఉండి తనకు ఫోన్ చేయలేదని గొడవ పడతాడని కానీ నేనెప్పుడూ భయపడలేదు. నేను గతంలో ఉన్న రిలేషన్ షిప్స్‌లో ఇలాంటి ఫీలింగ్ లేదు. ఇలాంటి అంశాల గురించి భయపడాల్సిన అవసరం కానీ.. ఆలోచించాల్సిన పరిస్థితి కానీ లేనప్పుడు.. మనసు నిజంగానే ప్రశాంతంగా ఉంటుంది. పనిపై మంచి శ్రద్ధ పెట్టే వీలుంటుంది కూడా" అని చెప్పుకొచ్చింది దీపిక.

దీపిక కోసం ఆ సినిమాలో.. నటించకూడదని అనుకున్నా: రణ్ వీర్ సింగ్

గతంలో ఓ ఇంటర్వ్యూలోనూ రణ్‌వీర్ తనని ఎంత చక్కగా చూసుకుంటాడో చాలాసార్లు వివరించింది దీపిక. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "తను బయట ఎలా ఉంటాడో మీ అందరికీ తెలుసు. కానీ తను ఇంట్లో మాత్రం చాలా విభిన్నమైన వ్యక్తిగా వ్యవహరిస్తాడు. అదే మా ఇద్దరినీ దగ్గర చేసింది. దాని గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రణ్ వీర్‌ని పనిలో ఉన్నప్పుడు చూస్తే.. మీరు ఇతను ఇంత సైలెంట్‌‌గా ఉంటాడా?" అని ఆశ్చర్యపోతారు.

తనలో ఇంకా చాలా కోణాలున్నాయి. తను చాలా ఇంటలిజెంట్, సెన్సిటివ్, ఎమోషనల్ కూడా. కొన్ని సార్లు తనలో చిన్న పిల్లల మనస్తత్వం కనిపిస్తుంది. తనలో చాలా కోణాలున్నాయి. అవన్నీ తనకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలుస్తాయి" అని తన భర్త గురించి చెప్పుకొచ్చింది దీపిక.

"ఇక తన ప్రెగ్నెన్సీ గురించి వచ్చే వార్తలు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయా?" అని అడిగిన ప్రశ్నకి కూడా బదులిచ్చింది దీపిక. "ఇలాంటి వార్తల ప్రభావం నాపై అస్సలు పడదు. నేను అస్సలు కామెంట్స్ చదవను. నా గురించి నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలీదు. నాకు ఏదైనా ఒకరోజు బాధగా అనిపిస్తే దాని గురించి ముందు తెలిసేది నాకే. ఒక రోజు సంతోషంగా ఉన్నా.. ఫిట్‌గా ఉన్నా కూడా అందరి కంటే ముందు తెలిసేది నాకే. నా గురించి నాకంటే బాగా ఇంకెవరికీ తెలీదు. ఒక నటిగా ఇలాంటి పుకార్లు నాపై ముందు నుంచి వస్తూనే ఉన్నాయి. ఒకటీ, రెండని కాదు.. రకరకాల పుకార్లు వస్తుంటాయి. కానీ నేను వాటి పై శ్రద్ధ పెట్టను" అని చెప్పుకొచ్చింది దీపిక.

దీపిక ప‌దుకొణే 'ఛపాక్' చిత్రం ఎందుకు చూడాలంటే ..?

దీపిక యాసిడ్ దాడి బాధితురాలిగా నటించి మెప్పించిన 'ఛపాక్' చిత్రం.. జనవరి 10 న విడుదల కానుంది. ఈ సినిమాలో యాసిడ్ దాడికి గురై.. ఆ తర్వాత యాసిడ్ అమ్మకాలను నిషేధించాలని పోరాడిన లక్ష్మి పాత్రలో దీపిక కనిపించనుంది.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్ ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.