మీ అందరి ఆదరాభిమానాలతో ఐదేళ్లు పూర్తిచేసుకుంది POPxo. ఈ అద్భుతమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దిల్లీలో ఓ సక్సెస్ పార్టీ ఏర్పాటైంది. చక్కటి చూడముచ్చటైన రంగుల బ్యాక్‌డ్రాప్స్, ఫొటోబూత్‌తో పాటు ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడానికి తగినట్లుగా ఉన్న డిజైన్లు, చక్కటి వాతావరణం, అందమైన పూలతో పాటు బెలూన్లతో చేసిన డెకరేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పార్టీలో ప్రతి ఒక్కటీ ఆకర్షించేదే.. న్యూ దిల్లీలోని Qla హోటల్లో జరిగిన ఈ వేడుకలకు దిల్లీకి చెందిన అన్ని రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
చక్కటి జాజ్ సంగీతం, పార్వతీ మోహనకృష్ణన్ పాటలతో కొనసాగిన ఈ పార్టీలో మంచి రుచికరమైన బ్రంచ్‌తో పాటు.. జాకబ్ క్రీక్స్ వారి బార్ సెటప్‌ని కూడా ఏర్పాటు చేశారు. Qla హోటల్ రూఫ్‌టాప్‌పై జరిగిన ఈ వేడుకలో అన్నీ రంగురంగులుగా POPxo థీమ్‌ని చూపుతూ ఆకట్టుకున్నాయి. చలికాలం మధ్యాహ్నం వేళ నులివెచ్చని ఎండ హాయిగొలుపుతుంటే పార్టీకి వచ్చిన అతిథులంతా వేడుకల్లో హుషారుగా పాల్గొన్నారు.
గులాబీ, తెలుపు రంగు ఫక్సియా పూలతో కూడిన బంగారు రంగు బాటిళ్లు ఇటు టేబుళ్లపై నిలిచి.. సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారడంతో పాటు చుట్టూ బోర్డర్‌గా కూడా నిలిచాయి. జాకబ్ క్రీక్స్ వారి బార్ సెటప్‌లో చల్లని వైన్‌ని బార్‌టెండర్స్ అందిస్తుంటే.. చక్కటి వాతావరణంతో పాటు భోజనం, వైన్ అన్నీ ఆకర్షించేలా సిద్ధమై పార్టీకి మరింత జోష్‌ని తీసుకొచ్చాయి.
POPxo కి తమ సహకారాన్ని అందిస్తూ నిలిచిన ఫ్యాషన్ డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, మాలినీ రమణి, గౌరీ కరణ్, సిద్ధార్థ టైట్లర్, మయూర్ గిరోత్రా, ఈషా రాజ్‌పాల్, నిత్యా బజాజ్, షైమా శెట్టిలు ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు.
బిజినెస్, స్టార్టప్ వర్గాల నుంచి ఐడీజీ సంస్థ ఎండీ కరణ్ మోహ్లా, గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్‌లు ఈ పార్టీకి విచ్చేశారు.
వీరితో పాటు పార్క్ హోటల్ కమ్యునికేషన్స్, పీఆర్ కార్పొరేట్ డైరెక్టర్ రుచికా మెహతా.. ఒబెరాయ్ గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సిల్కీ సెహెగల్, ప్రముఖ వ్యాపారవేత్త ఆశిశ్ దేవ్ కపూర్‌లు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇక బ్యూటీ ఇండస్ట్రీ నుంచి బ్యూటీ ఎక్స్‌పర్ట్, రచయిత వసుధా రాయ్.. Plixxo ఇన్‌ఫ్లూయెన్సర్ శ్రేయా జైన్లతో పాటు దేశంలోనే ప్రముఖ టెక్నాలజీ జర్నలిస్ట్ రాజీవ్ మఖనీ, ప్రముఖ మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్‌లు ఈ పార్టీలో పాల్గొన్నారు.
లూయీ విటాన్ సంస్థ కంట్రీ మేనేజర్ సునైనా క్వాత్రా.. మా కో హోస్ట్‌లు అర్చనా విజయ, చాందినీ కుమారిలతో కలిసి షాంపేన్ తాగుతూ ఆనందంగా గడిపారు.
ఇక్కడితో POPxo ఈవెంట్ పూర్తయిందనుకుంటే పొరపాటే. మా సీఈవో ప్రియాంకా గిల్ అభినందనలు, తన సందేశం లేకుండా ఇవన్నీ పూర్తవ్వలేదు. కేవలం ఒక ఫేస్‌బుక్ పేజీగా ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం దేశంలోనే మహిళల అతిపెద్ద కమ్యూనిటీగా.. 39 మిలియన్ల యూజర్లతో ఎలా ప్రస్థానాన్ని కొనసాగిస్తోందో వివరించారామె.
ఇన్‌ప్లూయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫాం Plixxo నుంచి POPxo ప్రైవేట్ లేబుల్ అయిన POPxo Shop వరకూ సంస్థ సాధించిన విజయాలన్నింటి గురించి పంచుకున్నారు ప్రియాంక. POPxo ఇక్కడి వరకూ వచ్చిన విధానాన్ని వివరిస్తూ సంస్థ సాధించిన కొన్ని ముఖ్యమైన మైలురాళ్ల గురించి ఇందులో చెప్పుకొచ్చారు. దేశంలోని ప్రతి మహిళకు దగ్గరై.. వారు ఉపయోగించే డిజిటల్ ప్లాట్‌ఫాంగా నిలవాలన్నది తమ కోరిక అని చెప్పిన ప్రియాంక.. కేవలం ఇంగ్లిష్‌లోనే కాదు.. POPxoని మరో ఐదు భాషల్లో ( హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ) చదవడం, చూడడం, షాపింగ్ వంటివి చేయవచ్చని తెలుసుకున్న అతిథులంతా ఆశ్చర్యపోయారు.
దీంతో పాటు భవిష్యత్ ప్రణాళిక గురించి కూడా వెల్లడించారు ప్రియాంక. కంపెనీ ట్యాగ్‌లైన్‌తో పాటు బ్రాండ్ క్యాంపెయిన్‌ని కూడా ప్రారంభించారు. ‘Take It Up A POP’ అనే క్యాప్షన్ ద్వారా బ్రాండ్ ప్రమోషన్ కొనసాగిస్తూ మహిళలు జీవితంలో తాము అనుకున్నది సాధించేందుకు తోడ్పడే సాధనంగా మారాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు ప్రియాంక. ఫ్యాషన్, బ్యూటీ, అనుబంధాలు, లేదా పని జీవితం.. ఇలా రంగమేదైనా అన్నింట్లోనూ మహిళలు అత్యుత్తమంగా నిలిచేలా చేయడమే POPxo లక్ష్యం అని చెప్పారామె.
ఇవన్నీ ఒకెత్తైతే మరింత గ్రాండ్‌గా పార్టీ మొత్తాన్ని ఆకర్షించిన విషయం మరొకటుంది. అర్చనా జైన్((PR Pundit), నేహా లిడ్డర్ (Platoon Advisory)లు అందించిన సహకారానికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ లగ్జేవా (luxeva.com) వెబ్‌సైట్‌ని ప్రారంభించారు ప్రియాంక. ఇది ఖరీదైన జీవనానికి డిజిటల్ గైడ్ అని చెప్పవచ్చు.
Luxeva.com వెబ్‌సైట్ Luxeva Limited వారి నుంచి వస్తున్న మూడో సంస్థ. ఇప్పటికే రెండు అతిపెద్ద డిజిటల్ బ్రాండ్స్ (POPxo, Plixxo) ని కొనసాగిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు ఈ వెబ్‌సైట్ ద్వారా స్టైల్, ఆరోగ్యం, అందం, ట్రావెల్, ఆహారం, సంస్కృతి, ఇంటికి సంబంధించిన విషయాలలో లగ్జరీని పరిచయం చేస్తూ అందులోని నిపుణుల సలహాలు కూడా అందుకునేలా చేస్తుంది.
ఈ వెబ్‌సైట్‌ని ప్రారంభించిన తర్వాత అక్కడున్నవారిలో ఉన్న ఎగ్జైట్‌మెంట్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఇలా పార్టీ మొదలవడం మాత్రమే కాదు.. ముగింపు కూడా ఎంతో అందంగా, సంతోషంగా సాగింది. ఈ పార్టీ ముగిశాక ఆనందంతో పాటు అతిథులు ద బాడీషాప్ వారి బహుమతులు, చెజ్ పాపిల్లాన్ వారి చాక్లెట్లతో ఇంటికి తీసుకెళ్లారు.