మేమిద్దరం విడిపోతున్నాం: సంచలన వార్తను ప్రకటించిన దియా మీర్జా

మేమిద్దరం విడిపోతున్నాం: సంచలన వార్తను ప్రకటించిన దియా మీర్జా

దియా మీర్జా (dia mirza).. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2000 సంవత్సరంలో మిస్ ఏషియా పసిఫిక్ పోటీల్లోనూ గెలుపొందిన సంగతి తెలిసిందే. మాధవన్ సరసన 'రెహనా హే తేరే దిల్ మే' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దియా.. ఆ తర్వాత దమ్, లగే రహో మున్నాభాయ్, సంజు వంటి చాలా సినిమాల్లో కనిపించింది. అంతేకాదు.. 'బాబీ జాసూస్' సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం 'జీ5 యాప్'లో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ 'కాఫిర్'లో నటిస్తూ బిజీగా ఉందీ అమ్మడు. అంతేకాదు.. పెటాతో పాటు మరెన్నో స్వచ్ఛంద సంస్థలకు కూడా తన వంతు సాయం చేస్తూ.. తన మంచి మనసును చాటుకుంటోంది.

అంతా వేలెత్తి చూపారు.. అయినా కష్టపడి అనుకున్నది సాధించా : స్వప్న
Instagram

తన బిజినెస్ పార్ట్ నర్ అయిన సాహిల్ సాంగాని (Sahil sangha) ప్రేమించి పెళ్లాడిన దియా మీర్జా.. పదకొండేళ్ల తమ ప్రేమకు, ఐదేళ్ల పెళ్లికి ఫుల్ స్టాప్ పెడుతూ తాము విడిపోతున్నామని ప్రకటించింది. ఈ మేరకు దియా మీర్జా, సాహిల్ సాంగా ఇద్దరూ ఓ జాయింట్  ప్రకటన విడుదల చేశారు. తామిద్దరం పరస్పరం ఒక ఒప్పందానికి వచ్చి విడిపోతున్నామని.. దీని గురించి ఇతర వివరాలేవీ మాట్లాడేందుకు తాము ఇష్టపడట్లేదని ఆ ప్రకటనలో వెల్లడించడం విశేషం.

Instagram
నాకు మీరాకి మధ్య గొడవ.. దాదాపు పదిహేను రోజులుంటుంది: షాహిద్ కపూర్

దియా, సాహిల్ ఇద్దరూ 2009 నుంచి ప్రేమించుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 2011లో 'బర్న్ ఫ్రీ ఎంటర్ టైన్‌మెంట్' అనే సంస్థను ప్రారంభించి ఆ బ్యానర్ పై సినిమాలు నిర్మించడం ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి 'లవ్ బ్రేకప్స్ జిందగీ' సినిమాను నిర్మించడం విశేషం. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2014లో వివాహం చేసుకున్నారు. బాలీవుడ్‌లోని అత్యంత పాపులర్ ప్రేమ జంటల్లో ఒకరైన వీరు బెస్ట్ కపుల్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. అందుకే ప్రస్తుతం దియా, సాహిల్ విడాకులు తీసుకుంటున్నారన్న వార్త అందరికీ షాకింగ్‌గా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు.

వీరిద్దరూ జంటగా విడుదల చేసిన ప్రకటనలో.. "మేము పదకొండేళ్లు కలిసి జీవించి, జీవితాన్ని పంచుకున్న తర్వాత.. ఇప్పుడు  విడిపోవాలని నిర్ణయించుకున్నాం. విడాకులు తీసుకున్నా మేం ఒకరికొకరం స్నేహితుల్లాగే ఉంటాం. ఒకరికొకరం అన్ని సమస్యల్లోనూ తోడు నిలుస్తాం. మా ప్రయాణం మమ్మల్ని వేర్వేరు మార్గాల్లో తీసుకెళ్తుంటే.. మమ్మల్ని ఇద్దరినీ కలిపిన మా బంధానికి మేమెప్పుడూ రుణపడి ఉంటాం.

మాపై ప్రేమాభిమానాలు చూపి మమ్మల్ని అర్థం చేసుకున్న మా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ధన్యవాదాలు. మాకు వారి సపోర్ట్‌ని అందించిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. అయితే ఈ సమయంలో మేం కోరుకుంటున్న ప్రైవసీని మాకు అందించి.. మా వ్యక్తిగత విషయాలను పంచుకొనే విషయంలో బలవంతం చేయొద్దని కోరుకుంటున్నా.

ఈ విషయంలో దీనికంటే ఎక్కువగా మేమేం మాట్లాడదల్చుకోవట్లేదు. దాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలతో మీ దియా మీర్జా, సాహిల్ సాంగా.." అంటూ ప్రకటన చేశారీ మాజీ దంపతులు.

అవును.. ప్రేమలో ఉన్నా.. అతడు నా బాధను మర్చిపోయేలా చేశాడు : అమలాపాల్
Instagram

విడిపోవాలన్న వీరి నిర్ణయాన్ని గౌరవిస్తూ.. వారి జీవితం ఆనందంగా కొనసాగాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు చాలామంది సెలబ్రిటీలు. రిచా చద్దా చాలా హుందాగా ఈ విడాకుల గురించి ప్రకటించారు. 'మీ ఇద్దరి జీవితాలు ఆనందంగా సాగాలని కోరుకుంటున్నా' అంటూ ఆమె కామెంట్ చేసింది. 

సోఫీ చౌదరి స్పందిస్తూ .. 'మీ ఇద్దరినీ నేనెంతగా ప్రేమిస్తానో మీకు తెలుసు. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. కానీ మీ ఇద్దరు చేసిన ప్రతి పనిలోనూ చాలా హుందాగా వ్యవహరించారు. ఇలాంటి సమయంలోనూ దాన్ని వదల్లేదు. అందుకే మీరు నా స్నేహితులను చెప్పేందుకు నేను గర్వపడుతున్నా' అని కామెంట్ చేసింది.

సిద్ధార్థ జోషీ స్పందిస్తూ.. 'మీ భావి జీవితం కోసం మీకు బెస్ట్ విషెస్' అని తెలిపారు. సంజయ్ సూరి, రాహుల్ దేవ్‌లు - "మీ ఇద్దరినీ దేవుడు దీవించాలి" అని కోరుకుంటూ కామెంట్లు చేశారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.