స్టార్ హీరోయిన్స్ కాకముందే.. ఈ ఇద్దరి మధ్య పోటీ మొదలైందా ?

స్టార్ హీరోయిన్స్ కాకముందే.. ఈ ఇద్దరి  మధ్య పోటీ  మొదలైందా ?

స్టార్ హీరోయిన్స్ కాకముందే.. ఈ ఇద్దరి మధ్య పోటీ మొదలైందా ?


సినీ రంగంలో ఎప్పటికప్పుడు తమ లక్‌ను పరీక్షించుకోవడానికి కొత్త హీరోయిన్లు రావడం పరిపాటి! అలా వచ్చే కొత్త హీరోయిన్లలో.. ప్రముఖుల కుమార్తెలు కూడా ఉండడం నేడు సాధారణమైన అంశమైపోయింది. ప్రముఖ సినీ ప్రముఖుల కుమార్తెలు అనేకమంది ఇప్పటికే తమ లక్ పరీక్షించుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చేశారు.స్టార్ హీరోయిన్లగానూ తమ సత్తాను చాటేశారు.


రణధీర్ కపూర్ కుమార్తెలైన కరీనా కపూర్, కరిష్మా కపూర్, మహేష్ భట్ కుమార్తె అలియా భట్, శత్రుఘ్న సిన్హా కుమార్తె సొనాక్షి సిన్హా, అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, ధర్మేంద్ర కుమార్తె ఇషా డియోల్ మొదలైనవారు ఇప్పటికే కథానాయికలుగా తమను తాము నిరూపించేసుకున్నారు.


ఈ క్రమంలో మరో ఇద్దరు సినీ ప్రముఖుల కుమార్తెలు కూడా ఇటీవలే సినీ రంగంలోకి రంగ ప్రవేశం చేశారు. వారే అందాలతార శ్రీదేవి, బోనీకపూర్‌ల గారాలపట్టి జాన్వి కపూర్ (Janhvi Kapoor) మరియు సైఫ్ అలీ ఖాన్, అమ్రితా సింగ్‌ల కుమార్తె సారా అలీ ఖాన్ (Sara Ali Khan). ఇప్పుడు బాలీవుడ్ మొత్తం వీరిలో ఎవరు సక్సెస్ అవుతారు ? ఎవరు తమ తల్లిదండ్రుల పేర్లు నిలబెడతారు ? వీరి తదుపరి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టిస్తాయి ? వీరిద్దరిలో ఎవరు ఈ సంవత్సరం బెస్ట్ డెబ్యూ అవార్డు గెలుచుకుంటారు ? అనే ఆలోచనలో పడింది.

 


ప్రస్తుతం ఇవే ప్రశ్నలని మరికొందరు సోషల్ మీడియా వేదికగా పోల్స్ నిర్వహిస్తూ ... వేరే సెలబ్రిటీలని అడుగుతూ ... లేనిపోని ఒక 'క్యాట్ ఫైట్ 'ని ఈ ఇరు కథానాయికల మధ్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవ్వన్నీ పక్కనపెడితే , ఈ పోటీ గురించి ఇటీవలే సారా అలీ ఖాన్‌ని అడగగా ఆమె ఇలా బదులిచ్చింది - "అసలు మా మధ్య పోటీ అంటూ ఏమి లేదు. మేమిద్దరం సినిమాల్లోకి రాకముందు నుండి కూడా స్నేహితులం ... పైగా జాహ్నవి తల్లి శ్రీదేవి అంటే నాకు చాలా ఇష్టం .. సినిమాల పరంగా ఆమె నా ప్రేరణ" అని తెలిపింది. ప్రస్తుతం జాన్వి "తక్త్" అనే చిత్రంలో నటిస్తుండగా.. సారా "సింబా" చిత్రంలో నటిస్తోంది. 
 

 

 


View this post on Instagram


5 days to go!!!! 👀👀🙏🙏🤞🏻🤞🏻


A post shared by Sara Ali Khan (@saraalikhan95) on
 


దీనితో ఈ ఇద్దరు కథానాయికల మధ్య ఏదో జరగబోతుందన్న వివాదం సృష్టించాలి అనుకున్న వారందరికీ.. సారా చెప్పిన సమాధానం ఒక స్పీడ్ బ్రేకర్‌ వేసింది అనడంలో సందేహం లేదు. ఈ సంవత్సరం జాన్వి కపూర్ నటించిన "దడక్" చిత్రంతో పాటు సారా నటించిన తొలి చిత్రం "కేదార్ నాథ్"కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మనం కూడా ఈ కథానాయికల నుండి మంచి నటనతో కూడిన చిత్రాలని ఆశిద్దాం ... ఈ ఇద్దరు హీరోయిన్స్‌కి బెస్ట్ విషెస్.


Images: Instagram


ఈ ఆర్టికల్స్ కూడా చదవండి


జాన్వి కపూర్‌కి ఇష్టమైన మేకప్ ప్రొడక్ట్స్ గురించి ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


సారా అలీఖాన్ దేశీ మేకప్ గురించి ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


సారాతో తనకు పోటీ లేదంటున్న జాన్వి.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి