ADVERTISEMENT
home / Humour
విధులు నిర్వహిస్తున్న పోలీసుకు ముద్దులు.. ఓ మందుబాబు పైత్యం..!

విధులు నిర్వహిస్తున్న పోలీసుకు ముద్దులు.. ఓ మందుబాబు పైత్యం..!

మందుబాబుల్లో చాలా రకాల వ్యక్తులు ఉంటారు. కొందరు తాగి.. ఎవర్నీ డిస్టర్బ్ చేయకుండా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. మరికొందరికి తాగితే ఒంటి మీద తెలివుండదు. పిచ్చి వాగుడు వాగుతూ.. ఇతరులకూ కంపరం పుట్టిస్తారు. ఇంకొందరు అయితే.. మరో అడుగు ముందుకు వేస్తూ.. విపరీత చర్యలకు పాల్పడుతూ ఉంటారు. అలాంటి చర్యలే అప్పుడప్పుడు వారిని ఇరకాటంలో పడేస్తుంటాయి. అయినా వారు తమ పద్దతిని మార్చుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో రాజధాని (hyderabad) నగరంలో మందుబాబుల ఆగడాలు మరింత ఎక్కువవుతున్నాయి. 

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలంటే.. ఈ 15 బెస్ట్ స్పాట్స్‌‌కి వెళ్లాల్సిందే..!

తాగి మహిళలను వేధించడం, రోడ్డు మీద న్యూసెన్స్ చేయడం.. కొంతమంది మందుబాబులకు పరిపాటి. ఎన్ని సార్లు పోలీసులు వార్నింగ్ ఇచ్చినా.. వీరు ఆ పద్ధతిని మానుకోవడం లేదు. అందుకే హైదరాబాద్ పోలీసులు ఇలాంటి వారిపై కఠినంగా ఉంటున్నారు. కేసులు నమోదు చేయడమే కాదు.. వారికి కఠిన శిక్షలు కూడా పడేలా చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఇక నుండి హైదరాబాద్ పోలీసులు మరింత కఠినంగా ఉండాలని.. ఎవరికీ ఉపేక్షించేది లేదని.. పబ్లిక్ న్యూసెన్స్ చేసే వ్యక్తుల పట్ల తగిన చర్యలు తీసుకోవాలని ఇటీవలే కమీషనర్ సూచించారు. 

అమానవీయం.. అమానుషం: హైదరాబాద్‌లో సాటి మహిళనే.. వివస్త్రను చేసిన బార్ గర్ల్స్

ADVERTISEMENT

అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు తాగిన మైకంలో ఒళ్లు మరిచి ప్రవర్తించడం మానుకోవడం లేదు. ఇటీవలే తెలంగాణ బోనాల సందర్బంగా.. ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి రోడ్డు మధ్యలో తీన్‌మార్ డ్యాన్స్ ఆడడం మొదలు పెట్టాడు. పైగా బాగా తాగి ఉండడం వల్ల.. తనను తానే మరిచిపోయాడు. ఈ క్రమంలో రోడ్డు మీద విధులు నిర్వహిస్తున్న పోలీసు వద్దకు ఆ మందుబాబు వెళ్లి.. తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. తొలుత పోలీస్ కంగు తిన్నా.. తర్వాత వెంటనే తేరుకొని లాగి పెట్టి చెంపమీద కొట్టాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

తర్వాత పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోని తీసుకున్నారు. ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న ఆ వ్యక్తి.. తాను బాగా తాగి ఉండడం వల్లే.. ఒళ్లు మరిచి ఆ విపరీత చర్యకు పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిపై పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు కేసును నమోదు చేశారు. అలాగే ఐపీసీ సెక్షన్ 353 క్రింద విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకున్నందుకు.. వేధించినందుకు కూడా కేసు నమోదు చేశారు. పబ్లిక్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. 

ప్రస్తుతం సదరు వ్యక్తి పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. సాధారణంగా తాగి పబ్లిక్ న్యూసెన్స్ చేసే వ్యక్తులకు కోర్టు 24 గంటల పాటు జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తుంది. ఐపీసీ సెక్షన్ 510 ప్రకారం.. వారికి ఈ శిక్షను విధించడం జరుగుతుంది. అయితే సెక్షన్ 353 మాత్రం కఠినమైనది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకుంటే.. దాదాపు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కనుక మందుబాబులు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని.. ఒళ్లు తెలియకుండా రోడ్డు మీద ప్రవర్తించవద్దని పోలీసులు హితవు పలుకుతున్నారు. 

వైజాగ్ ట్రెండ్స్: ప్రముఖ పబ్స్ & బార్స్ వివరాలు మీకోసం…!

ADVERTISEMENT

ఈ మధ్యకాలంలో తాగిన మత్తులో చాలామంది మందుబాబులు నేరాలకూ పాల్పడుతున్నారు. ఇటీవలే నేరేడుమెట్టలో కొందరు వ్యక్తులు తాగిన మత్తులో ఓ బేకరిలోకి వెళ్లి.. అద్దాలను, ఫర్నీచరును ధ్వంసం చేశారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చిక్కుకోకుండా ఉండేందుకు.. ఈ  కొందరు మందుబాబులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. 

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, మెహిదీపట్నం, బేగంపేటలలోని పబ్‌లలో మద్యం సేవించే కొందరు.. వాట్సాప్ గ్రూపులు ప్రారంభించి.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరిగే ప్రాంతాల సమాచారాలను లీక్ చేస్తున్నారు. ఈ సమాచారం బట్టి.. సదరు మందుబాబులు ప్రత్యమ్నాయ రూట్లలో ఇండ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొందరు యాక్సిడెంట్లకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. వీరిని కంట్రోల్ చేయడం పోలీసులకు కూడా కష్టమవుతుంది. 

 

30 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT