ADVERTISEMENT
home / వినోదం
“దంగల్” ఫేమ్ ఫాతిమా.. “కింగ్ ఖాన్” స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం కొట్టేసిందా?

“దంగల్” ఫేమ్ ఫాతిమా.. “కింగ్ ఖాన్” స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం కొట్టేసిందా?

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) అంటే తెలియనివారు.. ఆయన నటనకి ఫిదా కానీవారు చాలా అరుదనే చెప్పుకోవాలి. షారూఖ్ హిందీ చిత్రసీమకి పరిచయం కావడం.. సినీ చ‌రిత్ర‌లోనే ఒక మలుపు అని చెబుతుంటారు చాలామంది. ఆయ‌న‌కున్న అభిమానులను చూస్తే ఇది పూర్తిగా నిజ‌మే అనిపిస్తుంది. ఆయ‌న సినిమా ప్ర‌యాణం గ‌మ‌నిస్తే.. బాలీవుడ్ పైన ఆయన ప్రభావం ఎంతో ఉంద‌ని స్పష్టంగా అర్థ‌మ‌వుతుంది.

కేవ‌లం సాధార‌ణ అభిమానులే కాదు.. ప‌రిశ్ర‌మ‌కి చెందిన‌వారు కూడా ఎంతో మంది కింగ్ ఖాన్ షారూఖ్ అంటే ప‌డి చచ్చిపోతారు. ఆయ‌న స్ఫూర్తితో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి విజ‌యం సాధించిన నటీన‌టులు ఎంతోమంది. అయితే అలా ఆయనని స్ఫూర్తిగా తీసుకుని వచ్చిన ఒక నాయిక‌కి కింగ్‌ఖాన్ ప‌క్కనే నటించే అవకాశం వస్తే.. ఇక ఆ నటి ఆనందానికి హద్దు ఉంటుందా? ఇప్పుడు మనం చదవబోయేది కూడా అలాంటి ఒక సంఘటన గురించే..

ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh) – ఈ పేరు చెబితే ఎక్కువమంది గుర్తుపట్టకపోవచ్చు. కాని దంగల్ (Dangal) చిత్రంలో గీతా ఫొగాట్ (Geetha Phogat) పేరు చెప్పగానే ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంత‌టి పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించింది ఫాతిమా. అయితే ఆ చిత్రం ద్వారా నటిగా అడుగుపెట్టకముందే.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా హిందీలో షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ పక్కన నటించిన అనుభ‌వం ఫాతిమాకి ఉంది.

ఒక ర‌కంగా ఫాతిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టేందుకు కింగ్‌ఖాన్ స్ఫూర్తి అని చెప్పుకోవ‌చ్చు. చిన్న‌త‌నంలో షారూఖ్ స‌ర‌స‌న న‌టించిన ఫాతిమాకి క్రమేపి షారుఖ్ ఖాన్ పైన ఇష్టం పెరుగుతూ వచ్చింది. ఆ ఇష్టమే స్ఫూర్తిగా మారి.. నటిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సైతం ఆమెకి మార్గం చూపింది.

ADVERTISEMENT

ఇక ఆమె తన తొలి చిత్రం దంగల్ ద్వారా గుర్తింపుతో పాటు అందరి ప్రశంసలు సైతం మూటగట్టుకోగలిగింది. ఈ అభినయానికి ముగ్దులైన దర్శక-నిర్మాతలు ఆమెకు వ‌రుస సినిమా ఆఫ‌ర్లు అందించారు. అయితే త‌న‌కు వ‌చ్చిన ఆఫ‌ర్ల‌లో న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉండేవి.. త‌నకి నప్పే పాత్రలనే ఎంచుకుంటూ వ‌స్తోంది ఫాతిమా. అందులో భాగంగానే ఆమె తాజాగా “థ‌గ్స్ అఫ్ హిందుస్థాన్”(Thugs Of Hindostan)లో ఒక కీలక పాత్రలో నటించింది. సినిమా పరాజయం పాలైనప్పటికీ అందులో ఆమె పాత్రకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

తన రెండో చిత్రం ఫ్లాప్ అయిన బాధలో ఉన్న ఆమెకి.. అదే స‌మ‌యంలో తాను న‌మ్మ‌లేని ఆఫ‌ర్ సొంత‌మైంద‌ట‌. ఆమెను ఆకాశానికెత్తేసే ఈ ఆఫర్కి ఫాతిమా కూడా ఓకే చెప్పింద‌ని స‌మాచారం. షారుఖ్ ఖాన్ త్వరలో నటించబోయే “సెల్యూట్”  (Salute) చిత్రంలో ఆయన పక్కన నాయిక పాత్ర కోసం ఫాతిమాను సంప్ర‌దించార‌ట ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. షారూఖ్ స‌ర‌స‌న సినిమా అన‌గానే ఆమె కూడా ఓకే చెప్పేసింద‌ట‌. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఆమె అనేక ఇంటర్వ్యూలలో షారుఖ్ అంటే తనకి ఎంతో ఇష్టమ‌ని చెప్పిన ఫాతిమా..ఆయనని కలిసిన ప్రతిసారి నోటివెంట మాట‌లు రాకుండా.. ఒక బొమ్మ మాదిరిగా మారిపోతాన‌ని.. షారుక్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం దొరికితే ఎగిరి గంతేస్తాన‌ని చెప్పింది.

అందుకే సెల్యూట్ చిత్రంలో షారుక్ పక్కన న‌టించే అవ‌కాశం ఫాతిమాకి నిజంగానే ద‌క్కితే.. అది ఆమె కెరీర్‌లో అద్భుత‌మైన అవ‌కాశంగా చెప్పుకోవ‌చ్చు. అదే సమయంలో కెరీర్ తొలినాళ్ల‌లోనే అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్‌లతో నటించిన ఈమె.. మూడో చిత్రంలో ఏకంగా షారుఖ్ ఖాన్ పక్కన నటించడం నిజంగా ఆమె అదృష్టమనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం ఫాతిమా అనురాగ్ బాసు (Anurag Basu) దర్శకత్వంలో లైఫ్ ఇన్ ఏ మెట్రో – 2 (Life in a metro – 2) లో ఒక ప్రధాన పాత్రలో నటించేందుకు పచ్చ జెండా ఊపింద‌ట‌. ఈ విషయాన్ని ఫాతిమా సైతం ధ్రువీకరించింది. ఇప్పుడు వస్తున్న వార్తలు నిజమైతే ఆమె ఖాతాలో మరో భారీ చిత్రం వ‌చ్చిచేరుతుంది.

ADVERTISEMENT

ఇవన్నీ అటుంచితే, షారుఖ్ ఖాన్ ఎంతో ఇష్టపడి.. కష్టపడి చేసిన “జీరో” చిత్రం ప్రేక్షకుల మనసుని గెలుచుకోలేకపోవడంతో ఆయన చాలా నిరాశచెందినట్టు తెలుస్తోంది. అందుకనే ఆయన చేయబోయే ఈ “సెల్యూట్” చిత్రం ప్రేక్షకులకి అన్ని విధాలుగా నచ్చేలా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ‘సెల్యూట్’ చిత్రం భారతీయ వ్యోమోగామి రాకేష్ శర్మ (Rakesh Sharma) జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మిస్తున్న చిత్రం. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ పట్టాలెక్కనుంది.

ఆఖరుగా రెండో చిత్రంతో భారీ ఫ్లాప్‌ని అందుకున్న ఫాతిమా సనా షేక్ కెరీర్ ఊపందుకోవాలని.. త‌న అభిమాన స్టార్ షారుఖ్ ఖాన్ పక్కన “సెల్యూట్” లో నటించే అవకాశం కూడా త‌న ఎదుగుద‌ల‌కు తోడ్పడాలని కోరుకుందాం.

ఇవి కూడా చదవండి

చాచీ 420 చిత్రం నుండి దంగల్ వరకూ ఫాతిమా ప్రస్థానం.. ఈ వ్యాసం ఆంగ్లంలో చదవండి

ADVERTISEMENT

దంగల్ చిత్రం గురించి ఎవరికీ తెలియని 15 విషయాలివే

జాకీచాన్‌తో దంగల్ భామ ఫాతిమా.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

07 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT