కత్రినా కైఫ్ - సల్మాన్ ఖాన్‌లు కలిసి నటించారా... అయితే ఆ సినిమా హిట్టే !

కత్రినా కైఫ్ - సల్మాన్ ఖాన్‌లు కలిసి నటించారా... అయితే ఆ సినిమా హిట్టే !

సిల్వర్ స్క్రీన్ పై కొన్ని జంటలు కనిపిస్తే చాలు.. అభిమానులకు భలే చూడముచ్చటగా ఉంటుంది. ఒక హీరో- హీరోయిన్  మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యి.. వారి సినిమాలు ఒకటి లేదా రెండు బాక్సాఫీస్ వద్ద విజయ ఢంకా మోగిస్తే చాలు.. వారికి హిట్ పెయిర్ (Hit Pair) అనే పేరు స్థిరపడిపోతుంది. ఆ తర్వాత వారు కలిసి ఏ సినిమా చేసినా అది హిట్ అవుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అందుకే దర్శక, నిర్మాతలు కూడా.. ఇలాంటి హిట్ పెయిర్స్‌తో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.


ఇలాంటి హిట్ పెయిర్ సెంటిమెంట్‌తో వర్కవుట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే బాలీవుడ్‌లో హిట్ పెయిర్ అనగానే ఇప్పుడున్న నటీనటుల్లో సల్మాన్ ఖాన్ (Salman Khan) - కత్రినా కైఫ్‌లు (Katrina Kaif) మాత్రమే గుర్తుకొస్తారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు ఆరు సినిమాల్లో నటించారు. అయితే వాటిలో ఒక్క  పార్టనర్ (Partner) సినిమాలో మాత్రం జంటగా కాకుండా విడివిడి పాత్రల్లో నటించారు.  మైనే ప్యార్ క్యూ కియా (Maine Pyar Kyu Kiya), యువరాజ్ (Yuvvraj), ఏక్తా టైగర్ (Ek Tha Tiger), టైగర్ జిందా హై (Tiger Zinda Hai) & భారత్ (Bharat) చిత్రాలు సల్మాన్, కత్రినా కలిసి నటించిన ఇతర ప్రముఖ చిత్రాలు.


main-ne-pyar-kyun-kiya-1


వీటిలో యువరాజ్ చిత్రం మినహా మిగతా నాలుగూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచినవే. తాజాగా విడుదలైన భారత్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తా గట్టిగానే చాటుతోంది. అందుకే వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందనగానే.. చాలామంది అభిమానులు అది తప్పకుండా హిట్ అని ఫిక్స్ అయిపోతారు. 


అయితే సల్మాన్ - కత్రినాలు హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకోవడం వెనుక మరో కారణం కూడా ఉంది. వీరు నటించిన చిత్రాలు హిట్ కావడం ఒక ఎత్తైతే..  గతంలో వీరిద్దరూ ప్రేమించుకోవడం మరో ఎత్తు. కానీ కొన్ని కారణాల రీత్యా తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు కూడా ఇద్దరూ ఎవ్వరితోనూ ఏ బంధంలోనూ లేరు. కాకపోతే వీరి అభిమానులంతా సల్మాన్, కత్రినాలు నిజజీవితంలోనూ కలిసి జీవించాలని కోరుకుంటున్నారు. వారి ప్రేమ బంధంపై అభిమానులకు ఉన్న నమ్మకం, ఆశ.. వంటివి కూడా సల్మాన్ - కత్రినాల హిట్ పెయిర్‌కి తోడై.. వారి సినిమాలపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.


ek-tha-tiger-1


ఇక రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే సల్మాన్ చిత్రాలు ఖచ్చితంగా హిట్ అయి తీరతాయన్న నమ్మకం మరోవైపు ఉండనే ఉంది. ఇంకేముంది.. ఇవన్నీ కలిసి భారత్ చిత్రానికి అశేష ప్రజానీకమంతా నీరాజనాలు పట్టేలా చేస్తున్నాయి. ఇందులో సల్మాన్ ఐదు సరికొత్త అవతారాల్లో కనిపించడం, వాటిలో ఒకటి ఓల్డ్ మ్యాన్ గెటప్ కావడం, దీనికి సంబంధించిన పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచీ సినిమాపై మరింత ఆసక్తి పెరగడం.. ఇవన్నీ మనకు తెలిసినవే.


అలాగే భారత్ టీజర్స్, ట్రైలర్స్‌లో సల్మాన్, కత్రినాల మధ్య సాగే కొన్ని సన్నివేశాలు, పాటలకు కూడా అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. వీటన్నింటి కారణంగా అభిమానులు, ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలను అందుకోవడంలో భారత్ విజయం సాధించిందనే చెప్పాలి. ఇక సినిమా విడుదలయ్యాక కూడా.. మంచి రివ్యూలతో పాటు కలెక్షన్లనూ రాబట్టింది. 


అయితే బాలీవుడ్‌లో సల్మాన్, కత్రినాలది మాత్రమే హిట్ పెయిర్ అని మాత్రం అనుకోకండి. ఈ జాబితాలో వీరి కంటే ముందు స్థానం సంపాదించుకున్న హీరో - హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. వారిలో అమితాబ్ బచ్చన్ - రేఖ, అమితాబ్ బచ్చన్ - జయ బచ్చన్, షారూఖ్ ఖాన్ - కాజోల్, అక్షయ్ కుమార్ - శిల్పాశెట్టి, జూహీ చావ్లా - అమీర్ ఖాన్, ప్రీతీ జింతా - సైఫ్ అలీ ఖాన్, శ్రీదేవి - అనిల్ కపూర్, గోవింద - కరిష్మాకపూర్. వీరందరూ కూడా హిట్ పెయిర్స్‌గా సత్తా చాటిన వారే.


ఇవి కూడా చదవండి


తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 'దొరసాని' చిత్రం.. టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ ..!


అతని వయసు 50.. ఆమె వయసు 25.. చిత్రమైన ప్రేమకథలో "విక్టరీ వెంకటేష్"


#Metoo తమిళ నటి పై లైంగిక వేధింపులు.. విజయ్ దేవరకొండ చిత్రంలో ఛాన్స్ ఇస్తానన్న దర్శకుడు