చిన్నతనంలో.. అవి నిజంగానే నిజం అని న‌మ్మేశాం కదా..!

చిన్నతనంలో.. అవి నిజంగానే నిజం అని న‌మ్మేశాం కదా..!

90ల్లో పుట్టిన పిల్ల‌లు (90s kids).. అటు టెక్నాల‌జీ తెలియ‌ని పాత త‌రానికి, ఇటు టెక్నాల‌జీతో నిండిన కొత్త‌త‌రానికి మ‌ధ్య‌లో పెరిగిన త‌రం అని చెప్పవచ్చు. చిన్న‌త‌నంలో అటు బ‌య‌ట ఆట‌ల‌తో పాటు.. ఇటు వీడియో గేమ్స్ వంటివి ఆడి రెండు త‌రాల‌కు చెందిన బాల్యాన్ని ఎంజాయ్ చేసిన త‌రం వారిది. అప్ప‌టి జ్ఞాప‌కాలు(memories) ఇప్ప‌టికీ వారిలో ఆనందాన్ని నింపుతాయి. గుర్తొస్తే చాలు  ముఖంపై చిరున‌వ్వు కూడా వ‌చ్చేలా చేస్తాయి. మ‌రి, అప్ప‌టి తరం వారు న‌మ్మిన కొన్ని వింత విశేషాల గురించి తెలుసుకుందాం రండి..


90ల్లో పుట్టిన పిల్ల‌లు చాలా అదృష్ట‌వంతులు. టెక్నాల‌జీ వారి చిన్న‌త‌నాన్ని పాడుచేయ‌లేదు. వారితో పాటే టెక్నాల‌జీ కూడా మ‌రింత పెరిగింది. ఈ స‌మ‌యంలో వారు నిజంగానే నిజం అని న‌మ్మిన కొన్ని విష‌యాల గురించి ఇప్పుడు ఆలోచిస్తే.. అస‌లు అంత మూర్ఖంగా ఎలా ఆలోచించాం అని న‌వ్వుకుంటారు. అందుకేనేమో.. అప్ప‌ట్లో ఈ విష‌యాల‌ను న‌మ్మేశాం అంటూ నవ్వుకుంటూ.. అప్పుడప్పుడు ఆ విషయాలను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ త‌మ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం రండి...


DypkM7NWkAALtSu


1. రికీ పాంటింగ్ బ్యాట్‌లో స్టీల్ రాడ్స్, స్ప్రింగులు పెట్టుకున్నార‌ట‌. అత‌డే కాదు.. ఆస్ట్రేలియా టీమ్ అంద‌రి బ్యాట్స్‌లో అవి ఉన్నాయ‌ట‌. అందుకే ఇండియా 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ ఓడిపోయింది.


2. పెన్సిల్ చెక్కిన త‌ర్వాత వ‌చ్చే చెత్త‌ను పాల‌ల్లో వేసి.. నెల‌రోజులు అలా పెడితే ఎరేజ‌ర్ అవుతుంది.


3. FLAMESలో మ్యారేజ్ వ‌స్తే.. వాళ్లు నిజంగానే పెళ్లి చేసుకుంటారు.


DypiWkIX4AYiQ3I


4. అనుకోకుండా మ‌నం ఏవైనా గింజ‌లు తినేస్తే.. మ‌న త‌ల‌లో చెట్టు మొలుస్తుంది.


5. ధోనీ రోజుకు ఐదు లీట‌ర్ల పాలు తాగుతాడు. అందుకే అంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు.


DysjJtPVYAAAE9i


6. ష‌క‌ల‌క బూం బూం పెన్సిల్ నిజంగానే ఉంది. దాంతో ఏది గీస్తే ఆ వ‌స్తువు ప్ర‌త్యక్ష‌మ‌వుతుంది.


7. డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ రెజ్ల‌ర్ అండ‌ర్‌టేక‌ర్ ఎనిమిది సార్లు చ‌నిపోయి మ‌ళ్లీ బ‌తికాడు.


8.హీరోహీరోయిన్ల‌కు అతీంద్రియ శ‌క్తులుంటాయి. అందుకే పాట పాడేట‌ప్పుడు వెంట‌వెంట‌నే వారి దుస్తులు మారిపోతూ ఉంటాయి.


DysNmM9U8AE4jFQ


9. ఓమ్నీ కార్ల‌ను కేవ‌లం కిడ్నాప్ చేయ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగిస్తారు. అందుకే ఆ కార్ క‌నిపిస్తే జాగ్ర‌త్త‌గా ఉండాలి.


10. త‌ల‌లో రెండు సుడులుంటే రెండు పెళ్లిళ్ల‌వుతాయి.


11. అమ్మానాన్న‌లు ముద్దు పెట్టుకుంటే దేవుడు ప‌క్షుల‌కిచ్చి పిల్ల‌ల్ని పంపుతాడు.


12.ఝ‌ల‌క్ దిక్‌లాజా అంటూ పాడితే.. ద‌య్యం మ‌న ద‌గ్గ‌రికి వ‌చ్చి నిల‌బ‌డుతుంది.


DypLLgcUUAEOs6W


13. ఎరేజ‌ర్‌లో నీలి రంగు భాగం.. పెన్నుతో రాసిన అక్ష‌రాల‌ను చెరుపుతుంది.


14. ప‌న్ను రాలిపోయిన తర్వాత.. దాన్ని మ‌ట్టిలో క‌ప్పెడితే కొన్ని రోజుల త‌ర్వాత అక్క‌డ బంగారం దొరుకుతుంది.


15. పాల‌కూర తింటే పపాయ్‌లా కండ‌లు పెంచ‌వ‌చ్చు.


16. నెమ‌లి ఈక‌ల‌ను పుస్త‌కాల్లో పెట్టుకుంటే అది కొన్నిరోజుల‌కు పిల్ల‌ల్ని పెడుతుంది.


DypAhxEUUAEUAhz


17. పీచు మిఠాయి ముస‌లివాళ్ల జుట్టు నుంచి త‌యార‌వుతుంది. అందుకే దాన్ని తిన‌కూడదు.


18. బ‌బుల్‌గ‌మ్ మింగితే అది క‌డుపులో అతుక్కుపోతుంది. పొట్ట‌కోసి తీయాల్సి వ‌స్తుంది.


19. H, M, T అనే అక్ష‌రాలున్న రూపాయి బిళ్ల‌లు సేక‌రించి ఇస్తే హెచ్ఎంటీ కంపెనీ వాళ్లు మ‌న‌కు వాచీ అందిస్తారు.


DypI7iTUcAEEl8u


20. మ‌న‌కేమైనా క‌ష్టం వ‌స్తే శ‌క్తిమాన్ అని అరిస్తే శ‌క్తిమాన్ అక్క‌డికి వ‌చ్చేస్తాడు.


21. రెండు అర చేతుల్లోని గీత‌లు క‌లిస్తే వాళ్ల‌కు ల‌వ్ మ్యారేజ్ అవుతుంది.


22. రాత్రి పూట జుట్టు విర‌బోసుకుంటే ద‌య్యాలు ప‌డ‌తాయి.


23. చేతి రాత బాగుంటే వంద‌కు నూట ఐదు మార్కులు కూడా వ‌స్తాయి.


ఇవి కూడా చ‌ద‌వండి.


వాలెంటైన్స్ డేకి సింగిల్‌గా ఉంటే.. ఈ స‌మ‌స్య‌లు మీకూ ఎదుర‌య్యే ఉంటాయి..!


పెళ్లికి ముందు వాలెంటైన్స్ డే.. పెళ్ల‌య్యాక ఆర్డిన‌రీ డే..!


నిజ‌మైన ప్రేమ‌కు మ‌రుప‌న్న‌దే లేదు.. ప్రేమికులందరూ తప్పక చదవాల్సిన ప్రేమకథ


Images - Twitter, Shutterstock, Ebay, Wikipedia