ఈ తొలిరేయి జ్ఞాప‌కాలు.. కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఉంటాయి..

ఈ తొలిరేయి జ్ఞాప‌కాలు.. కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఉంటాయి..

పెళ్లి తర్వాత మొదటిరాత్రి (first wedding night) విషయంలో ప్రతిఒక్కరికీ ఎన్నో కలలు, మరెన్నో ఆశలుంటాయి. శోభ‌నం గదిలోకి అడుగు పెట్టాలంటే.. కాస్త సిగ్గుగాను.. అంతకంటే ఎక్కువ కంగారుగానూ ఉంటుంది. కొంతమంది తమ తొలిరాత్రి అనుభవాలను Redditలో పంచుకొన్నారు. చాలా ఆసక్తికరంగా ఉన్న ఈ  తొలిరాత్రి కథలను ఓసారి చదవండి.


1. ఏం చేయాలో తెలుసు.. ఎలా చేయాలో తెలీదు..


Throwaway84953 Redditలో చెప్పిన సమాధానం: 22 ఏళ్ల వయసులో నేను పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొన్నాను. మా ఇద్దరికీ కాస్త నెర్వస్‌గానే ఉంది. ఎందుకంటే తొలిరాత్రి అలా చేయాలని తెలుసు. కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియక ఇద్దరం స్తబ్ధుగా కూర్చొని ఉన్నాం. కాస్త సమయం తర్వాత అతడే ఈ విషయంలో తొలి అడుగు వేశాడు. ఆ తర్వాత కాస్త ఇబ్బందిగానే ఫోర్ ప్లే చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా ఇద్దరికీ ఎదుటి వ్యక్తిని ఆ విషయంలో ఎలా తాకాలో కూడా తెలియదు. నా తొలిరాత్రి కథ ఇప్పటికీ నాకు కాస్త కలవరాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే.. మొదటిసారి ఒకరి ముందు నగ్నంగా ఉండటం.. నన్ను ఆ విధంగా తాకడం కూడా నాకు తొలిసారి ఎదురైన అనుభవం.


1 first time after arranged marriage


Also Read: పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఉండే.. ప్రత్యేకత ఏమిటంటే..?


2. సెక్స్..? ఆ ఆలోచనే రాలేదు


Laughingjackass Reddit లో చెప్పిన సమాధానం: మీరు ఇష్టపడిన వ్యక్తితో మొదటిసారి ఒకే గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు సెక్స్ గురించి ఆలోచనే రాదు. అతనితో కలసి జీవించబోతున్నాననే ఆనందమే ఎక్కువగా ఉంటుంది. (పెళ్లికి ఆరు నెలల ముందు నుంచి సుమారుగా 600 నుంచి 700 గంటల సమయం మేం ఫోన్లో మాట్లాడుకొంటూనే ఉన్నాం.)


3. ఇల్లంతా బంధువులే..


Heavens_Vibe Reddit లో చెప్పిన సమాధానం: మీకు తెలుసు కదా.. ఆసియా దేశాల్లో పెళ్లి ఒక్కరోజులో పూర్తయ్యే తంతు కాదు. అంతకుమించిన బృహ‌త్కార్యం. ఇల్లంతా బంధుమిత్రులతో నిండిపోయి ఉంటుంది. ఇంట్లో ఏ మూల చూసినా చుట్టాలే ఉంటారు. మనసులో వాళ్లు వెళ్లిపోతే బాగుండుననిపిస్తుంది. ఇల్లు ఖాళీ అయితే ప్రశాంతంగా నిద్రపోవచ్చనిపిస్తుంది. కానీ వారు వెళ్లరు. తొలిరేయి నాడు గదిలో అడుగు పెట్టేసరికే రాత్రి మూడు అవుతుంది. అప్పటికే అలసిపోయి ఉంటారు. ఇక చేసేదేమీ లేక.. కాసేపు కబుర్లు చెప్పి ముసుగు తన్ని పడుకొంటారు. ఆ చేసేదేదో రేపు చేసుకోవచ్చులే అని. పెళ్లి జరిగిన మొదటి రాత్రి అంత నీరసంగా గడుస్తుందన్నమాట!


3 first time after arranged marriage


4. సిగ్గుతో ముడుచుకుపోయిన వేళ


RussianVodka47 Reddit లో చెప్పిన సమాధానం: పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొన్న తొలిరాత్రే మేం సెక్స్‌లో పాల్గొనేందుకు ప్రయత్నించాం. కానీ మేమిద్దరం ఆ విషయంలో కంఫర్టబుల్ గా ఫీలవ్వడానికి దాదాపుగా 4-6 వారాలు సమయం పట్టింది. నాకు కాస్త సిగ్గు ఎక్కువ. దాని వల్లే మా పెళ్లయిన మొదటి రోజుల్లో దాన్ని మేం సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాం.


5. అమేజింగ్ అనుభవం 


MsWinchester Redditలో చెప్పిన సమాధానం: మా ఇద్దరికీ పెళ్లికి ఏడాదిన్నర ముందే నిశ్చితార్థం జరిగింది. మేమిద్దరం రోజూ మాట్లాడుకొనేవాళ్లం. మా మధ్య మాటలు ఎప్పటికీ పూర్తయ్యేవి కావు. మా మొదటి రాత్రి మేమిద్దరం చాలా సౌకర్యవంతంగానే ఫీలయ్యాం. మా తొలి సెక్స్ అనుభవాన్ని మేం చాలా ఆస్వాదించాం. ఇట్ వాజ్ అమేజింగ్.


5 first time after arranged marriage


Reddit లో ఫుల్ త్రెడ్ ఇక్కడ చదవండి


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కథనాలు చదవచ్చు.


మీరు సోషల్ మీడియాలో రాక్ స్టార్ గా వెలుగిపోతున్నారా? అయితే Plixxo లో వెంటనే చేరిపోండి - www.plixxo.com
ఇండియాలోనే అతి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నెట్వర్క్ లో చేరి టాప్ బ్రాండ్స్ తో కలసి పనిచేసే అవకాశం అందుకోండి.