Bigg Boss Telugu 3: హిమజ చేసిన పొరపాటుకు.. మహేష్ విట్టా బలయ్యాడు..!

Bigg Boss Telugu 3: హిమజ చేసిన పొరపాటుకు.. మహేష్ విట్టా బలయ్యాడు..!

బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) 'సీజన్ 3'లో భాగంగా తొమ్మిదవ వారం మొదలైంది. అలాగే ఈ వారపు నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక ప్రోమోస్‌లో చూపించిన విధంగానే.. టెలిఫోన్ బూత్ టాస్క్‌లో భాగంగా నామినేషన్స్ మొదలయ్యాయి. అసలు ఈ టెలిఫోన్ బూత్ టాస్క్ పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది. ఇంటి సభ్యులు తమ తోటివారి కోసం.. ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతారా లేదా..? అనేది తెలుసుకోవడం కోసమే బిగ్ బాస్ తెలివిగా ఈ టాస్క్‌ను ప్రవేశపెట్టారు. 

Bigg Boss Telugu 3: టాస్క్ వల్ల.. వితిక, శివజ్యోతి, హిమజ మధ్య విభేదాలు!

ఈ తరుణంలో నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన మొదటి ఫోన్ టాస్క్‌కి శ్రీముఖి బలైంది. నామినేషన్స్ నుండి ఆమె సేఫ్ అవ్వాలి అంటే.. బాబా భాస్కర్ తన గడ్డాన్ని తీసెయ్యాలి అని చెప్పగా.. ఆయన సహృదయంతో తన గడ్డాన్ని తొలిగించారు. అప్పుడు శ్రీముఖి నామినేషన్స్ నుండి సేఫ్ అయింది. ఆ తరువాత పునర్నవి సేఫ్ అవ్వాలంటే.. ఆమె కోసం రాహుల్ సిప్లిగంజ్.. ఏకంగా 20 గ్లాసుల కాకరకాయ రసం తాగాలని తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ 20 గ్లాసుల కాకరకాయ రసాన్ని తాగడంతో.. ఆమె నామినేషన్స్ నుండి బయటపడ్డారు. తన కోసం ఈ టాస్క్  చేసిన రాహుల్‌కి  ముద్దు పెట్టి.. పునర్నవి తన కృతజ్ఞతని తెలిపింది.

ఆ తరువాత వరుణ్ సందేశ్  సేఫ్ అవ్వాలంటే.. శ్రీముఖి తన చేతి పైన బిగ్ బాస్ టాటూ వేయించుకోవాలని తెలిపారు. ఆమె మారు మాట్లాడకుండా.. ఆ టాటూ వేయించుకోవడానికి సిద్ధమైంది. ఇక ఇదే తరహా టాటూని గత సీజన్‌లో గీత మాధురి కూడా.. ఈ టెలిఫోన్ టాస్క్ సందర్భంగా వేయించుకున్న సంగతి తెలిసిందే.

అలాగే మహేష్ విట్టా (Mahesh Vitta) సేఫ్ అవ్వాలంటే.. హిమజ (Himaja) తన బట్టలు, మేకప్ సామగ్రిని త్యాగం చేసి.. వాటిని స్టోర్ రూమ్‌లో పెట్టేయాలని బిగ్ బాస్ తెలిపారు. ఆమె వెంటనే వాటిని స్టోర్ రూమ్‌లో పెట్టడం జరిగింది. అయితే ఆమె పొరపాటుగా కొంత మేకప్ సామగ్రిని హూస్‌లో మరిచిపోవడంతో.. మహేష్ విట్టా ఈ వారం నామినేట్ అయ్యాడు.

అలాగే బాబా భాస్కర్ మాస్టర్ నామినేషన్ నుండి మినహాయింపు పొందాలంటే..  రవికృష్ణ తనకెంతో నచ్చిన షూస్‌ని రంగులో ముంచాలని చెప్పగా... వెంటనే ఆయన తన షూస్‌ని రంగులో ముంచేశారు. దాంతో బాబా భాస్కర్.. ఈ వారం నామినేషన్స్ నుండి సేఫ్ అయ్యారు. అలాగే శివజ్యోతి సేఫ్ కావాలంటే.. అందుకు మహేష్ విట్టా తన జుట్టుకి ఎర్ర రంగు వేయించుకోవాలని బిగ్ బాస్ ఆదేశించారు. దాంతో ఆయన వెంటనే ఎర్ర రంగు వేసుకోవడంతో శివజ్యోతి సేఫ్ అయ్యింది.

Bigg Boss Telugu 3: డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?


నిన్నటి ఎపిసోడ్‌లో చివరగా టెలిఫోన్ బూత్‌కి వచ్చిన సభ్యురాలు హిమజ. ఆమె ఈ వారం జరిగే నామినేషన్స్ నుండి సేఫ్ అవ్వాలంటే... వరుణ్ సందేశ్ ఆమె కోసం పేడతో నింపిన బాత్ టబ్‌‌లో పడుకోవాలని బిగ్ బాస్ ఆదేశించారు. కాస్త ఇబ్బందితో కూడుకున్న టాస్క్ అయినప్పటికి కూడా.. వరుణ్ సందేశ్ ఆ బాత్ టబ్‌లో పడుకున్నారు. అయితే అదే సమయంలో అటు వైపుకి డస్ట్ బిన్ తీసుకొస్తూ.. పరిగెత్తుకుంటూ వచ్చిన వితిక కింద పడిపోవడంతో ఇంట్లో అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

దీంతో హిమజ తనని తానే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని.. దయచేసి ఈ టాస్క్‌ని ఆపెయ్యమని బిగ్ బాస్‌ని కోరడం జరిగింది. అయితే వితికకి పెద్దగా గాయాలు కాకపోవడం.. అలాగే వరుణ్ సందేశ్ కూడా టాస్క్‌ని విజయవంతంగా పూర్తి చేయడంతో..  హిమజ ఈ వారం నామినేషన్స్ నుండి సేఫ్ అయ్యింది. 

ఇక రేపు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణలకి సంబంధించిన టాస్క్ వివరాలు తెలుస్తాయి. ఈ ముగ్గురు ఈ నామినేషన్ టాస్క్ నుండి బయటపడతారా లేదా..? అనేది తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. అలాగే రేపటి ఎపిసోడ్ ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ ఒక 'బిగ్ బాస్ కాలేజ్'గా మారనుంది. అందులో లెక్చరర్స్‌గా బాబా భాస్కర్, వితిక, వరుణ్ సందేశ్‌లు కనిపించబోతున్నారు. మిగతావారు స్టూడెంట్స్‌గా టాస్క్‌లో పాల్గొంటారు.

మొత్తానికి ఈ వారం నామినేషన్స్ టాస్క్ వల్ల.. ఇంటి సభ్యుల మధ్య మంచి సయోధ్య కుదిరినట్లుగానే కనిపిస్తోంది. హౌస్ మేట్స్ ఒకరికోసం మరొకరు రకరకాల టాస్క్‌లు చేయడం వల్ల.. మంచి స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడింది. అలాగే  కాకరకాయ రసం టాస్క్ ద్వారా పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య ఏర్పడిన దూరం కూడా తగ్గింది. 'ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ ఏమైనా జరగచ్చు' అనే దానికి ఇదొక ఉదాహరణ.

Bigg Boss Telugu 3 : ఫోన్ లిఫ్ట్ చేయడమే తప్పైంది.. నామినేషన్‌లో శ్రీముఖి