అట్లాంటిక్ సంద్రాన్ని ఒంటరిగా చుట్టివచ్చిన.. భారతీయ సాహసనారి ఆరోహి పండిట్..!

అట్లాంటిక్ సంద్రాన్ని ఒంటరిగా చుట్టివచ్చిన.. భారతీయ సాహసనారి ఆరోహి పండిట్..!

ఆరోహి పండిట్ (Aarohi Pandit).. ముంబయికి చెందిన 23 ఏళ్ల పైలట్. ఇప్పటికే ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అనే సందేశాన్ని అందరికీ చేరవేస్తూ.. ఆమె తన స్నేహితురాలైన కెప్టెన్ మస్క్విటతో కలిసి పలు సాహసయాత్రలు చేసిన విషయం విదితమే. ఇందులో భాగంగానే రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ మీదుగా పాకిస్థాన్, ఇరాన్, టర్కీ, సెర్బియా, గ్రీన్ లాండ్.. వంటి దేశాలను చుట్టి వచ్చింది. మొత్తం 27 చోట్ల ఆగుతూ; 17 దేశాలు 7000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించింది.


అయితే వీరు ప్రయాణానికి ఎంచుకున్న విమానం.. మంచి ప్రొఫెషనల్ ఫ్లైట్  అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే అత్యంత తేలికైన విమానం (లైట్ స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్) 'మహి'లో వీరు ప్రయాణించి ఈ సాహసాన్ని పూర్తి చేశారు.


తాజాగా ప్రపంచ రికార్డు..


తాజాగా కెప్టెన్ ఆరోహి పండిట్ కూడా అదే విమానంలో ప్రయాణంచి.. సాహస యాత్ర చేసి ఓ కొత్త ప్రపంచ రికార్డుని తన పేరిట లిఖించుకుంది. ఇంతకీ అదేంటో మీకు తెలుసా?? సుమారు 3,000 కిలోమీటర్లు పొడవున్న అట్లాంటిక్ మహా సముద్రం (Atlantic Ocean)పై ఆమె ఒంటరిగా విమానం నడిపింది. తద్వారా ఈ ప్రపంచంలోనే అలా ప్రయాణించిన తొలి యువతిగా వార్తల్లోకెక్కింది.


 
 

 

 


View this post on Instagram


Packing up and taking off ✈️❤️ #mylifeinaframe #pilotlife #womeninaviation #weexpedition


A post shared by Aarohi Pandit ✈️🏎 (@iroc_aaro) on
మహి కూడా ప్రత్యేకమే..


అయితే ఈ ప్రయాణం కోసం ఆరోహి ప్రత్యేకంగా సన్నద్ధమైంది. కొద్ది నెలల ముందు నుంచే శిక్షణ కూడా తీసుకుంది. తన సాహసయాత్రలకు మహి (Mahi) అనే విమానాన్ని ఎంచుకుంది. ఇది చాలా ప్రత్యేకంగా రూపొందించిన ఎయిర్ క్రాఫ్ట్. సుమారు 400 కిలోల బరువు, 4 మీటర్లు పొడవు గల విమాన రెక్కలు, 60 లీటర్లు సామర్థ్యం కలిగిన ఫ్యూయల్ ట్యాంక్‌తో కూడిన ఈ LSA -Light Sport Aircraft (లైట్ స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్) ఇది. గత వారం స్కాట్లాండ్ (యూకే)లోని విక్ విమానాశ్రయం తన సాహస యాత్రను ప్రారంభించింది ఆరోహి.


ఈ ప్రయాణంలో ఇంధనం నింపుకోవడానికి గ్రీన్ ల్యాండ్, ఐస్ ల్యాండ్.. వద్ద కాసేపు విమానాన్ని ఆపింది. మంగళవారం (మే 14) కెనడాలోని ఇక్విలాట్ విమానాశ్రయంలో విమానాన్ని సక్సెస్ ఫుల్‌గా ల్యాండ్ చేసి ఒంటరిగా ఎల్ ఎస్ ఏలో అట్లాంటిక్ మహా సముద్రంపై ఒంటరిగా ప్రయాణించిన తొలి మహిళగా గుర్తింపు సంపాదించుకుంది. ఆరోహి పండిట్ కెనడా విమానాశ్రయంలో దిగిన సమయంలో ఆ దేశంలోని మన దేశ రాయభారి వికాస్ స్వరూప్ (Vikas Swarup).. మన జాతీయ పతాకంతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.


 

మరిన్ని సాహసయాత్రలు..


ప్రస్తుతం ఒక చిన్న విమానమైన మహి సహాయంతో.. ప్రపంచాన్ని చుట్టి రావడమే లక్ష్యంగా ఆరోహి ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అనుసంధానంతో ఏర్పాటైన విమెన్ ఎంపవర్ మెంట్ ఎక్స్ పెడిషన్‌తో కలిసి పలు  సాహసాలు చేస్తోంది.


ప్రస్తుతం ఓ సాహసయాత్ర పూర్తి చేసిన ఆరోహి.. ఇంకొద్ది రోజులు కెనడాలోనే విశ్రాంతి తీసుకొని తర్వాత రష్యా వైపు ప్రయాణించనుంది. ఈ యాత్ర ద్వారా మరిన్ని రికార్డులు నమోదు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇలా మొత్తం 37 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత జూలై 30 తేదిన తిరిగి భారతదేశానికి చేరుకోనుంది.


అదొక గొప్ప అనుభూతి..


అట్లాంటిక్ మహా సముద్రంపై అతి చిన్న విమానంలో ఒంటరిగా ప్రయాణించిన తొలి మహిళగా గుర్తింపు సంపాదించిన ఆరోహి.... తర్వాత మీడియాతో తన ఆలోచనలను పంచుకుంది. తాఈ ప్రయాణం తనకు ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిందని తెలిపింది. ‘నేను ఈ ఘనతను సాధించినందుకు చాలా గర్విస్తున్నా. నా ఈ విజయాన్ని ఈ ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ అంకితం ఇస్తున్నా' అని ఆమె తెలిపింది.


 

"అట్లాంటిక్ మహా సముద్రం పై ఒంటరిగా ప్రయాణించడం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది.. సాహసోపేతమైన ఈ ప్రయాణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా సముద్రాల పై ప్రయాణించే సమయంలో వాతావరణ పరిస్థితులు చాలా అనూహ్యంగా మారిపోతుంటాయి. వాటిని అంచనా వేస్తూ ముందుకి సాగడం చాలా అవసరం. ఇందుకోసం నేను సుమారు 7 నెలల పాటు శారీరకంగా & మానసికంగా సిద్ధమయ్యాను" అంటూ తన సంతోషాన్ని అందరితోనూ పంచుకుంది ఆరోహి పండిట్.


కుటుంబం పాత్ర కూడా..


ఆరోహి కుటుంబం ఈశాన్య ముంబయిలో బోరివాలి అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆమె చిన్న వయసు నుంచే విమానాలు నడపాలని, గాల్లో విహరించాలని కలలు కనేది. ఆమె తండ్రి ట్రావెలింగ్‌కి సంబంధించిన వ్యాపారం చేసేవారు. ఆరోహి కల, ఆశయాన్ని అర్థం చేసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆ దిశగా ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే ఏవియేషన్‌లో డిగ్రీ పూర్తి చేసి బోంబే ఫ్లయింగ్ క్లబ్‌లో శిక్షణ పొందింది ఆరోహి. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఏదైనా విమానయాన సంస్థలో చేరకుండా.. సాహసాలు చేయాలనే ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేసింది. దీనికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది.


ఏది ఏమైనా.. అట్లాంటిక్ మహా సముద్రంపై ఒక చిన్న విమానంలో ఒంటరిగా ప్రయాణించి ఆ గుర్తింపు సాధించిన తొలిమహిళగా పేరు తెచ్చుకున్న ఆరోహి నేటి యువతకు నిజంగా స్ఫూర్తిదాయకం.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీకలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !


ఇవి కూడా చదవండి


79 ఏళ్ల నుంచి కరెంట్ లేకుండా జీవిస్తోన్న ప్రొఫెసర్ .. చాలా గ్రేట్ కదా..!


#POPxoTeluguExclusive చదరంగం.. నా జీవితంలో అంతర్భాగం: పద్మశ్రీ గ్రహీత హారిక ద్రోణవల్లితో ముఖాముఖి


సమాజం గొడ్రాలు అని ఏడిపిస్తే.. మొక్కలు ఆమెను వృక్షమాతను చేశాయి..!