అంబానీ ఇంట పెళ్ళికి ఎవరెవరు వచ్చారో తెలుసా..?

అంబానీ ఇంట పెళ్ళికి ఎవరెవరు వచ్చారో తెలుసా..?

 


అంబానీ - ఈ పేరు తెలియని వారు మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్న వర్గాల్లో కూడా ఉండరు అనేది అక్షర సత్యం. అలాంటి ఈ అపర కుబేరుడి ఇంట పెళ్లి అంటే అందరి దృష్టి ఆ ఇంటి పైనే ఉండదు మరి..


ఎంతో రంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి సంబంధించిన విశేషాలు, వింతలు (డబ్బున్న వారి ఇంట పెళ్లి కూడా ఒక వింతే కదా ), అతిధులు గురించి కాస్త మాట్లాడుకుందాం. మన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబాని ఏకైక కుమార్తె ఈషా అంబానీ వివాహం నిన్న ఆనంద్ పిరమాల్ తో ముంబైలోని అత్యంత విలాసవంతమైన-ఖరీదైన యాంటీలా లో వైభవంగా జరిగింది .


ఇక ఈ పెళ్ళికి ముందే జైపూర్ ప్రాంతంలోని రాజభవనంలో "ప్రీ -వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ " పేరిట దాదాపు పెళ్లి వేడుక చాలా ఘనంగా జరిపారు అంబానీ కుటుంబీకులు. ఇక ఆ వేడుకలని ముందుగా ఉదయ్ పూర్ ప్రాంత అనాధ పిల్లలకి , దివ్యాంగులకి అన్నదానం తో మొదలుపెట్టారు. దేశ విదేశీ ప్రముఖులెందరో ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉదయ్ పూర్ ప్రాంతానికి తరలిరావడం జరిగింది.ఈ వేడుకల్లో ఖాన్ త్రయం తమ హుషారైన డ్యాన్సులతో ఆహుతులని ఆహ్లాదపరచగా.. అంతర్జాతీయ పాప్ సింగర్ బియాన్స్ తన రాకింగ్ పెర్ఫార్మెన్స్ తో అందరికి ఒక ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి . ఇక ఈ వేడుకలకి అమెరికా నుండి హిల్లరీ క్లింటన్ ప్రత్యేకంగా విచ్ఛేయడం విశేషం.


ఇక అక్కడ వేడుకలు ముగిశాక, ముఖ్యమైన పెళ్లి వేడుకలకి ముంబై లోని ముకేశ్ నివాసం ముస్తాబైంది . నిన్నటి రోజున ఈషా అంబానీ ( Isha Ambani ) - ఆనంద్ పిరమాల్ (Anand Piramal) జంట ఒకటయింది , ఈ వేడుకకి సినీ పరిశ్రమలో అమితాబ్ కుటుంబం, రజినీకాంత్ దంపతులు , బాలీవుడ్ ఇండస్ట్రీ యావత్తు , క్రీడా రంగం నుండి సచిన్ మొదలుకుని అన్ని రంగాల క్రీడాకారులు , రాజకీయ రంగం నుండి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు , కేంద్ర మంత్రులు , మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో పాటుగా అనేకమంది వ్యాపారసంస్థల అధిపతులు విచ్చేసి కొత్త దంపతులని ఆశీర్వదించారు .పెళ్లికి ముందు జరిగే కార్యక్రమం మొత్తం ఈ పెళ్లి వేడుకకి హైలైట్ గా పేర్కొంటున్నారు. ఈషా సోదరులు అయిన అనంత్ , ఆకాష్ లు గుర్రాల పైన ఎదురు వెళ్లి తమ బావ అయిన ఆనంద్ కి స్వాగతం పలికారు. ఈ వేడుక ఆద్యంతం అంబానీ సోదరులిద్దరూ కలిసి ప్రముఖులు అందరిని ఆహ్వానించడం విశేషం ...


ఇవన్నీ ఒకెత్తు అయితే , కన్యాదానం సమయంలో ఆ సంప్రదాయాన్ని ఎందుకు చేస్తున్నారు అన్నదాన్ని అమితాబ్ బచ్చన్ అక్కడికి వచ్చిన అతిధులకు వివరించగా.. అది విని ముకేశ్ అంబానీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారన్నది ఆ వేడుకలో పాల్గొన్న అతిధుల ద్వారా బయటకి వచ్చిన వార్త . ఈ వార్త విన్న వారంతా - "ఎంత కోటీశ్వరుడైనా చివరికి ఒక ఆడపిల్లకి తండ్రే" గా అని అంటున్నారు.


చివరగా ఈ పెళ్ళికి ముకేశ్ అంబానీ దాదాపుగా 100 మిలియన్ డాలర్లు అనగా సుమారు రూ. 700 కోట్లకి పైగా ఖర్చు పెట్టారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఖరీదైన పెళ్లి వేడుకలలో ఇదొకటిగా మిగిలిపోనుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అత్యంత ఖరీదైన వివాహంగా GVK మనవాడి పెళ్లిని చెబుతుంటారు . ఈ వివాహం 2017లో హైదరాబాద్ వేదికగా జరగగా దీనికి కూడా దేశవిదేశాల నుండి ప్రముఖులు హాజరవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.


Image Source: Sachin Vijay Pawar