జబర్దస్త్ యాంకర్ 'రష్మీ' హీరోయిన్‌గా.. కొత్త చిత్రం..!

జబర్దస్త్ యాంకర్ 'రష్మీ' హీరోయిన్‌గా.. కొత్త చిత్రం..!

ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులరైన సెలబ్రిటీ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautham). పలు సినిమాలలో కూడా నటించారామె. గుంటూరు టాకీస్, రాణీ గారి బంగ్లా, తను వచ్చెనంట, నెక్స్ట్ నువ్వే లాంటి చిత్రాలలో నటించిన రష్మీ.. తాజాగా మరో చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి సైన్ చేసింది. ‘శివరంజని’ పేరుతో హారర్ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో రష్మి గౌతమ్, నందు, బిగ్ బాస్ 2 ఫేమ్ నందిని రాయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారట.


ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ విడుదల చేశారు. నాగ ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పద్మనాభరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సురేంద్ర రెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తుండగా.. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు.


 
 

 

 


View this post on Instagram


#nosepins #dutacoutures_outfit One of my fav pics by @sravan_goud8981


A post shared by Rashmi Gautam (@rashmigautam) on
మంత్ర, ప్రేమకథా చిత్రం, రాజు గారి గది, టాక్సీవాలా, యూటర్న్ లాంటి లోబడ్జెట్ హారర్ చిత్రాలు హిట్ అయ్యాక.. టాలీవుడ్‌లో ఈ మాదిరి చిత్రాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక రాఘవ లారెన్స్ కాంచన సిరీస్‌తో హారర్ చిత్రాలలో కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే.


ఈ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి కూడా విజయాన్ని పొందడం విశేషం. ఈ  క్రమంలో యాక్షన్, లవ్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ జానర్లతో పాటు హారర్ కూడా కొత్త దర్శకులకు.. సక్సెస్ రుచి చూపించేందుకు ప్రధాన సినీ ముడిసరకుగా మారింది.

Subscribe to POPxoTV

ఛార్మీ, నయనతార, సమంత, లక్ష్మీ రాయ్, భూమిక, అంజలి, త్రిష లాంటి స్టార్ హీరోయిన్లు అందరూ హారర్ చిత్రాల్లో నటించి రాణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చాలామంది చిన్న హీరోయిన్లకు తమను తాము నిరూపించుకొనేందుకు.. హారర్ చిత్రాలు బాగా తోడ్పడుతున్నాయన్నది సత్యమే.


ఈ క్రమంలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న లోబడ్జెట్ హారర్ చిత్రమే "శివరంజని". మరొక విషయం ఏమిటంటే.. ఈ మధ్యకాలంలో ఇలాంటి చిత్రాలకు పాత సినిమా పేర్లను పెట్టి హిట్ కొట్టడం దర్శకులకు రివాజుగా మారింది. ఉదాహరణకు, కోన వెంకట్, "గీతాంజలి" పేరుతో ఓ హారర్ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఈ చిత్రంలో అంజలి కథానాయికగా నటించడం గమనార్హం.


ఇప్పుడు అదే ఫార్ములాని దర్శకుడు ప్రభాకరన్ ఫాలో అవుతున్నారు. రష్మీ హీరోయిన్‌గా నటిస్తున్న "శివరంజని" (Sivaranjani) టైటిల్‌తో.. 1978లోనే జయసుధ కథానాయికగా ఓ చిత్రం విడుదల అయ్యింది.


ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం అది. అనేక సినిమా ఫంక్షన్లలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. హరిప్రసాద్, మోహన్ బాబు హీరోలుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్. అంతటి గొప్ప చరిత్ర ఉన్న సినిమా టైటిల్‌ని తీసుకొని.. ఓ వర్థమాన దర్శకుడు హారర్ జానర్‌లో చిత్రాన్ని తీయాలనుకోవడం సాహసమే. మరి ఆ  "శివరంజని" పేరుతో తెరకెక్కుతున్న ఈ కొత్త చిత్రం కూడా హిట్ బాట పడుతుందో లేదో.. తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ


కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !


ఇవి కూడా చదవండి


 2018 తెలుగు చిత్రాల్లో.. టాప్ 9 హీరోయిన్స్ ఎవరో తెలుసా..?


స్త్రీల ఆత్మగౌరవానికి.. అభ్యున్నతికి పెద్దపీట వేసిన "కళా తపస్వి" చిత్రాలు..!


టాలీవుడ్ మేటి కథానాయికల.. తొలి చిత్రాల ముచ్చట్లు మీకోసం..!