శ్రీదేవి .. మేమంతా సదా నిన్ను స్మరిస్తూనే ఉంటాం: జాన్వి, బోని కపూర్

శ్రీదేవి .. మేమంతా సదా నిన్ను స్మరిస్తూనే ఉంటాం: జాన్వి, బోని కపూర్

శ్రీదేవి (Sridevi).. నటనకే మారుపేరుగా నిలిచిన అందాల నటి.. అతిలోక సుందరి. ఒక్కమాటలో చెప్పాలంటే తన అందమైన అభినయంతో సినీపరిశ్రమకు వన్నెలద్దిన వెండి వెన్నెల. బాలనటిగా సినీపరిశ్రమలో అడుగుపెట్టి.. 50ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్‌ను తన సొంతం చేసుకున్న ఈ లేడీ సూపర్ స్టార్‌కు ఉన్న అభిమానుల సంఖ్య అసంఖ్యాకం. 30 ఏళ్ల పాటు కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార 2018, ఫిబ్రవరిలో ప్రమాదవశాత్తు మరణించిన విషయం మనందరికీ విదితమే.

దుబాయ్‌లో ప్రమాదవశాత్తు  బాత్‌టబ్‌లో పడి మునిగి.. అనంతలోకాలకు తరలిపోయిన శ్రీదేవి మరణాన్ని ఇప్పటికీ నమ్మనివారు ఎందరో. కానీ ఈ అతిలోక సుందరి మనందరినీ విడిచి ఏడాది గడిచిపోయింది. అంతేకాదు.. ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు.. అంతా శ్రీదేవిని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరు ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

View this post on Instagram

Happy birthday Mumma, I love you

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

View this post on Instagram

💚

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా..

శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందరితోనూ పంచుకుంది. దాంతో పాటు.. "హ్యాపీ బర్త్ డే అమ్మ.. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.." అంటూ అమ్మ గురించి ప్రేమగా రాసుకొచ్చింది జాన్వీ. ఈ పోస్ట్ చేసిన కాసేపటి తర్వాత.. శ్రీదేవి జయంతిని పురస్కరించుకొని తన బంధువు ఒకరితో కలిసి తిరుపతిలో దైవదర్శనం చేసుకున్న ఫొటోను పోస్ట్ చేసింది.

ఇందులో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా లంగాఓణీలో చేతికి గాజులు, చెవులకు ఝుంకాలు, నుదుట బొట్టుతో కళకళలాడుతూ మెరిసిపోయింది జాన్వీ కపూర్. ఇలా జాన్వీని చూసిన చాలామంది అచ్చం అమ్మలానే ఉన్నావంటూ తనకు కితాబు కూడా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా కథ ఆధారంగా నిర్మితమవుతోన్న కార్గిల్ గర్ల్ చిత్రంలో నటిస్తోంది.

ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నా..

శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సైతం ట్విట్టర్ వేదికగా ఆమెను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన- ‘హ్యాపీ బర్త్ డే జాన్.. నా జీవితంలో నిన్ను ప్రతి క్షణం మిస్ అవుతూనే ఉన్నాను. మమ్మల్ని నువ్వు ఎప్పుడూ గైడ్ చేస్తూనే ఉండు.. నువ్వెప్పటికీ మాతోనే ఉంటావు..’ అంటూ ట్వీట్ చేశారు.

మెమరీస్ ఎప్పటికీ ప్రత్యేకమే..

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్‌కపూర్ భార్య సునీతా కపూర్ సైతం తన స్నేహితురాలు, బంధువు అయిన శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్  వేదికగా ఓ ఫొటోను పంచుకున్నారు. దీంతో పాటు.. ‘మెమరీస్ అనేవి ఎప్పటికీ ప్రత్యేకమే. కొన్నిసార్లు మనం ఏడ్చిన సందర్భాలను గుర్తుచేసుకొని నవ్వుకుంటూ ఉంటాం.. మరోసారి మనం కలిసి బాగా నవ్వుకున్న సందర్భాలను గుర్తుచేసుకొని ఏడుస్తూ ఉంటాం.. జీవితం అంటే ఇదేనేమో.. హ్యాపీ బర్త్ డే శ్రీ.. మిస్ యూ సో మచ్..’ అంటూ ఆమెతో తనకు ఉన్న అనుబంధాన్ని అక్షరీకరించారు.

View this post on Instagram

💗💕 miss you

A post shared by Manish Malhotra (@manishmalhotra05) on

మిస్ యూ..

శ్రీదేవికి ఉన్న ఆప్తమిత్రుల్లో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా పేరు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఆమె జీవితంలోని ప్రతి సందర్భానికీ అనువుగా, స్పెషల్‌గా దుస్తులు డిజైన్ చేసిన ఆయన సైతం.. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవికి సంబంధించిన ఒక అందమైన స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దాంతో పాటు ‘మిస్ యూ’ అంటూ సింపుల్‌గా హార్ట్ ఎమోజీలను సైతం పెట్టారు.

కేవలం వీరు మాత్రమే కాదు.. శ్రీదేవి అభిమానులు సైతం అతిలోకసుందరికి ఆమె జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి అంతా ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. ‘హ్యాపీ బర్త్ డే శ్రీదేవి’ అంటూ ఆమెకు విషెస్ చెబుతూ సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరు ట్రెండింగ్‌లో నిలిచేలా చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ అతిలోక సుందరి తన నటన ద్వారా ఎప్పటికీ మన మధ్యే సజీవంగా ఉంటుందన్నది మనమెవ్వరం కాదనలేని వాస్తవం. మీరేమంటారు??

ఇవి కూడా చదవండి

అతిలోకసుందరి శ్రీదేవి జయంతి సందర్భంగా.. ఆమె గురించి కొన్ని విశేషాలు..!

నా దగ్గర అంత డబ్బు లేదు: శ్రీదేవి కుమార్తె జాన్వి ఆసక్తికర వ్యాఖ్యలు

నా ముద్దు "ఆ" యువ హీరోకే: జాన్వీ కపూర్