మహేష్ బాబు గారాలపట్టి "సితార" డ్యాన్స్ టాలెంట్.. మీరు కూడా చూస్తారా..?

మహేష్ బాబు గారాలపట్టి "సితార" డ్యాన్స్ టాలెంట్.. మీరు కూడా చూస్తారా..?

మహేష్ బాబు కుమార్తె సితార (Sitara) ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. తన తండ్రి మాదిరిగానే ఆమె కూడా మంచి డ్యాన్సర్. ఈ మధ్యకాలంలో యూట్యూబులో తన స్నేహితురాలితో కలిసి ఓ ఛానల్  ప్రారంభించిన సితార.. అందులో పలు వీడియోలు పోస్టు చేయడం మొదలుపెట్టింది. సెలబ్రిటీ కిడ్స్‌‌లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న సితార.. ఇదే క్రమంలో ఇటీవలే ఓ కార్యక్రమంలో డ్యాన్స్ కూడా చేసింది. ఆ డ్యాన్స్ వీడియోను ఆమె తల్లి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో.. ఇప్పుడు అది వైరల్‌గా మారింది.

ఇంతకీ ఆమె ఏ సాంగ్‌కి డ్యాన్స్ చేసిందో తెలుసా..? అదే మహేష్ బాబు నటించిన హిట్ సాంగ్ "పాలపిట్టలో మెరుపు".  ఈ పాటకు సితార చేసిన డ్యాన్స్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అభిమానులు ఆ వీడియోను షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా సితార ఓ సారి కుండలు చేస్తూ.. మరోసారి పాటలు పాడుతూ తన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. "మహర్షి" (Maharshi) సినిమాలో "పాలపిట్ట" (Palapitta) సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిన విషయమే.

కూతురి డ్యాన్స్ చూసి.. మురిసిపోయిన సూపర్ స్టార్ మహేశ్ బాబు

నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో సితార వీడియో పోస్టు చేశాక.. ఆ వీడియోకి వచ్చిన కామెంట్లు కూడా ఆమెను పొగడ్తలతో ముంచెత్తడం విశేషం. సితార భవిష్యత్తులో లేడీ సూపర్ స్టార్ అవుతుందని కొందరు అంటుంటే.. మరికొందరేమో.. సూపర్ ఎక్స్‌ప్రెషన్స్‌‌తో నటనలో మహేష్‌కు సితార పోటీ ఇచ్చేలా ఉందని  అంటున్నారు. అలాగే ఈ వీడియో పోస్టు చేసినందుకు... నమ్రతకు కూడా థ్యాంక్స్ చెబుతున్నారు. గత కొద్ది నెలల నుండి సితార, తన స్నేహితురాలు మరియు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి A&S పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. అందులో త్రీ మార్కర్స్ ఛాలెంజ్ పేరుతో వీడియో కూడా పోస్టు చేసింది. 

త‌మ త‌ల్లిదండ్రుల కంటే.. ఈ బుజ్జాయిలు భ‌లే ఫేమ‌స్‌ తెలుసా..!

మహేష్ బాబు (Mahesh Babu).. హీరోయిన్ నమ్రతను 2005లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారి మొదటి సంతానం గౌతమ్ 2006 లో జన్మించగా.. దాదాపు 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత.. 2012లో సితార జన్మించింది. సితార పుట్టినప్పటి నుండీ కూడా.. ఆమె గురించిన వార్తలు బాగా పాపులర్ అయ్యేవి. ముద్దులొలికే రూపం.. అమాయకమైన చిరునవ్వు.. అంతకు మించి తండ్రిలా టాలెంట్‌కి కొదువ లేకపోవడంతో.. అనతికాలంలోనే సెలబ్రిటీ కిడ్‌గా పాపులారిటీ సంపాదించుకుంది. 

బాలీవుడ్‌లో సైఫ్, కరీనాల కొడుకు తైమూర్‌కి ఎంత పాపులారిటీ ఉందో.. తెలుగులో మహేష్, నమ్రతల కూతురు సితారకు కూడా అంతే పాపులారిటీ ఉంది. మహేష్ కూడా సితారను ముద్దుగా "సీతా పాప" అని పిలుస్తుంటారు. సమ్మర్ వెకేషన్‌కి వెళ్లినా లేదా హాలీడేకి వెళ్లినా.. సితారకు ఫోటోల తీయడం అంటే యమ సరదా అంట. అలాగే ఆమె ఇచ్చే రకరకాల సెల్ఫీ ఫోజులు కూడా.. ఆమెకు ఎందరో అభిమానులను కట్టబెట్టాయి. ఎంతైనా ప్రిన్స్ మహేష్ బాబు కూతురా.. మజాకా..!   

యూట్యూబ్‌లోకి అడుగుపెట్టిన.. మహేష్ బాబు గారాలపట్టి సితార ..!

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.