కూతురి డ్యాన్స్ చూసి.. మురిసిపోయిన సూపర్ స్టార్ మహేశ్ బాబు

కూతురి డ్యాన్స్ చూసి.. మురిసిపోయిన సూపర్ స్టార్ మహేశ్ బాబు

తండ్రీకూతుళ్ల అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఎందుకో తెలీదు కానీ ప్రతి నాన్నకూ తన కూతురంటే అమితమైన ప్రేమ ఉంటుంది. తన గారాలపట్టిని రాజకుమారిలా చూసుకొంటాడు. ఎందుకంటే నాన్నంటే నాన్నే. స్టార్ పేరెంట్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం తన కూతురు సితారను ప్రిన్సెస్ మాదిరిగా చూసుకొంటారు. ఈ చిన్నితల్లిని ముద్దుగా సీతా పాప అని పిలుస్తారు.


1-sita-papa


తన కూతురు సితార అంటే మహేశ్‌కు ప్రాణం. తాను ఏ చిన్న పని చేసినా సరే.. సంతోషపడిపోతుంటారు. ఆ సంతోషం చాలా అపురూపమైనదిగా భావిస్తారాయన. మరి అంత అపురూపమైన ఆనందాన్ని మరింత పెంచుకోవడానికి సితార చేసిన ప్రతి పని గురించి తన అభిమానులతో పంచుకొంటారు మహేశ్. సీతా పాప పాడితే ఆయనకు పండగ. సీతా పాప ఆడితే ఉత్సవం. అందుకేనేమో సితార తన తండ్రితో సమానంగా పాపులారిటీ సంపాదించుకొంది.


ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సూపర్ స్టార్ కాస్త సమయం దొరికినా తన పిల్లలతో గడపడానికి కేటాయిస్తారు. మరీ ముఖ్యంగా సితారతో కలసి ఆడుకోవడమంటే ఆయనకు చాలా ఇష్టం. తనతో గడిపిన ప్రతి క్షణాన్ని అపురూపంగా భావిస్తారు మహేశ్. ఆయన భార్య నమ్రత సైతం ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

తన కూతురు చేసే అల్లరి, సందడిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో #Sitapapa అనే హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేస్తుంటారు మహేశ్. తాజాగా సీతా పాప డ్యాన్స్‌ను తన అభిమానులతో పంచుకొన్నారు మహేశ్. బాహుబలి 2 సినిమాలోని ‘కన్నా నిదురించరా’ పాటకు డ్యాన్స్ చేసింది సీతా పాప. క్యూట్ క్యూట్‌గా సితార వేసిన డ్యాన్స్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకొన్నారు మహేశ్. ‘వాట్ ఎ టాలెంట్ మై సీతా పాప’ అంటూ మురిసిపోయారు.


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ముద్దుగా ముద్దుగా సితార వేసిన స్టెప్పులను చూసి మహేశ్ అభిమానులు మురిసిపోతున్నారు. తను చాలా టాలెంటెడ్ అని కితాబిస్తున్నారు. 


ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్ చేసిన పోస్ట్‌కు చేసి 24 గంటలు తిరగకుండానే ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ట్విట్టర్‌లో రెండు లక్షలకు పైగా వ్యూస్, యాభైెఎనిమిది వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఫేస్బుక్‌లో ఏకంగా ఐదు లక్షల వీక్షణలు వచ్చాయి.


మీక్కూడా సీతాపాప డ్యాన్స్ చూడాలని ఉంది కదా.. ఇంకెదుకాలస్యం సూపర్ స్టార్ మహేశ్ షేర్ చేసిన ఈ వీడియోనే వీక్షించండి.
 

 

 


View this post on Instagram


What a talent👏👏👏👏👏😍😍😍 #MySitaPapa ❤


A post shared by Mahesh Babu (@urstrulymahesh) on
చూశారుగా.. సితార ఎంత పర్ఫెక్ట్‌గా డ్యాన్స్ చేస్తుందో. అందుకే తన కూతుర్ని చూసి తెగ మురిసిపోతున్నారు సూపర్ స్టార్ మహేశ్. మహేశ్ మాత్రమే కాదు నమ్రత శిరోద్కర్ సైతం సితార, గౌతమ్‌ల ఫొటోలను తరచూ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేస్తుంటారు.


Images: Instagram


Also Read: ఏమయ్యా వార్నర్.. మా తెలుగు వారి దోశ రుచి చూస్తావేంటి? అంటోన్న యాంకర్ సుమ


తెలుగు తెరపై సందడి చేసిన విదేశీ ముద్దుగుమ్మలు వీరే..!


మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మంచి మైలేజ్ ఇచ్చే 95 క్యాప్షన్లు