సూపర్ స్టార్ మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరు" తో.. లేడీ సూపర్ స్టార్ రీ ఎంట్రీ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరు" తో.. లేడీ సూపర్ స్టార్ రీ ఎంట్రీ..!

మహర్షి (Maharshi).. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లోనే ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం. #SSMB25 గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 2019లో  బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించనున్న తదుపరి చిత్రంపై కూడా భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.


అయితే ప్రిన్స్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి.. పని చేయనున్నాడని కొద్ది రోజుల క్రితం నుంచి చిత్రసీమలో వార్తలు హల్చల్ చేసిన విషయం మనందరికీ విదితమే.


తాజాగా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తన 26వ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో రాజకుమారుడు సినిమా నుంచి మొదలుకొని ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి వరకు అన్ని సినిమా టైటిల్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత టైటిల్ అనౌన్స్ మెంట్ మొదలవుతుంది.. దర్శకుడి పేరు వచ్చిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ స్క్రీన్ పై కనిపిస్తారు.


sarileru-neekkuvaru


’మహేష్ నటించే 26వ చిత్రం- సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru). వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది..’ అంటూ టైటిల్ ప్రకటించారు. ఆ తర్వాత కనిపించే టైటిల్‌ని కాస్త నిశితంగా పరిశీలిస్తే అందులో పేరుకి చివరిలో ఒక గన్, దానిపై ఒక సోల్జర్ క్యాప్ మనకు కనిపిస్తాయి. అంటే ఈ సినిమా మిలటరీ నేపథ్యంలో రూపొందుతోందని అర్థమవుతోంది.


సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కేవలం టైటిల్ అనౌన్స్ మెంట్ చేయడం మాత్రమే కాదు.. ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించారు.


అవేంటంటే - దాదాపు 13 ఏళ్ళ విరామం తరువాత ఈ చిత్రంతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijayashanthi) వెండితెర పైకి పునరాగమనం చేయనుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆమె ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నందుకు దర్శకుడు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ చిత్రంలో మరొక కీలక పాత్రలో జగపతి బాబు (Jagapathi Babu) నటిస్తున్నారని చెప్పారు.


 
 

 

 


View this post on Instagram


Sankranti 2020...🥳 All geared up!!! 😎😎 #SarileruNeekevvaru @anilravipudi @anilsunkara1 @srivenkateswaracreations @gmbents


A post shared by Mahesh Babu (@urstrulymahesh) on
ఇక ఈ సినిమాలో మహేష్ జోడీ కట్టనున్న కథానాయిక విషయానికి వస్తే.. ఈ హ్యాండ్ సమ్ హీరోతో జత కట్టే ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. రష్మిక మందన (Rashmika Mandanna). ఈ విషయం కూడా స్వయంగా రష్మిక సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం విశేషం. అలాగే సినిమా సాంకేతిక వర్గం విషయానికి వస్తే..  దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.


అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక మిలటరీ మేజర్ పాత్రలో కనిపించనున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని మూడు నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్స్దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ రామబ్రహ్మం సుంకర (Ramabrahmam Sunkara) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి.


అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకోవడంతో సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా ముగించాలని ప్లాన్ చేసుకుందీ చిత్రయూనిట్. కెరీర్ తొలినాళ్లలోనే మహేష్ తో కలిసి పని చేసే అవకాశం లభించినందుకు అనిల్ రావిపూడి సంతోషించడంతో పాటు ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తానని కూడా అన్నారు.


మరి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమైన "సరిలేరు .. నీకెవ్వరు .." చిత్రం కూడా మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్‌గా నిలవాలని మనమంతా ఆశిద్దాం..


ఇవి కూడా చదవండి


విశ్వక్ సేన్ "ఫలక్ నుమా దాస్" మూవీ రివ్యూ - ఇది పక్కా హైద్రాబాదీ సినిమా


నాని తన సినిమాకి.. అతన్నే హీరోగా ఎందుకు సెలెక్ట్ చేశాడంటే..?


ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఆసక్తికర ప్రకటన