మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. రైతుల సమస్యలను నేపథ్యంగా తీసుకొని అల్లిన ఈ సినిమాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో సినిమా సక్సెస్‌ను తన అభిమానులతో కలసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్.
ఇక ఇప్పుడు తన కుటుంబంతో కలసి మహర్షి విజయాన్ని సెలబ్రేట్ చేసుకొంటున్నాడు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో కలసి విదేశాలకు కుటుంబంతో సహా.. విహారయాత్రకు (family tour) వెళ్లి ఆయన ఉత్సాహంగా గడుపుతున్నారు.
మహర్షి సినిమా విజయవంతమైన తర్వాత మహేశ్ తన కుటుంబంతో కలసి జర్మనీకి టూర్‌కి వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కొన్నింటిని సూపర్ స్టార్ మహేశ్, ఆయన భార్య నమ్రత Instagram లో అభిమానులతో షేర్ చేసుకున్నారు. మహేశ్ బాబు ‘కుటుంబంతో మరో మెమెరబుల్ హాలిడే’ అని ఆయన పోస్ట్ కూడా చేశాడు.
టూర్లో సితార తీసుకొంటున్నసెల్ఫీల గురించి నమ్రత సైతం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివరించింది. ‘సితార ఇప్పుడు కొత్త పని చేస్తోంది. అదే సెల్ఫీలు తీసుకోవడం’ అంటూ పోస్ట్ చేసింది నమ్రత. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
మహేశ్ తన కుటుంబంతో కలిసి గడుపుతున్న ఫొటోలు చూస్తుంటే.. మనకు కూడా ఫ్యామిలీతో కలసి అలా సరదాగా గడపాలనిపిస్తుంది. కావాలంటే మీరు ఈ ఫొటోలను చూడండి. కచ్చితంగా మీకూ అలానే అనిపిస్తుంది.
View this post on Instagram
View this post on InstagramView this post on InstagramIt’s all about selfies and Sitara has a new job !! All of a sudden 😂😂♥️♥️♥️♥️#celebratingmaharshi
View this post on InstagramOff to another memorable holiday... This one is special...♥♥ #CelebratingMaharshi
ఇవి కూడా చదవండి:
భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో ఈ అక్కినేని జంటను చూసి నేర్చుకోవాల్సిందే..
స్వచ్ఛమైన ప్రేమకు అందమైన నిర్వచనం.. చైతూ, సమంతల జంట..!
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.