ADVERTISEMENT
home / Bigg Boss
Bigg Boss Telugu 3: మహేష్ విట్టా & హిమజ.. వీరిలో హౌస్ నుండి వెళ్ళేది ఎవరు?

Bigg Boss Telugu 3: మహేష్ విట్టా & హిమజ.. వీరిలో హౌస్ నుండి వెళ్ళేది ఎవరు?

“బిగ్ బాస్ తెలుగు సీజన్ 3″లో ఆరవ వారం ఈరోజుతో ముగియనుంది. ఇక ప్రతి ఆదివారం లాగానే ఈ వారం కూడా హౌస్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈవారం నాగార్జున కాకుండా.. ఈ ఎలిమినేట్ ప్రక్రియను స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ నిర్వహిస్తారు.

బిగ్‌బాస్ ఇంటిలో సీక్రెట్ వీడియోస్ రేపిన చిచ్చు!

ఇక ఈ వారం నామినేట్ అయిన ఆరుగురు సభ్యులలో ముగ్గురు సభ్యులు బిగ్ బాస్ ఇచ్చిన డీల్‌ని సద్వినియోగం చేసుకుని ఇమ్మ్యూనిటీ సాధించారు. దానితో ఈ వారం చివరికి వచ్చేసరికి ఆరుగురు.. కాస్త ముగ్గురు అవ్వడం జరిగింది. అలా ఈ వారం ఎలిమినేషన్ రేస్‌లో ఉంది – మహేష్ విట్టా, హిమజ (himaja), పునర్నవి (punarnavi) మాత్రమే.

అయితే ఈ ముగ్గురిలో పునర్నవికి అటు సోషల్ మీడియాలో కాని.. ఇటు బయట కాని మద్దతు బాగానే ఉంది. ఈమెతో పోలిస్తే హిమజ, మహేష్ విట్టాలకి హూస్‌లో ఉండేందుకు.. కాస్త తక్కువ స్కోప్ ఉందనే అనుకోవాలి. అందుకనే ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంది ఈ ఇద్దరికే అని తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారా లేదా అందరికి షాక్ ఇచ్చేలా పునర్నవి ఇంటి నుండి నిష్క్రమిస్తారా..? అన్నది ఈ రోజు తెలుస్తుంది. 

ADVERTISEMENT

ఇక నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రధాన ఆకర్షణ హోస్ట్ రమ్యకృష్ణ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె అనూహ్యంగా ఈ వారం హోస్ట్‌గా రావడం.. అలాగే ఆమె ఎలా బిగ్ బాస్ హౌస్ సభ్యులని హ్యాండిల్ చేస్తుంది అన్న ఆలోచనల మధ్య  నిన్న యాంకరింగ్ చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు గత వారంలో చేసిన అంశాలను చూపించారు. 

రమ్యకృష్ణ ఇంటి సభ్యులతో మాట్లాడడం చూస్తే.. బ్యాగ్రౌండ్‌లో ఆమె బాగానే ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు కూడా ఆమె హోస్ట్‌గా ఉంటారు కాబట్టి.. ఆమె స్టైల్ ఇంకాస్త తెలుస్తుంది. ఇప్పటి వరకూ బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారమవుతున్న ఏ భాషలో కూడా మహిళా హోస్ట్ లేకపోవడం ఒక ఎత్తైతే.. రమ్యకృష్ణ తొలిసారిగా నిన్న హోస్ట్ చేసి మరీ ఆ ఘనతను దక్కించుకోవడం విశేషం.

బిగ్‌బాస్ హౌస్‌లోని వెన్నుపోటుదారుల గురించి తెలుసా..?

నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇచ్చిన డీల్‌ని సద్వినియోగం చేసే క్రమంలో.. వితికను టార్గెట్ చేసినందుకు గాను.. ఆమె చేతనే వరుణ్ సందేశ్ పై కూల్ కాఫీ పోయించారు. అలాగే రాహుల్ సిప్లిగంజ్‌తో షార్ట్‌ని కట్ చేయించారు. ఇక రవికృష్ణ… శివజ్యోతి బెడ్ పూర్తిగా తడిపినందుకు గాను.. ఆమె చేత రవికృష్ణ బెడ్ పైన నీళ్లు పోయించి, తనకు స్వీట్ రివెంజ్ తీర్చుకునే అవకాశం కల్పించారు.

ADVERTISEMENT

ఇక ఎపిసోడ్ ప్రారంభంలో తాను ఈవారం బిగ్ బాస్‌ని హోస్ట్ చేయడానికి ఎందుకు అందుబాటులో ఉండడం లేదన్న విషయాన్ని ఇంటి సభ్యులకి స్వయంగా తెలిపారు నాగార్జున. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంటి సభ్యులు స్పెషల్‌గా రాసిన పాటకి డ్యాన్స్ చేసినందుకు థ్యాంక్స్ తెలిపారు. ఆ పాటని రాసి, పాడింది రాహుల్ సిప్లిగంజ్ కాగా.. మిగతా ఇంటి సభ్యుల కోసం డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసింది మాత్రం బాబా భాస్కర్. రమ్యకృష్ణ పేరు తానే సూచించానని.. శివగామి అలియాస్ రమ్యకృష్ణతో జాగ్రత్తగా ఉండమని.. లేదంటే ఆమె కోపానికి బలవుతారని  సరదాగా జోక్ చేశారు.

మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఫన్నీగానే గడిచిపోయింది. మరి ఇవాళ్టి ఎపిసోడ్ ఎలా ఉండనుందో అనేది ఈ రాత్రికి తెలుస్తుంది.                                                                           

బిగ్ బాస్‌తో డీల్ కుదుర్చుకున్న వరుణ్, రాహుల్, రవికృష్ణ

31 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT