మెగాస్టార్ చిరంజీవి సరసన.. మరో హీరోయిన్ వేటలో సైరా టీం!

మెగాస్టార్ చిరంజీవి సరసన.. మరో హీరోయిన్ వేటలో  సైరా టీం!

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం సైరా (Sye Raa). ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రెండు రోజుల క్రితమే కేరళలోని ఓ అడవిలో సైరాకి సంబంధించిన కీలక పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు.


ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైరా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఫిలిం నగర్‌లో తాజాగా చక్కర్లు కొడుతున్న ఒక వార్త ఈ చిత్రంపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది.


ఇంతకీ ఆ వార్త ఏంటంటే - సైరా చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఓ హీరోయిన్‌ని తీసుకోబోతున్నారట! అయితే తొలుత ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చల్లో సదరు పాత్రకి పెద్దగా ఆస్కారం లేదన్నారు. 


కానీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు ఊపందుకున్న వేళ చిత్ర యూనిట్‌కి ఈ పాత్ర పై ఆసక్తి నెలకొందట. దానితో ఈ పాత్రకి ఎవరైతే బాగుంటారన్న చర్చల్లో సైరా యూనిట్ సభ్యులు నిమగ్నమవ్వడమే కాదు.. పలువురు నటీమణుల పేర్లు కూడా తెరపైకి తీసుకొచ్చారు.


 


అలా వినిపించిన పేర్లలో ప్రముఖంగా.. అనుష్క (Anushka), శ్రియా శరణ్ (Shriya Saran) గురించి చర్చించడం జరిగింది. అయితే సినిమా చిత్రీకరణ పూర్తయ్యే దశకు చేరుకున్నాక గానీ.. చిత్ర యూనిట్‌కి ఈ పాత్ర ప్రాధాన్యం తెలియలేదట. అందుకే ఇప్పుడు ఆ పాత్రకు న్యాయం చేసే నటిని తీసుకోవాలని.. అందుకోసం ఓ పాపులర్ హీరోయిన్‌ని ఎంపిక చేయాలని సైరా టీమ్ భావించిందట.


ఇక సైరా షూటింగ్ వివరాల్లోకి వెళితే.. ఇటీవలే కేరళలో (Kerala) జరిగిన షెడ్యూల్‌తో దాదాపు అన్ని పనులూ పూర్తి అయ్యాయనే భావిస్తున్నారు. అలాగే మిగిలిన ప్యాచ్ వర్క్స్‌తో పాటు.. ఇప్పుడు ఎంపిక చేయనున్న ఈ పాత్రకు టాకీ పార్ట్‌ని కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు.


 


సైరా సినిమాకు సంబంధించి కేరళ కంటే ముందు.. జార్జియాలో (Georgia) దాదాపు రూ. 50 కోట్ల రూపాయల ఖర్చుతో భారీ షెడ్యూల్‌ని పూర్తి చేసిందీ చిత్ర యూనిట్. అయితే అది కూడా కేరళలో మాదిరిగానే యాక్షన్ సన్నివేశాలకు చెందిన చిత్రీకరణే కావడం విశేషం. ఒక యుద్ధ సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణ కోసం.. అంతటి భారీ స్థాయిలో ఖర్చు చేసిన తొలి తెలుగు చిత్రంగా సైరా రికార్డు సృష్టించింది


ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి‌‌‌తో పాటు.. అనేకమంది ప్రముఖ నటీనటులు కూడా వెండితెరపై మెరవనున్నారు. వారిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, నయనతార & తమన్నా.. తదితరులు ఉన్నారు. మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల కూడా ఈ చిత్రంలో తన పెద్దనాన్నతో కలిసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.


ఈ చిత్ర సాంకేతిక వర్గం విషయానికి వస్తే - దర్శకుడు సురేందర్ రెడ్డి (Surender Reddy) తన టీంలో దాదాపు ప్రముఖ వ్యక్తులనే చేర్చుకున్నాడు. అందులో ప్రముఖంగా సంగీత దర్శకుడు అమిత్ త్రివేది (Amit Trivedi), ఛాయాగ్రాహకుడిగా రత్నవేలు (Ratnavelu), మాటల రచయితగా సాయి మాధవ్ బుఱ్ఱా (Sai Madhav Burra).. మొదలైన వారి ఎంపిక అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వీరంతా కలిసి ఈ చిత్రాన్ని.. మరొక స్థాయిలో నిలబెడతారని భావిస్తున్నారు.


మరి, మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న 151వ చిత్రం సైరాలో నయనతార (Nayantara) & తమన్నాలతో (Tamannaah) పాటుగా మెరవనున్న మరో లక్కీ గర్ల్ ఎవరో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే..


ఇవి కూడా చదవండి


నా ముద్దు "ఆ" యువ హీరోకే: జాన్వీ కపూర్


శృతి హాసన్ "లవ్ లైఫ్"కి బ్రేక్ పడిందా..?


మహేష్ బాబు vs అక్కినేని అఖిల్.. ఈ ఇద్దరిలో రష్మిక ఓటు ఎవరికి?