మజిలీ సినిమాతో అబ్బాయిలందరికీ.. ఓ డ్రీమ్ వైఫ్ దొరికేసింది..!

మజిలీ సినిమాతో అబ్బాయిలందరికీ.. ఓ డ్రీమ్ వైఫ్ దొరికేసింది..!

మజిలీ (Majili).. అందాల జంట చైసామ్.. అదే మన నాగచైతన్య, సమంతలు నటించిన సినిమా. చైసామ్‌ల పెళ్లి తర్వాత వస్తున్న తొలి సినిమా కావడంతో ముందు నుంచే ఈ సినిమా పట్ల అందరిలోనూ కొన్ని అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాలన్నింటినీ మార్చేస్తూ అందరూ అనుకున్న దానికి భిన్నమైన కథతో ముందుకొచ్చిందీ జంట. ప్రేమలో విఫలమైన ఓ కుర్రాడు.. తనని ఇష్టపడి పెళ్లి చేసుకొని.. తనకు నచ్చకపోయినా తన కోసం సర్వస్వం ధారపోసిన ఓ అమ్మాయి కథతో ఈ సినిమా రూపొందింది.


మనం ప్రేమించిన వారిని మన నుంచి దూరం చేసిన దేవుడు.. అంతకంటే మంచి వ్యక్తినే మన జీవితంలోకి పంపిస్తాడన్న ఆశను ప్రతిఒక్కరిలో నింపింది. నాగ చైతన్య పోషించిన పూర్ణ పాత్ర గురించి పక్కన పెడితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి.. సమంత పోషించిన శ్రావణి పాత్రకు వచ్చిన హైప్ మాత్రం మాటల్లో చెప్పలేనిది. తెలుగు రాష్ట్రాల్లో.. మజిలీలో శ్రావణిలాంటి భార్య తనకు కావాలని కోరుకోని అబ్బాయి లేడంటే ఈ సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.


సాధారణంగా ప్రతి విషయంపై మీమ్స్ క్రియేట్ చేసి.. నవ్వుకునే మన తెలుగు యువత మజిలీని కూడా వదల్లేదు. ముఖ్యంగా శ్రావణి (Sravani) పాత్రకు సంబంధించిన మీమ్స్ మాత్రం బోలెడన్ని వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ప్రతిఒక్కరూ నాకు శ్రావణి లాంటి భార్య కావాలి.. అనే వారే.. అందుకే తనపై వచ్చిన మీమ్స్ ఎక్కువ. అలాగని సినిమాలో మిగిలిన వారిని వదిలేశారనుకోకండి. జీవితంలోని వివిధ సందర్భాలకు మజిలీ డైలాగ్స్‌ని.. వాటి స్పూఫ్స్‌ని చేర్చి ఆనందాన్ని పంచుతున్నారు. అలా మజిలీ చిత్రంపై వచ్చిన మీమ్స్‌లో కొన్నింటిని చూసేద్దాం రండి.


1. శ్రావణి లాంటి శ్రావణి కావాలంటే అంత ప్రేమకు అర్హులై ఉండాలి మరి.


2. తప్పదు.. అలా అడిగితేనే పనవుతుంది. పాస్ మార్కులు వస్తాయి.


3. శ్రావణి లాంటి భార్యను కోరుకుంటే.. ఇందు లాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎలా ఉంటుంది..
 

 

 


View this post on Instagram


 

 

Movie Charecters * #majili #geetagovindam #rx100


A post shared by Expectation 🆚 Reality (@xpectation__vs__realityy) on

4. ముందు వద్దంటారు.. తర్వాత అవే ముద్దంటారు.. ఈ భర్తల సంగతి తెలీదా..


5. అవును.. శ్రావణి లాంటి భార్య కావాలంటే మీరూ విజయ్ గోవింద్ లాంటివారై ఉండాలి.


6. లేట్ గా లేవడం ఈతరం అమ్మాయిల హక్కు మరి..


7. ఈ సినిమా విడుదలయ్యాక శ్రావణి అనే పేరున్న అమ్మాయిలకు ఫాలోయింగ్ ఎక్కువైపోయిందట. పేరులో ఏముండదని వాళ్లకు తెలియదు పాపం..
 

 

 


View this post on Instagram


 

 

Sravani you're awesome in movie #majili #chayakkineni #samanthaakkineni #samantharuthprabhu #venky #raviteja #sneha #sravani #iamapuppet


A post shared by I_am_a_puppet (@i_am__a_puppet) on
 


8. ఇలా ప్రతిఒక్కరూ అనుకుంటే అబ్బాయిలందరికీ పెళ్లిళ్లు అయినట్లే..


9. అందరికీ శ్రావణి లాంటి భార్య వస్తే తన విలువేముంటుంది మరి..


10. నిజమే.. ఆ పాత్రను మర్చిపోవడానికి కనీసం కొన్ని నెలలో, సంవత్సరాలో పట్టేస్తుంది.

ఉపాసన హోస్ట్ అవతారమెత్తి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందంటే..


మ‌జిలీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చై-సామ్ ఆడిన ఈ గేమ్స్ చూశారా?


ఐపీఎల్ పై వ‌స్తున్న ఈ జోక్స్ భలేగున్నాయ్.. మనం చదివి ఆనందించేద్దామా..!