ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
కూతురితో పోటీ పడి మరీ.. పీహెచ్‌డీ చేసిన ఓ అమ్మ కథ..!

కూతురితో పోటీ పడి మరీ.. పీహెచ్‌డీ చేసిన ఓ అమ్మ కథ..!

మాలా ద‌త్తా (Mala dutta), ఆమె కుమార్తె శ్రేయ (Shreya) ప్ర‌స్తుతం సాధార‌ణ త‌ల్లీకూతుళ్లంద‌రికీ ఎంతో ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ కలిసి పోటీప‌డి చ‌దివి మ‌రీ.. ఒకేరోజు పీహెచ్‌డీ (PHD) ప‌ట్టా పుచ్చుకోవ‌డ‌మే దీనికి కార‌ణం. సాధార‌ణంగా చాలామందికి త‌మ చ‌దువు పూర్తి చేయాల‌న్న ఆశ మ‌న‌సులో ఉంటుంది.

కానీ ఆ కోరిక‌ను కొంద‌రు మ‌న‌సులోనే ఉంచుకుంటే.. మ‌రికొంద‌రు మాత్రమే అనుకున్న‌ది సాధిస్తారు. అలాంటివారిలో ఒక‌రే మాలా ద‌త్తా. పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన త‌ర్వాత.. దాదాపు మూడు ద‌శాబ్దాల‌కు త‌న పీహెచ్‌డీ క‌ల‌ను నెర‌వేర్చుకున్నారు. అస‌లు క‌థ‌లోకి వెళ్తే..

momdautmain 364048

యాభై ఆరు సంవ‌త్స‌రాల మాలా ద‌త్తా 1985లో త‌న పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌ని పూర్తిచేశారు. డిఫెన్స్ మినిస్ట‌రీలో ఇండియ‌న్ ఎక‌న‌మిక్ స‌ర్వీస్ ఆఫీస‌ర్‌గా విధులు నిర్వ‌హించిన ఆమె 2012లో త‌న చిన్న కూతురు 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల కోసం.. విధుల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఈ స‌మ‌యంలోనే పై చ‌దువులు చ‌దువుకోవాల‌న్న త‌న కోరిక‌ను కూడా నెర‌వేర్చుకోవాల‌ని భావించార‌ట‌. దీంతో ఎడ్యుకేష‌న్ లీవ్ పెట్టి ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేయ‌డం ప్రారంభించారు.

ADVERTISEMENT

చాలా ఏళ్లు గ్యాప్ రావ‌డంతో కాస్త కష్ట‌మే అయినా.. ఆరేళ్ల‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి త‌న‌లాంటివారికే కాదు.. యంగ్ జ‌న‌రేష‌న్‌కి కూడా స్పూర్తిగా నిలిచారు. “నా కూతురితో క‌లిసి పీహెచ్‌డీ పూర్తిచేయాల‌న్న కోరికే నాకు నిరంత‌రం ప్రోత్సాహాన్ని అందించింది” అంటారామె.

మ‌రోవైపు ఆమె కుమార్తె శ్రేయ వ‌ర‌ల్డ్ బ్యాంక్‌లో క‌న్స‌ల్టెంట్‌‌గా ప‌ని చేయడం గమనార్హం. త‌ల్లి పీహెచ్‌డీ చేయ‌డం చూసి ప్రేరణ పొందిన శ్రేయ.. రెండేళ్ల త‌ర్వాత 2014లో సైకాల‌జీలో పీహెచ్‌డీ చేయ‌డం ప్రారంభించింది. ఓరోజు మాటల్లో భాగంగా.. తల్లీకూతుళ్లు ఇద్ద‌రూ ఒకేసారి పీహెచ్‌డీ పూర్తి చేసి.. ఒకేరోజు ప‌ట్టాల‌ను అందుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వారికొచ్చింది. అదే గనుక జరిగితే.. ఆ రోజు త‌మ జీవితాల్లో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంద‌ని వారు భావించారట.

అందుకే కాస్త ఇబ్బందయినా స‌రే.. శ్రేయ మూడేళ్ల‌లోనే త‌న పీహెచ్‌డీని పూర్తి చేశారు. దీనికి త‌న త‌ల్లి అందించిన ప్రోత్సాహం, తోడ్పాటు ఎంతో ఉందని తెలిపారు. ఆమె ఇచ్చిన ఆత్మస్థైర్యమే త‌న‌ని మూడేళ్ల‌లో పీహెచ్‌డీ పూర్తిచేసేలా చేసింద‌ని చెబుతుంటారు శ్రేయ‌. “మా ఇద్ద‌రి స‌బ్జెక్ట్‌లు వేర్వేరు అయినా.. అమ్మ అన్ని విషయాల్లో నాకు తోడుండి న‌న్ను ముందుకు న‌డిపించింది. అందుకే నేను నిర్ణ‌యించుకున్న స‌మ‌యం కంటే.. ముందే పీహెచ్‌డీని పూర్తి చేయ‌గ‌లిగాను”అని తెలిపారు శ్రేయ.

 

ADVERTISEMENT

Webp net resizeimage  16  9065086

ముప్ఫై నాలుగేళ్ల త‌ర్వాత పీహెచ్‌డీ పూర్తి చేసిన మాలా ద‌త్తా.. మూడేళ్ల‌లోనే పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆమె కూతురు శ్రేయ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగిన కాన్వ‌కేష‌న్‌లోనే త‌మ డిగ్రీలు తీసుకోవాల‌ని భావించారు. కానీ కుద‌ర్లేదు. దీనికి కార‌ణం కాన్వ‌కేష‌న్‌కి కేవ‌లం ఒక్క‌రోజు ముందుగా శ్రేయ వివాహం జ‌ర‌గ‌డం. అయినప్పటీకీ తల్లీ కూతుళ్లిద్దరూ కలిసి.. కాన్వ‌కేష‌న్ దుస్తులు ధ‌రించి ప‌ట్టాలు అందుకోవాలనుకున్నారు. ఆ ఆనందాన్ని సెల‌బ్రేట్ చేసుకోవాల‌నుకున్నారు. యూనివర్సిటీ వారి సహకారంతో.. ఓ వేడుకను నిర్వహించారు.

ఈ వేడుకను చూడడానికి శ్రేయ భ‌ర్త‌తో పాటు.. వారి తల్లిదండ్రులు, నాన‌మ్మ‌, తాత‌య్యలు కూడా యూనివర్సిటీకి వ‌చ్చారు. ఈ వేడుకను కుటుంబ స‌భ్యులంద‌రితో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటూ.. తల్లీ కూతుళ్లు ఇద్ద‌రూ ప‌ట్టాలు అందుకోవ‌డం.. వారి కుటుంబీకులకు కూడా ఆనందాన్ని పంచింది. 

మ‌రోవైపు తనతో పాటు, తన కూతురు కూడా ఒకే స‌మ‌యంలో  పీహెచ్‌డీ చేయ‌డం వ‌ల్ల.. ఆమె వ‌య‌సు వారితో తాను గ‌డిపే స‌మ‌యం దొరికింద‌ంటారు మాలా. కొత్త తరం ఆలోచనలను అర్థం చేసుకొనే అవకాశం కూడా దక్కిందంటారామె.  అంతేకాదు.. త‌న‌కంటే సగం వ‌య‌సులో ఉన్న‌వారితో క‌లిసి చ‌దువుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని కూడా ఆమె తెలిపారు. “ఒక్కోసారి ప్రొఫెస‌ర్లు కూడా నేను స్టూడెంట్‌ని అని మ‌ర్చిపోయి.. న‌న్ను కూడా మేడం అనే పిలిచేవారు. ఇవ‌న్నీ స‌ర‌దా అనుభూతులు.. నేను వాటిని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను” అని తెలిపారు మాల‌.

ADVERTISEMENT

delhiunive 7516156

ఢిల్లీ యూనివ‌ర్సిటీలో ఇలా త‌ల్లీకూతుళ్లు క‌లిసి పీహెచ్‌డీ ప‌ట్టా అందుకోవడం.. ఆ విద్యాలయ చ‌రిత్ర‌లోనే మొద‌టిసారి అని అధికారులు వెల్ల‌డించారు. గతంలో ఇదే యూనివర్సిటీలో.. త‌ల్లీకూతుళ్లు క‌లిసి డిగ్రీ లేదా పీజీ ప‌ట్టాలు తీసుకున్న సందర్భాలున్నాయి.  కానీ పీహెచ్‌డీ తీసుకోవ‌డం ఇదే మొద‌టిసారని విశ్వవిద్యాలయ అధికారులు తెలపడం గమనార్హం.

ఇవి కూడా చ‌ద‌వండి..

అమ్మ‌నే కానీ నాకూ అన్నీ తెలియ‌వు: మాతృమూర్తులకు సోనాలీ సందేశం

ADVERTISEMENT

బిడ్డ‌ను ఎయిర్‌పోర్ట్‌లో మ‌ర్చిపోయి ఫ్లైట్ ఎక్కిందో త‌ల్లి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..!

డియర్ మమ్మీ… నా మనసు చెప్పే మాటలు వింటావా ప్లీజ్..?

19 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT