నా జ్యోతిక.. నా జాక్ పాట్ అంటోన్న సూర్య. ఎందుకో తెలుసా?

నా జ్యోతిక.. నా జాక్ పాట్ అంటోన్న సూర్య. ఎందుకో తెలుసా?

టాలీవుడ్, కోలీవుడ్.. ఈ రెండు చిత్ర పరిశ్రమల్లోనూ అభిమానులున్న జంట సూర్య (Suriya), జ్యోతిక (Jyothika). తెరపై వీరిద్దరి నటనకు మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ ఈ జంట మధ్య ఉన్న ప్రేమకు, అనుబంధానికి ఎంతో మంది అభిమానులున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా ఇద్దరూ ఒకరిపై మరొకరికున్న ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. జ్యోతిక, రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన జాక్ పాట్ సినిమా విడుదల కార్యక్రమంలో మరోసారి ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తారు.

జ్యోతిక కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో.. పవర్ఫుల్ పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్‌ని జోరుగా కొనసాగిస్తోంది. తాజాగా ఆమె నటించిన జాక్ పాట్ (Jackpot) చిత్రం  ఆడియో ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ చిత్రానికి జ్యోతిక భర్త సూర్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్ర ఆడియో కార్యక్రమంలో మాట్లాడుతూ సూర్య తన భార్య జ్యోతికపై ప్రశంసల జల్లులు కురిపించాడు. ఈ సినిమా కోసం జ్యోతిక కష్టపడిన తీరు.. తనని ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

"పాత్రలో నటించడానికి 100 శాతం కష్టపడితే చాలు. కానీ జ్యోతిక మాత్రం 200 శాతం కష్టపడింది. ఈ విషయంలో తను ఎక్కడా కాంప్రమజ్ కాదు. తాను ఎంచుకున్న పాత్రలకు, కథకు న్యాయం చేయడానికే ప్రయత్నిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో సైతం చాలా సునాయాసంగా నటించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా కోసమే దాదాపు.. ఆరు నెలల పాటు సిలంబం (కర్రసాము) నేర్చుకుంది. మరోసారి ఆమె నుంచి మరికొన్ని విషయాలు నేర్చుకున్నా" అని సూర్య తన భార్యను పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేకాదు.. ‘నా జ్యోతిక.. నా జాక్ పాట్’ అంటూ తన భార్యపై ఉన్న ప్రేమను మరోసారి ప్రపంచానికి తెలియజేశాడు సూర్య.

Twitter

జ్యోతిక కూడా తన భర్తను అదే రీతిలో పొగిడింది. తాను సూర్యకి జాక్ పాట్ కాదని.. అతడే తనకు పెద్ద జాక్ పాట్ అని చెప్పింది. అంతేకాదు ఈ చిత్రం విషయంలో తన భర్త తనకు చేసిన సాయం గురించి సైతం ఆడియో ఫంక్షన్లో వివరించింది.  యాక్షన్ సన్నివేశాల్లో నటించినప్పుడు తనకు మంచి సలహాలిచ్చారని, వాటికి సంబంధించిన కిట్స్ సైతం కొనిచ్చారని చెప్పుకొచ్చింది జ్యోతిక.

జాక్ పాట్ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి చిత్రంలో నేను నటించలేదు. మహిళలకు అధికారం అవసరం. ఈ విషయాన్ని దర్శకుడు చాలా స్పష్టంగా అర్థమయ్యేలా తెరకెక్కించారు. సాధారణంగా సినిమాల్లో హీరోలు ఏమేం చేస్తారో ఈ సినిమాలో అవి మేం చేశాం’ అన్నారు జ్యోతిక.

జ్యోతిక ప్రధానపాత్రలో తెరకెక్కిన జాక్ పాట్  చిత్రానికి కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి రేవతి మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. సూర్య తన 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జ్యోతిక, రేవతి పోలీసు పాత్రల్లో నటించారు.

 

జ్యోతిక నటనకు దక్షిణాదిన చాలా మంది అభిమానులే ఉన్నారు.  చంద్రముఖి, మాస్, ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది ఆమె. తమిళ స్టార్ హీరో సూర్యతో వివాహమైన తర్వాత.. నటనకు స్వస్తి చెప్పింది జ్యోతిక. అయితే ఈ మధ్యే తిరిగి నటనా జీవితాన్ని పున:ప్రారంభించింది. పూర్తిగా మహిళా నేపథ్యమున్న, కథానాయిక ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ అలాంటి చిత్రాల్లోనే నటిస్తున్నారామె.

ఆమె ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే.. సెకండ్ ఇన్నింగ్స్‌లో నటిస్తున్న చిత్రాల్లోనే ఆమె నటన మరింతగా ఆకట్టుకుంటోంది. 36 వయదినిలే నుంచి  ఇటీవలే విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన రాక్షసి వరకు  వైవిధ్యమైన్న పాత్రల్లో నటిస్తూ తన అభిమానుల సంఖ్యను రోజురోజుకూ పెంచుకుంటోంది జ్యోతిక.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది