కామెడీ షో 'జబర్దస్త్' నుండి.. 'నాగబాబు' ఔట్ : అభిప్రాయ భేదాలే కారణమా..?

కామెడీ షో 'జబర్దస్త్' నుండి.. 'నాగబాబు'  ఔట్  : అభిప్రాయ భేదాలే కారణమా..?

(Naga Babu to exit from Jabardasth Comedy Show)

బుధవారం లేదా గురువారం వచ్చిందంటే చాలు.. రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్  కామెడీ షో కోసం.. ఎదురుచూసే వీక్షకులు చాలామందే ఉన్నారు.  ఆ షో గత ఏడున్నర సంవత్సరాలుగా.. ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతూనే ఉంది. ఆ షోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో.. అదే స్థాయిలో ఆ షోకి న్యాయనిర్ణేతలుగా  వ్యవహరించే నాగబాబు, రోజాలకి కూడా అంతేమంది అభిమానులున్నారు. మరీముఖ్యంగా వారిరువురు స్కిట్స్‌లో జోకులకి నవ్వే తీరు కూడా.. ఈ షో విజయానికి మరో ప్రధాన కారణం. 

'ప్రేమించిన వాడితో పెళ్లికి.. 9 ఏళ్ళ పాటు నిరీక్షించిన అనసూయ'.. ఓ అందమైన ప్రేమకథ మీకోసం

ఇప్పుడు ఈ ఇద్దరు న్యాయనిర్ణేతలలో ఒకరు మాత్రమే.. వచ్చేవారం నుండి మనకి కనిపించబోతున్నారు. దానికి ప్రధాన కారణం నాగబాబు .. ఈ జబర్దస్త్ కామెడీ షో  నుండి ఎగ్జిట్ కావడమే. ఈ క్రమంలో.. నిన్న స్వయంగా నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు అభిప్రాయాలను పంచుకున్నారు. 

"ఫిబ్రవరి 2013 నుండి మొదలైన నా జబర్దస్త్ ప్రయాణం దిగ్విజయంగా ఏడున్నర సంవత్సరాలు పాటు కొనసాగింది. అయితే నేను ఇలా జబర్దస్త్ నుండి బయటకి వెళ్ళిపోతానని మాత్రం ఎప్పుడు ఊహించలేదు. నా ఈ ప్రయాణానికి ఎంతగానో సహకరించిన మల్లెమాల యూనిట్, శ్యామప్రసాద్ రెడ్డి, ఈటీవీ యాజమాన్యాలకు నా కృతజ్ఞతలు"

"అయితే గత కొన్నిరోజులుగా నేను జబర్దస్త్ నుండి వెళ్లిపోవడానికి ఏవేవో కారణాలు ఉన్నాయని.. అవి ఆర్థికపరమైన కారణాలని రకరకాల వార్తలు ప్రసారమవుతున్నాయి. ఈ  నేపథ్యంలో ఈ వివరణ ఇవ్వడానికి నేను మీ ముందుకి వచ్చాను. జబర్దస్త్ మొదలైనప్పుడు నేను నిజంగానే ఆర్ధికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. ఇందులో కొంతవరకు వాస్తవం ఉంది. అదే సమయంలో నాకు వేరే మార్గాల ద్వారా కూడా.. అప్పటికి ఆర్ధిక వనరులు ఉన్నాయి.

కాకపోతే నా కెరీర్‌కి జబర్దస్త్ ఎంతగానో సహకరించింది. నేను జబర్దస్త్ ఎదుగుదలకి నా వంతు సహాయం చేయగలిగాను. ఇటువంటి పరిస్థితుల్లో మాకు, షో నిర్వాహకులకు మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు పొడచూపిన మాట వాస్తవమే. ఆ భేదాభిప్రాయాలు ఏంటనేవి త్వరలోనే వెల్లడిస్తాను. ఇక రెమ్యునరేషన్ గురించి వస్తున్న వార్తల్లో ఎటువంటి సత్యం లేదు. వారు నాకు రెమ్యునరేషన్ ఇచ్చింది.. నా స్థాయికి తగిందా లేదా అన్న విషయాన్ని పక్కకి పెడితే.. నేను జబర్దస్త్ నుండి బయటకి వెళ్ళడానికి ఆర్ధికపరమైన కారణాలు ఏమాత్రం కావని అని మరోసారి చెబుతున్నాను."

ఎన్టీఆర్ సరసన విదేశీ హీరోయిన్ ... 'RRR' చిత్రంలో హాలీవుడ్ నటుల సందడి

"నా ఈ ఏడున్నరేళ్ళ జబర్దస్త్ ప్రయాణం మాత్రం నేను ఎప్పటికి మర్చిపోలేను. జబర్దస్త్ సెట్‌కి వెళ్లిన ప్రతిసారి కూడా ఒక మంచి హాలిడేకి వెళ్తున్న భావనే కలిగేది. చివరగా నా జబర్దస్త్ ప్రయాణం గురించి.. దానికి సంబంధించిన ఇతరత్రా అంశాల గురించి రాబోయే రోజుల్లో మీతో పంచుకుంటాను" అని వీడియోను ముగించారు నాగబాబు.

ఇక ఈ సుదీర్ఘ వివరణతో.. జబర్దస్త్ నుండి తను బయటికి ఎందుకు వెళ్లిపోతున్నారనే విషయం పై.. ఆయన ఒక చిన్న హింట్ అయితే ఇచ్చారు. 

మొత్తానికి నాగబాబు నిష్క్రమణతో జబర్దస్త్‌లో.. కాస్త వెలితి స్పష్టంగా కనపడుతోంది. ఇక ఆయన స్థానంలో వచ్చేవారు.. ఆ లోటుని భర్తీ చేస్తారా లేదా అన్నది..? రాబోయే రోజుల్లో  కచ్చితంగా తేలిపోతుంది. మొత్తానికి ఇప్పటివరకు అందరిని నవ్విస్తున్న జబర్దస్త్ షోలో.. ఇదొక జబర్దస్త్ ట్విస్ట్ అని అందరూ చెప్పుకోవడం గమనార్హం.

మరి నాగబాబుతో పాటు.. ఇందులో స్కిట్స్ వేస్తున్న మరికొందరు కమెడియన్స్ బయటకి వెళుతుండగా.. ఈ జబర్దస్త్  షో తాలూకా టీఆర్పీ రేటింగ్స్ పై.. దాని ప్రభావం ఎంతలా పడనుండో కొద్దిరోజుల్లో తేలిపోనుంది.

"ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి.. నెలరోజులు చాలు" - నటి 'రాశి' ఆసక్తికర లవ్ స్టోరీ ..!