ADVERTISEMENT
home / Celebrity gossip
రజనీకాంత్ కుమార్తె సౌందర్యపై.. నెటిజన్లు ఎందుకు ఫైర్ అయ్యారంటే..?

రజనీకాంత్ కుమార్తె సౌందర్యపై.. నెటిజన్లు ఎందుకు ఫైర్ అయ్యారంటే..?

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్యను ఈ రోజు నెటిజన్లు ట్రోల్ చేశారు. ఆమె పట్ల కొందరు తమ ఆగ్రహాన్ని ప్రకటించారు. తమిళనాడులోని చెన్నై ప్రజలు.. నీటి కష్టాలతో సతమతమవుతుంటే.. ఆమె తన స్విమింగ్ పూల్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. సరదా కోసం నీటిని వృధా చేయడం మంచిది కాదని.. ఈ ఫోటోతో ఒక నెగటివ్ సందేశాన్ని సమాజానికి ఆమె ఇస్తున్నారని తెలిపారు. ఆ ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలని కోరారు. మరి కొందరు ఆమెకు సామాజిక బాధ్యత లేదని తెలిపారు. 

Soundarya Rajinikanth and Ved (Twitter)

వివరాల్లోకి వెళితే.. ఇటీవలే సౌందర్య రజనీకాంత్ (Soundarya Rajinikanth) తన కుమారుడు వేద్‌తో కలిసి.. స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొట్టారు. ఆ ఫోటోలను తన సామాజిక మాధ్యమ వేదికల్లో పోస్టు చేశారు. అయితే నెటిజన్ల నుండి నెగటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో.. ఆమె ఆ ఫోటోలను తొలిగించారు. కేవలం తన బిడ్డకు శారీరక వ్యాయామం చేయించడం కోసమే స్విమ్మింగ్ చేయించానని ఆమె తెలిపారు. అంతేకానీ ఎలాంటి వ్యతిరేక భావనతో ఆ ఫోటోలు పోస్టు చేయలేదని ఆమె వివరణ ఇచ్చారు. తన ట్రావెల్ డైరీ నుండి కూడా.. ఆ ఫోటోలను డిలీట్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 

ADVERTISEMENT

Rajinikanth and Soundarya (Twitter)

అయితే సౌందర్య పై ట్రోలింగ్ జరిగాక.. రజనీకాంత్ అభిమానులు ఆమెకు అండగా నిలిచారు. ట్రోలర్స్ చేసే కామెంట్లను పట్టించుకోవద్దని తెలిపారు. తమిళనాడులో నీటికొరతతో బాధపడుతున్న ప్రజలకు ఇప్పటికే రజనీకాంత్ చాలా సహాయం చేశారని.. ట్రోలింగ్ చేసేవారికి ఇలాంటి విషయాలు గుర్తుకురావని తెలిపారు. ఆ విధంగా ట్రోలర్స్‌కు వారు కౌంటర్ ఇచ్చారు. సౌందర్య కూడా తన ఫోటోలు డిలీట్ చేశాక.. సేవ్ వాటర్ అనే హ్యాష్ ట్యాగ్‌తో మరో పోస్టు చేశారు.

కాగా.. ఇటీవలే రజనీకాంత్ చెన్నైలో నీటి కొరత సమస్యపై స్పందించారు. నగరంలోని చెరువులు, రిజర్వాయర్లలో  పూడికలు తీసి వర్షపునీటిని సంరక్షించాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఈ కష్టకాలంలో ప్రజలకు వద్దకు వెళుతూ.. మంచినీటిని సరఫరా చేస్తున్న రజనీ మక్కల్ మండ్రం సేవలను కూడా ఆయన కొనియాడారు. వారు ఇలాగే ప్రజలకు చేరువవుతూ.. ఈ సేవలను ముమ్మరం చేయాలని కోరారు. 

ADVERTISEMENT

ఈ కథనాన్ని కూడా చదవండి: బాహుబలికి షాక్ ఇచ్చిన.. సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0

రజనీకాంత్ కుమార్తె సౌందర్య నిర్మాతగానే కాకుండా.. గ్రాఫిక్ డిజైనరుగా కూడా బాగా సుపరిచితులు. రజనీకాంత్ నటించిన కొచ్చాడియన్ సినిమాకి ఆమె దర్శకురాలిగా కూడా వ్యవహరించారు. భారతదేశంలోనే తొలి మోషన్ క్యాప్చర్ ఫిల్మ్‌గా ఆ చిత్రం.. అప్పట్లో వార్తల్లోకెక్కింది. ఈ చిత్రంలో స్వయానా తన తండ్రినే డైరెక్ట్ చేశారామె. ఆ తర్వాత ఆమె ధనుష్‌తో విఐపి 2 చిత్రాన్ని తెరకెక్కించారు. నరసింహ, బాబా, చంద్రముఖి, మజా, శివకాశీ, శివాజీ లాంటి సినిమాలకు కూడా గ్రాఫిక్ డిజైనరుగా సౌందర్య వ్యవహరించారు. 

ఈ కథనాన్ని కూడా చదవండి: రజినీకాంత్ స్టామినాని.. మరోసారి రుచి చూపించిన “పేట” (సినిమా రివ్యూ)

ADVERTISEMENT

Soundarya and Vishagan Vanangamudi (Twitter)

సౌందర్య రజనీకాంత్ వివాహం 2010లో అశ్విన్ రామ్ కుమార్ అనే వ్యక్తితో జరిగింది. వీరికి 2015లో వేద్ అనే అబ్బాయి జన్మించారు. 2017లో ఆయనతో ఆమె విడాకులు తీసుకున్నారు. 2019లో విషాగన్ వంగమూడి అనే వ్యాపారవేత్తను వివాహమాడారు సౌందర్య. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ అనే సినిమాకి ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా “గోవా” అనే ఓ చిత్రాన్ని నిర్మించారు. 

ఈ కథానాన్ని కూడా చదవండి: తను వచ్చేవరకూ తాళి కట్టనన్నాడు : సౌందర్యా రజనీకాంత్

Featured Image: Instagram

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

02 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT