హాట్ లుక్‌లో క్యూట్‌గా మెరిసిన.. మెగా డాటర్ నీహారిక

హాట్ లుక్‌లో క్యూట్‌గా మెరిసిన.. మెగా డాటర్ నీహారిక

బుల్లి తెర యాంకర్‌గా, నటిగా, షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది మెగా డాటర్ నీహారిక కొణిదెల (niharika konidela). మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్‌గా తనకంటూ సొంత ఇమేజ్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆమె. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ తన నటనా ప్రతిభను ప్రూవ్ చేసుకోవడానికి తన శాయశక్తులా కృషి చేస్తోంది. సాధారణంగా స్క్రీన్ పై గ్లామరస్‌గా కనిపించడానికి పెద్దగా ఆసక్తి చూపించదు నీహారిక. కానీ ఎప్పుడూ ఫ్యాషనబుల్‌గా, ట్రెండీగా కనిపించే నీహారిక.. ఈ సారి తన స్టయిల్‌కు భిన్నంగా హాట్ లుక్‌లో దర్శనమిచ్చి.. బీచ్ బ్యూటీ వైబ్స్ ఇస్తోంది.

Facebook

ఇటీవలే వైజాగ్ వెళ్లిన నీహారిక అక్కడ బీచ్‌లో సందడి చేసింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోనే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఫొటో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. వైట్ కలర్ షర్ట్, ఆరెంట్ హాట్ ప్యాంట్స్‌లో చాలా హాట్‌గా కనిపిస్తోంది మెగా భామ. తన తల్లి  తీసిన ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది.

ఈ ఫొటోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. గతంలో కంటే స్లిమ్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది నీహారిక. ఆమెను చూసిన వారంతా క్రిష్ణవంశీ సినిమాలో "సముద్రం నుంచి బయటకు వచ్చే హీరోయిన్ల" మాదిరిగా కనిపిస్తోందని అంటున్నారు. హాట్ లుక్‌లో క్యూట్‌గా ఉందని పొగుడుతున్నారు. తెరపై హాట్‌గా కనిపించడానికి ఇష్టపడని నీహారిక.. లేటెస్ట్ లుక్ చూసి స్క్రీన్ పై కూడా ఇలా కనిపించడానికి సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను మెగా క్వీన్ ఇస్తోందని భావిస్తున్నారు.   

ఈ ఫొటో విషయంలో నీహారికను ట్రోల్ చేస్తున్నవారు సైతం లేకపోలేదు. ‘ఇలాంటి  డ్రస్సులు వేసుకొని మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్నావని’ కొందరు నెటిజన్లు నీహారికను తప్పు బడుతున్నారు. మెగా ఫ్యామిలీలో పుట్టి  ఇలా చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా  ట్రోలర్స్, వారి ట్రోల్స్‌ను మెగాఫ్యామిలీకి చెందిన వారెవరూ పట్టించుకోరు. మరి ఈ విషయంలో నీహారిక ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

"సైరా" చిత్రంలో.. కథను మలుపు తిప్పే మెగా డాటర్..?

Facebook

'ఒక మనసు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నీహారిక. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత 'పింక్ ఎలిఫెంట్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి తనే నిర్మాతగా మారింది. దీని ద్వారా యూట్యూబ్ సిరీస్‌లను నిర్మించడం ప్రారంభించింది. ఆమె నటించిన "ముద్దపప్పు ఆవకాయ్" వెబ్ సిరీస్ కూడా ఆమె నిర్మించినదే. ఆ తర్వాత ‘నాన్న కూచి’ అనే మరో వెబ్ సిరీస్ నిర్మించింది. దీనిలో తన తండ్రి నాగబాబుతో కలిసి నటించింది.

ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి ప్రయత్నించింది. కాకపోతే.. అవి రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినప్పటికీ మెగాడాటర్‌గా క్రేజ్ సంపాదించుకుంది. మధ్యలో తమిళంలోనూ తన లక్ పరీక్షించుకుంది. విజయ్ సేతుపతి సరసన ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్ సినిమాలో నటించింది. నటిగా కెరీర్ ప్రారంభించక ముందే వ్యాఖ్యాతగా తెలుగు టీవీ ప్రేక్షకులకు దగ్గరైంది నీహారిక కొణిదెల. ఈటీవీలో ప్రసారమయిన ఢీ జూనియర్ 1, ఢీ జూనియర్ 2 షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరినీ మెప్పించింది.                                                 

ఇది కూడా చదవండి: మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తోన్న మ‌రో హీరో.. వైష్ణ‌వ్ తేజ్..!

Featured Image: Facebook

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది