ADVERTISEMENT
home / Bollywood
న‌య‌న‌తార ఒక్క‌రే కాదు.. వీరంతా డ్యుయెల్‌ రోల్స్‌లో అద‌ర‌గొట్టిన వారే..!

న‌య‌న‌తార ఒక్క‌రే కాదు.. వీరంతా డ్యుయెల్‌ రోల్స్‌లో అద‌ర‌గొట్టిన వారే..!

ఐరా (Aira).. న‌య‌న‌తార (Nayanatara) హీరోయిన్‌గా రూపొంది, ఇటీవ‌లే విడుద‌లైన చిత్రం. హార‌ర్ చిత్రంగా విడుద‌లైన ఈ సినిమాలో న‌య‌న‌తార డ్యుయెల్ రోల్‌లో క‌నిపించ‌డం విశేషం. అందులో ఒక పాత్ర దెయ్యంగా కూడా క‌నిపిస్తుంది. ఒక పాత్ర‌లో సాధార‌ణ అమ్మాయిగా క‌నిపించిన న‌య‌న తార‌.. మ‌రో పాత్ర‌లో మాత్రం న‌ల్ల‌ని ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపిస్తుంది. య‌మున‌, భ‌వాని పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించి అంద‌రికీ త‌న స‌త్తా మ‌రోసారి చూపించింది న‌య‌న్‌. ఈ సినిమా హిట్టా, ఫ్లాపా అన్న సంగ‌తి ప‌క్క‌న పెడితే న‌య‌న్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న మాత్రం అంద‌రినీ ఆక‌ట్టుకుంద‌నే చెప్పుకోవాలి. అయితే ఇలా డ్యుయ‌ల్ రోల్‌లో న‌టించి రెండు పాత్ర‌ల‌నూ అద్బుతంగా పండించ‌డం అంటే కాస్త ఇబ్బంద‌నే చెప్పుకోవాలి. స్క్రీన్ పై ఎక్కువ స‌మ‌యం క‌నిపించ‌డం మాత్ర‌మే కాదు.. రెండు విభిన్న‌మైన శైలుల్లో న‌టించాల్సి ఉంటుంది. కానీ మ‌న క‌థానాయిక‌లు ఈ టాలెంట్ కూడా త‌మలో ఉందంటూ రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తూ అభిమానుల‌కు క‌నువిందు చేశారు.. ఇంకొంద‌రు త్వ‌ర‌లో డ‌బుల్ రోల్స్ లో న‌టించ‌డం ద్వారా ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు కూడా!

54512023 416029765891515 4270284934052528206 n

న‌యన్ త‌ర్వాత ఇప్పుడు రూహ్అప్జా అనే చిత్రంలో జాన్వీ క‌పూర్ (janvi kapoor) కూడా రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నుంద‌ట‌. రూహి, అఫ్జానా అనే ఇద్ద‌రు అమ్మాయిల పాత్ర‌ల్లో న‌టించ‌నుంది జాన్వి. ఈ హార‌ర్ చిత్రంలో జాన్వి స‌ర‌స‌న రాజ్ కుమార్ రావ్‌, వ‌రుణ్ శ‌ర్మ‌లు క‌నిపించ‌నున్నారు. డ్యుయ‌ల్ రోల్‌లో అయినా స‌రే అద్భుతంగా క‌నిపిస్తాన‌ని చెబుతోంది జాన్వి. ఈ అమ్మ‌డు హార‌ర్ చిత్రంలో క‌నిపించ‌డం ఇదే మొద‌టిసారి. ఇలా డ్యుయ‌ల్ రోల్స్‌తో అద‌ర‌గొట్టిన కొంద‌రు టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీల గురించి తెలుసుకుందాం రండి.

samantha

స‌మంత‌

తెలుగు హీరోయిన్స్‌లో త‌న‌కంటూ ఓ చ‌క్క‌టి స్థానాన్ని సంపాదించుకుంది స‌మంత‌. అంతే కాదు.. అక్కినేని వారింటి కోడ‌లై తెలుగింటి అమ్మాయిగా స్థిర‌ప‌డిపోయింది. అయితే కోడ‌లు కాక‌ముందే అక్కినేని మూడు త‌రాల వారు క‌లిసి న‌టించిన మ‌నం చిత్రంలో క‌థానాయిక‌గా క‌నిపించింది స‌మంత‌. రెండు జ‌న్మ‌ల‌కు సంబంధించిన ఈ సినిమాలో స‌మంత కూడా రెండు పాత్ర‌ల్లో కనిపించింది. కృష్ణ‌వేణి పాత్ర‌లో మెచ్యూర్డ్‌గా త‌ల్లి పాత్ర పోషించిన స‌మంత‌, ప్రియ‌గా కాలేజీ అమ్మాయి పాత్ర‌లో బ‌బ్లీగా క‌నిపించింది. ఇదొక్క‌టే కాదు. అంత‌కుముందు త‌మిళంలో విజ‌య్ హీరోగా న‌టించిన 10ఎన్ర‌దుకుల్ల అనే చిత్రంలోనూ రెండు పాత్ర‌ల్లో క‌నిపించింది స‌మంత‌.

ADVERTISEMENT

shriya

శ్రియ‌

స‌మంత న‌టించిన ఈ మ‌నం చిత్రంలోనే రెండు జ‌న్మ‌ల‌కు చెందిన పాత్ర‌ల్లో న‌టించి ఆక‌ట్టుకుంది శ్రియా స‌ర‌న్‌. డా. అంజ‌లి, రామ‌ల‌క్ష్మి పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించింది.

anushka

అనుష్క‌

తెలుగు క‌థానాయిక‌ల్లో డ్యుయెల్ రోల్స్‌కి.. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్ర‌ల‌కు పెట్టింది పేరు అనుష్క‌. ఈ అమ్మ‌డు ముచ్చ‌ట‌గా మూడు చిత్రాల్లో డ్యుయెల్ రోల్స్ చేసింది. ఇందులో అరుంధ‌తి చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో జేజ‌మ్మ పాత్ర‌లో క‌నిపించిన అనుష్క‌.. తిరిగి మ‌ళ్లీ పుట్టిన అరుంధ‌తిగా క‌నిపించింది. ఆ త‌ర్వాత చేసిన పంచాక్ష‌రి చిత్రంలో పంచాక్ష‌రిగా, హ‌నీగా న‌టించి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఆపై త‌మిళంలో విడుద‌లైన వ‌ర్ణ సినిమాలో వ‌ర్ణ‌, రమ్య పాత్ర‌ల్లో క‌నిపించి అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా విజ‌యం సాధించ‌క‌పోయినా.. అద్భుత‌మైన గ్రాఫిక్స్‌తో అంద‌రినీ ఆకట్టుకుంది. అలాగే పంచాక్ష‌రిలో కూడా అనుష్క డ‌బుల్ రోల్స్ లోనే న‌టించి అంద‌రినీ మెప్పించింది.

kajal

కాజ‌ల్‌

కాజ‌ల్‌కి తెలుగు ప‌రిశ్ర‌మ‌లో మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన మ‌గ‌ధీర‌. ఈ సినిమా కూడా రెండు జ‌న్మ‌ల‌కు సంబంధించిందే.. ఇందులో కాజ‌ల్ మిత్ర‌విందా దేవి పాత్ర‌లో రాజ‌సాన్ని ఒల‌క‌బోస్తూనే ఇటు ఇందిర (ఇందు) పాత్ర‌లో సాధార‌ణ అమ్మాయిగా అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

tam

త‌మ‌న్నా

త‌మ‌న్నా న‌టించిన ఎందుకంటే ప్రేమంట చిత్రంలో ఆమె ముందు జ‌న్మ‌లో, మ‌ళ్లీ వ‌చ్చే జ‌న్మ‌లో ఒకే వ్య‌క్తిని ప్రేమించే అమ్మాయిగా క‌నిపిస్తుంది. అయితే ముందు జ‌న్మ‌లో శ్రీనిధిగా కుటుంబ బాధ్య‌త‌ల కోసం ప్రేమ‌ను కాదంటే.. మ‌ళ్లీ జ‌న్మ‌లో కేవ‌లం ఒక ఆత్మ రూపంలో స్ర‌వంతి పాత్ర‌లో క‌నిపిస్తుంది.

ADVERTISEMENT

char

ప్రియ‌మ‌ణి

ప్రియ‌మ‌ణి న‌టించిన చారుల‌త సినిమా ప్ర‌తిఒక్క‌రినీ భ‌య‌పెడుతుంది. థాయ్ హార‌ర్ సినిమా అలోన్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రియ‌మ‌ణి చారు, ల‌త అనే అవిభ‌క్త క‌వ‌ల‌లు గా క‌నిపిస్తుంది. మ‌ధ్య‌లో ఒక‌రు చ‌నిపోయినా.. ఆత్మ‌గా అంద‌రినీ భ‌య‌పెడుతుందీ బ్యూటీ..

వీళ్లే కాదు.. ద‌శావ‌తారం సినిమాలో అసిన్‌, గీతాంజ‌లి హార‌ర్ సినిమాలో అంజ‌లి రెండు పాత్రల్లో క‌నిపించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు.

sunny

బాలీవుడ్‌లోనూ..

డ్యుయ‌ల్ రోల్స్ విష‌యంలో టాలీవుడ్ బ్యూటీల‌కు ఏ మాత్రం తీసిపోవ‌ట్లేదు బాలీవుడ్ భామ‌లు. తామూ ముందున్నామంటూ స‌త్తా చాటుతున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ప్రియాంక గురించి చెప్పుకోవాలి. త‌ను రెండు సినిమాల్లో ఒక‌టి కంటే ఎక్కువ పాత్ర‌ల్లో క‌నిపించింది. ల‌వ్‌స్టోరీ 2050లో రెండు పాత్ర‌ల్లో క‌నిపించిన ప్రియాంక‌.. వాట్స్ యువ‌ర్ రాశి చిత్రంలో ప‌న్నెండు పాత్ర‌లు పోషించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీపికా ప‌దుకొణె కూడా అక్ష‌య్ స‌ర‌స‌న న‌టించిన చాంద్‌నీ చౌక్ టూ చైనా చిత్రంలో.. జాక్వెలిన్ రాయ్ చిత్రంలో రెండు పాత్ర‌ల్లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. ఇక కుర్ర‌కారు ఫేవ‌రెట్ సుంద‌రి స‌న్నీ లియోనీ కూడా ఎక్ ప‌హేలీ లీలా చిత్రంలో రెండు పాత్ర‌ల్లో క‌నిపించి ఆక‌ట్టుకుంది. బిపాసా డ్యుయెల్ రోల్‌చేసిన అలోన్ చిత్రం అంద‌రికీ తెలిసిందే. ఇందులో అతుక్కొని పుట్టిన క‌వ‌ల‌ల్లా కనిపించిన బిపాసా త‌న న‌ట‌న‌తో అంద‌రినీ భ‌య‌పెట్టింది. ఈ సినిమా షూటింగ్‌లోనే ఆమె ప్రేమ మొద‌లై ఆపై పెళ్లి వ‌ర‌కూ వ‌చ్చింద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనికంటే ముందే ధూమ్ చిత్రంలో సొనాలీ, మొనాలీగా రెండు పాత్ర‌ల్లో కినిపించి ఆక‌ట్టుకుందీ బ్యూటీ. ఇక వీరితో పాటు దుష్మ‌న్ చిత్రంలో కాజోల్‌, దేశీ మ్యాజిక్ చిత్రంలో అమీషా ప‌టేల్‌, మ‌క్డీ చిత్రంలో శ్వేతా బ‌సు ప్ర‌సాద్ డ్యుయెల్ రోల్స్ చేయ‌డం విశేషం.

ఇవి కూడా చ‌ద‌వండి.

ADVERTISEMENT

 వీరిని చూస్తే మ‌న సెల‌బ్రిటీల‌కు.. క‌వ‌ల‌ల్లా అనిపించ‌డం ఖాయం..!

మహేష్ బాబు వర్సెస్ మహేష్ బాబు: క్రేజీ ఫ్యాన్స్ సమక్షంలో.. ప్రిన్స్ విగ్రహం ఆవిష్కరణ..!

దీపిక అంద‌మైన‌ మైన‌పుబొమ్మ‌ను చూసి.. ర‌ణ్‌వీర్ ఏమ‌న్నాడో తెలుసా?

01 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT